Reasoning Material In Telugu

TSPSC & APPSC Maths Material Aptitude & Mental Ability Reasoning Shortcut Tricks Free Pdf Download


Practice Aptitude and Reasoning for TSPSC Group 1, Group 2, Group 3, Group 4,  VAO, SI, Constable and Other Exams.

కోడింగ్ - డీకోడింగ్




  • ఒక పదం/ అక్షర సమూహం/ విషయాన్ని మూడో వ్యక్తి గుర్తించకుండా సంకేత రూపంలో తెలియజేయడాన్ని 'కోడింగ్' అంటారు. 'డీకోడింగ్' అనేది దీనికి వ్యతిరేక ప్రక్రియ. సంకేత రూపంలో ఇచ్చిన పదం/ అక్షర సమూహం/ విషయాన్ని సాధారణ రూపంలోకి మార్చడమే 'డీకోడింగ్'.




  • ఈ విభాగంలో కొన్ని అక్షరాల సమూహాన్ని, వాటి సంకేత రూపాలను ఇస్తారు. అక్షర సమూహానికి సంకేత రూపాన్ని లేదా సంకేతం రూపానికి అసలు రూపాన్ని కనుక్కోవడంపై ప్రశ్నలు ఉంటాయి. అక్షర సమూహాల మధ్య సంకేత గుట్టును గుర్తించడం ద్వారా... ఈ ప్రశ్నలకు సమాధానాలను రాబట్టవచ్చు.




  • కోడింగ్ - డీకోడింగ్ పరీక్ష ద్వారా అభ్యర్థి అనువాద జ్ఞానాన్ని, తార్కిక ఆలోచనా శక్తిని, సమస్యా పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు ఆంగ్ల అక్షరమాల ఆరోహణ, అవరోహణ క్రమాలపై అవగాహన ఉండాలి.
    * ఆంగ్ల అక్షర క్రమంలోని వాటి సంఖ్యల స్థానాన్ని సూచించడానికి కింది క్రమం ఉపయోగపడుతుంది.
    1A26 2B25 3C24 4D23 5E22 6F217G20 8H19 9I18 10J17 11K16 12L15 13M14 14N13 15O12 16P11 17Q1018R9 19S8 20T7 21U6 22V5 23W4 24X3 25Y2 26Z1




  • కోడింగ్ - డీకోడింగ్‌లో ప్రధానంగా 5 విభాగాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
    1. లెటర్ కోడింగ్
    2. నెంబర్ కోడింగ్
    3. ప్రతిక్షేపణ
    4. మిక్స్‌డ్ కోడింగ్
    5. మిక్స్‌డ్ నెంబర్ కోడింగ్

  • లెటర్ కోడింగ్



  • దీనిలో ఒక ఆంగ్ల పదం, దాని కోడ్ రూపాన్ని ఇస్తారు. వీటి సంబంధం ఆధారంగా వేరే కొత్త పదానికి కోడ్ రూపం లేదా కోడ్ రూపానికి సంబంధించిన పదం కనుక్కోవాల్సి ఉంటుంది.



  • మొదటి రకం: సమాన తేడా గల పరీక్ష



  • ఇలాంటి ప్రశ్నల్లో ఇచ్చిన అక్షరాల మధ్య తేడా సమానంగా ఉంటుంది. కోడింగ్ చేసేటప్పుడు ఈ నిర్దిష్ట వ్యవధిని గుర్తిస్తే చాలు.
    1. TAIL ను VCKN గా రాస్తే, PEACEని ను ఎలా రాయవచ్చు?
    ఎ) RGCEG బి) QFBDF సి) RDZBD డి) QECEG
    సమాధానం: (ఎ)
    వివరణ:

    TAILలోని ప్రతి అక్షరాన్ని, రెండు అక్షరాల తర్వాత వచ్చే అక్షరంగా కోడ్ చేశారు. దీని ఆధారంగా PEACEను కిందివిధంగా రాయవచ్చు.

    2. ఒక సంకేత భాషలో TRIPPLEను SQHOOKDగా రాస్తే, DISPOSEను ఏ విధంగా రాస్తారు?
    ఎ) ESOPSID బి) DSOESPI సి) EJTPTF డి) CHRONRD
    సమాధానం: (డి)
    వివరణ:

    TRIPPLE లోని ప్రతి అక్షరాన్ని దాని ముందు అక్షరంతో కోడ్ చేశారు. అదేవిధంగా DISPOSEను కింది విధంగా రాయవచ్చు.

  • రెండో రకం: ఆరోహణ క్రమంలో తేడా గల పరీక్ష



  • ఈ ప్రశ్నల్లోని అక్షరాలను కోడింగ్ చేసేటప్పుడు అక్షరాల మధ్య తేడా ఆరోహణ క్రమం (తక్కువ నుంచి ఎక్కువకు)లో ఉంటుంది.

  • 1. ఒక సంకేత భాషలో CAPITAL ను DCSMYGS గా రాస్తే, NATIONను ఏ విధంగా రాస్తారు?
    ఎ) OCWMTT బి) OMWCTT సి) OCTMWT డి) OWCTMT
    సమాధానం: (ఎ)
    వివరణ: 

    CAPITAL లోని ప్రతి అక్షరాన్ని వరుసగా +1, +2, +3, +4, +5, +6, +7 స్థానాల తర్వాత వచ్చే అక్షరాలతో కోడ్ చేశారు. అదేవిధంగా DCSMYGSను కింది విధంగా రాయవచ్చు.


    2. ఒక సంకేత భాషలో STATE ను RRXPZగా రాస్తే INDIAను ఎలా రాయవచ్చు?
    ఎ) HALEV బి) HLAEV సి) HAELV డి) HELAV
    సమాధానం: (బి)
    వివరణ: 

    STATE లోని ప్రతి అక్షరాన్ని వరుసగా -1, -2, -3, -4, -5 స్థానాల తేడాతో వచ్చే అక్షరాలతో కోడ్ చేశారు. అదే విధంగా INDIAను కోడ్ చేస్తే కింది విధంగా ఉంటుంది.

    మూడో రకం: అవరోహణ క్రమ తేడా గల పరీక్ష



  • ఈ ప్రశ్నల్లోని అక్షరాలను కోడింగ్ చేసేటప్పుడు అక్షరాల మధ్య తేడా అవరోహణ క్రమం (ఎక్కువ నుంచి తక్కువకు)లో ఉంటుంది.

  • 1. ఒక సంకేత భాషలో RAMANIను XFWFPJగా రాస్తే RAVALIని ఏ విధంగా రాయవచ్చు?
    ఎ) XDFZNJ బి) XZDFNJ సి) XFZDNJ డి) XZDNFJ
    సమాధానం: (సి)
    వివరణ: 

    RAMANI లోని ప్రతి అక్షరాన్ని +6, +5, +4, +3, +2, +1 స్థానాల తేడాల్లో వచ్చే అక్షరాలతో కోడ్ చేశారు. ఈ అమరిక ఆధారంగా RAVALIని కింది విధంగా రాయవచ్చు.


    2. ఒక సంకేత భాషలో TELANGANA ను KWEUICXLZ గా రాస్తే ANDRA ను ఏ విధంగా రాస్తారు?
    ఎ) VAJPZ బి) VJAZP సి) VAJZP డి) VJAPZ
    సమాధానం: (డి)
    వివరణ: 

    TELANGANA లోని అక్షరాలను వరుసగా -9, -8, -7, ....., -2,-1 స్థానాల తేడాతో వచ్చే అక్షరాలతో కోడ్ చేశారు. ఈ కోడ్ ఆధారంగా ANDRAను కింది విధంగా రాయవచ్చు.

    నాలుగో రకం: ఈ ప్రశ్నల్లోని అక్షరాలను కోడింగ్ చేసేటప్పుడు, పదంలోని అక్షరాలను అంతర్గతంగా ఒక నిర్దిష్ట నియమం ప్రకారం మార్పు చేయాలి.
    1. ఒక సంకేత భాషలో CONVENTIONALను NOCENVIOTLANగా రాస్తే ENTHRONEMENTను ఏ విధంగా రాస్తారు?
    ఎ) TNEROHEMNTNE బి) NTEROHEMNNTE సి) TNEORHMENTNE డి) TNEROHEMNNTE
    సమాధానం: (ఎ)
    అక్షరాలను వ్యతిరేక క్రమంలో రాశారు. అలాగే 2, 3 సెట్లలో... 2, 3 అక్షరాలను 1, 2 అక్షరాలుగా; 1వ అక్షరాన్ని 3వ అక్షరంగా రాశారు. అదే విధంగా ENTHRONEMENTను ENT/HRO/NEM/ENTగా రాసి పై విధంగా కోడ్ చేస్తే TNEROHEMNTNEగా మారుతుంది.
    అయిదో రకం: వ్యతిరేక క్రమ పరీక్ష



  • ఈ ప్రశ్నల్లో.. ఇచ్చిన పదంలోని అక్షరాలను వ్యతిరేక క్రమంలో కోడ్ చేస్తారు.
    1. ఒక సంకేత భాషలో VIJAYAWADAను ADAWAYAJIV గా రాస్తే HYDERABADను ఏ విధంగా రాస్తారు?
    ఎ) DBAAREDYH బి) DABRAEDYH సి) DABAREDYH డి) DABRAEDYH
    సమాధానం: (సి)
    వివరణ: VIJAYAWADA లోని అక్షరాలను వ్యతిరేక క్రమంలో రాస్తే ADAWAYAJIVగా మారుతుంది. అలాగే HYDERABAD ను DABAREDYHగా మారుతుంది.

  • ఆరో రకం: ప్రత్యక్ష అక్షర కోడింగ్ పరీక్ష



  • ఈ ప్రశ్నల్లో... రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల్లోని అక్షరాలను వేరొక అక్షరాలతో సూచిస్తారు. ఏ అక్షరాన్ని దేనితో సూచించారో గుర్తించి ఇచ్చిన పదాన్ని కోడ్ చేయాలి.
    1. ఒక సంకేత భాషలో PERCEPTIONను QMPTMQXDCLగానూ RELAYED ను PMZDNMOగానూ రాస్తే, NOTICED ను ఏ విధంగా రాస్తారు?
    ఎ) LCXDOTM బి) LCXDTQM సి) LCXDTMO డి) CLXDTOM
    సమాధానం: (సి)
    వివరణ: PERCEPTION ను QMPTMQXDCLగా రాశారు.
    కాబట్టి P = Q, E = M, R = P, C = T, E = M, P = Q, T = X, I = D, O = C, N = L → (1)
    అలాగే RELAYED ను PMZDNMOగా రాశారు. కాబట్టి R = P, E = M, L = Z, A = D, Y = N, E = M, D = O →(2)
    (1), (2) నుంచి NOTICED = LCXDTMO








  • Next Chapters-ఆంగ్ల అక్షర క్రమం    మిస్సింగ్ నంబర్స్

  • పదాల తార్కిక అమరిక







  • 10 comments:

    1. The HACK is a day-long competition where you build new social apps with Facebook. Get started hacking right away, or attend our technical talks Facebook Hacking APK

      ReplyDelete
    2. Tally ERP 9 Crack patch free download 2022 is enabling medium-sized companies to carry out daily management tasks within a friendly Crack Of Tally ERP 9

      ReplyDelete
    3. Amazing birthday wishes for best friend with his/her name edit online and make beautiful bday image and send to his or her to make birthday sepcial. Good Morning Wishes For Friends

      ReplyDelete
    4. Awesome Blog!!! It is more usefull to us.. Thanks for Sharing with us... Ziyyara Edutech is your ultimate destination for top-quality online education for class 12.
      Book A Free Demo Today visit Online tuition for class 12

      ReplyDelete
    5. Experience the great outdoors with ease and comfort, courtesy of our Best Hiking Backpack with Hydration.

      ReplyDelete