Current Affairs February 2020

ఫిబ్రవరి 8

తొలి బుల్లే ట్ ప్రూఫ్ హెల్మెట్

అభేద్య ప్రాజెక్టు కింద ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ మిలటరీ ఇంజనీరింగ్ లో పనిచేస్తున్నప్పుడు భారత సైన్య మేజర్ అనుప్ మిశ్ర 10మీ దూరంలో ఏ.కే-47 రైఫిల్ నుంచి వెలువడే బులెట్ ను నిరోధించే బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ను రూపొందించారు

ఖాసీంఅల్ రమి మృతి
  • యెమెన్ లో అమెరికా దళాలు ఉగ్రవాద వ్యతిరేఖ ఆపరేషన్ లో అల్ ఖేదా ఇన్ అరేబియన్ పెనిన్సుల కీలకనేత ఖాసీం అల్ రమి మృతిచెందినాడు 
  • 1990లో అల్ ఖేదాలో పనిచేసాడు 
  • అప్ఘనిస్తానులో ఒసామా బిన్ లాడెన్ తో పనిచేసాడు . 
  • లాడెన్ ను చంపిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ నేపుట్యూన్
తెలంగాణాలో నూతన ఓటర్లు 2.99కోట్లు
  • తెలంగాణ రాష్ట్రము లో మొత్తం ఓటర్లు 2.99కోట్లు ఓటర్ లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు.
  • పురుషులు - 1,50,41,943
  • మహిళలు - 1,48,89,410
  • థర్డ్ జెండర్ - 1,590
  • కొత్తఓ టర్లు - 1,44,855
  • సర్వీస్ఓట్లు - 12,639 ఉన్నట్లు తెలిపారు
  • రాష్ట్రములోని 119 నియోజకవర్గాల్లో మరియు 34,707 పోలింగ్ స్టేషన్లు గలవు



ఫిబ్రవరి 7

రేపిస్టుల బహిరంగ ఉరికి పాక్ పార్లమెంట్ ఆమోదం
పిల్లలపై అత్యాచారాలకు, హత్యాచారాలకు పాల్పడే వారికి బహిరంగ ఉరిశిక్ష అమలు చేసే తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఫిబ్రవరి 7న ఆమోదించింది.
Current Affairs

  • దేశంలో చిన్నారులపై పెరుగుతున్న హత్యాచారాలను నియంత్రించేందుకే ఈ తీర్మానాన్ని తీసుకొస్తున్నట్లు ఆ దేశ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మొహమ్మద్ ఖాన్ చెప్పారు. 
  • హత్యాచారం చేసే వారికి కేవలం ఉరి సరిపోదని, వారికి బహిరంగ ఉరి వేయాల్సిందేనని తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన చెప్పారు. ఈ తీర్మానం మెజారిటీ ఓట్లతో పాసయింది.
  • 2018లో నౌషెరా అనే ప్రాంతంలో 8 ఏళ్ళ బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగిన దారుణ ఘటన పాకిస్తాన్‌లో సంచలన సృష్ట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2018 ఏడాదిలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 3,800 కేసులు నమోదైనట్లు అంచనా.


దేశంలో చిరుతల సంఖ్య తగ్గింది: సీడబ్ల్యూఎస్


  • దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు బెంగళూరులోని వన్య జీవుల అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్- సీడబ్ల్యూఎస్) వెల్లడించింది.
  • వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)తో కలిసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. 
  • పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి, ఉత్తర భారత శివాలిక్ పర్వతాల్లో ఎక్కువగా సంచరించే చిరుతల సంఖ్య 70-90శాతం తగ్గినట్లు తెలిపింది. గత 120-200 ఏళ్లలో ఈ చిరుతల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించింది. 
  • ఆక్యుపెన్సీ మోడలింగ్ విధానంతో చిరుతలను లెక్కించగా అనువంశికత దృష్ట్యా చిరుతల సముదాయం వైవిధ్యతను కోల్పొయిందని సీడబ్ల్యూఎస్ చెప్పింది. 


US ఛాంపియన్ పై నిషేదం
  • డోపింగ్‌లో పట్టుబడినందుకు అమెరికాకు చెందిన మహిళల టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ అబిగెయిల్‌ స్పియర్స్‌పై అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) 22 నెలలపాటు నిషేధం విధించింది.
  • 2019 యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సందర్భంగా స్పియర్స్‌కు నిర్వహించిన డోపింగ్‌ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉ్రత్పేరకాలు ప్రాస్టీరోన్, టెస్టోస్టిరాన్‌ వాడినట్లు తేలింది.
  • డోపింగ్‌ ఫలితాలు వచ్చిన తేదీ 2019 నవంబర్‌ 7 నుంచి నిషేధం అమలవుతుందని వచ్చే ఏడాది సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుందని ఐటీఎఫ్‌ తెలిపింది.
  • స్పియర్స్‌ తన కెరీర్‌లో 21 డబుల్స్‌ టైటిల్స్‌ గెలిచింది.
  • 2017 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో కొలంబియా ప్లేయర్‌ యువాన్‌ సెబాస్టియన్‌ కబాల్‌తో జతగా స్పియర్స్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది.
  • 2013, 2014 యూఎస్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగాల ఫైనల్స్‌లో స్పియర్స్‌ ఓడిపోయి రన్నరప్‌ ట్రోఫీ సాధించింది.   
నానీలు సంకలనానికి జీవనసాఫల్య అవార్డు

ప్రముఖ కవి కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత ఎన్.గోపికి మరొక విశిష్ట అవార్డుకు ఎంపికయ్యారు భారతీయ భాషా పరిషత్ 2019సంవత్సరానికి జీవనసాఫల్య అవార్డు ప్రకటించింది.
 భారతీయ భాషా పరిషత్ సంస్థ 1975లో పశ్చిమ బెంగాల్ లోఏర్పడినది .

ఇతని రచనలు
1. నిద్రపోనివ్వను
2. జలగీతం
3. నానీలు
4. వృద్ధోపనిషత్
5. తంగేడుపూలు (1976)
6. మైలురాయి (1982)
7. చిత్రదీపాలు (1989)
8.ఎండపొడ (2002)
9.జలగీతం (2002)
10.మరో ఆకాశం (2004)
11.అక్షరాల్లో దగ్ధమై (2005)
12.మళ్ళివిత్తనమ్ లోకి13.వంతేన

  • ఆచార్య ఎన్.గోపి (జూన్ 25, 1950) తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. 
  • ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధ్యక్షుడిగాను, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపసంచాలకునిగాను పనిచేశాడు. 
  • నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే నానీలు అనే సూక్ష్మ కవితా పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టాడు
  • గోపి జూన్ 25, 1950లో యాదాద్రి - భువనగిరి జిల్లా భువనగిరిలో జన్మించాడు ఈయన పూర్తిపేరు ఎన్.గోపాల్ అధ్యాపక వృత్తిలో చాలా ఏళ్లు పనిచేశాడు. 
  • ఇతని భార్య ఎన్.అరుణ కుడా పేరు పొందిన కవయిత్రి. పదవీ విరమణ చేసేటప్పడికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ మరియు హ్యుమానిటీస్ యొక్క డీన్ గా పనిచేశాడు.
విమర్శనాగ్రంధాలు
1. వేమన (1980)
2. వేమనవాదం (1979)
3. వ్యాసనవమి (1987)
4. వేమన పద్యాలు - పారిస్ ప్రతి (1990)
5. జ్ఞానదేవుడు
6. గవాక్షం (1995)
7. సాలోచన-పీఠికలు (1989)
8. నిలువెత్తు తెలుగుసంతకం సినారె వ్యక్తిత్వం

RBI కీలక రెట్లు యధాతథం
  • వడ్డీరేట్లను ప్రభావితం చేసే కీలకమైన రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లను ఎలాంటి మార్పులూ చేయకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది.. 
  • రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. 
  • ఈ ఆర్థిక సంవత్సరానికి(2019-20)గాను గురువారం ముగిసిన చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో జోలికి వెళ్లకూడదని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా తీర్మానించింది. 
  • దీంతో రెపో రేటు (దేశీయ వాణిజ్య బ్యాంకులకు తామిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 5.15 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు (దేశీయ వాణిజ్య బ్యాంకుల నుంచి తాము తీసుకున్న నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) 4.90 శాతం వద్దే ఉన్నాయి. 
  • బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లేమీ ప్రభావితం కాబోవని ఆర్బీఐ అన్నది. రూ.1 లక్ష నుంచి 5 లక్షలకు బీమాను పెంచినది. 
  • కస్టమర్లు చేసే ప్రతీ డిపాజిట్‌పై రూ.100కు 12 పైసల చొప్పున గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బ్యాంకులు ఆర్బీఐకి ఇవ్వాల్సి ఉంటుంది.. 
  • ప్రస్తుతం సీఆర్‌ఆర్ 4 శాతంగా ఉన్నది. దీని ప్రకారం బ్యాంక్ మొత్తం డిపాజిట్లలో 4 శాతానికి సమానమైన నిధులను ఆర్బీఐ వద్ద సదరు బ్యాంకర్లు తప్పక డిపాజిట్ చేయాలి. 
  • వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను దేశ జీడీపీని 6 శాతంగా అంచనా వేసిందిముఖ్యంశాలు

ముఖ్యంశాలు
  • -5.15 శాతం వద్దే రెపో రేటు
  • -రివర్స్‌రెపో 4.90 శాతం
  • -2020-21కిగాను జీడీపీ అంచనా 6 శాతం
  • -జనవరి-మార్చిలో ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండొచ్చు
  • -చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్ల సవరణ అవసరం
  • -సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సీటీఎస్
  • -ఈ నెల 4 నాటికి 471.4బిలియన్ డాలర్లుగా విదేశీ మారకపు నిల్వలు
  • -నిరుడు ఏప్రిల్-నవంబర్ నికరఎఫ్‌డీఐ 24.4 బిలియన్ డాలర్లు
  • -2010-20 (ఫిబ్రవరి 4 నాటికి) లో నికర ఎఫ్‌పీఐ 8.6బిలియన్ డాలర్లు
  • -డిసెంబర్ వరకు ఎంఎస్‌ఎంఈరుణాల పునర్‌వ్యవస్థీకరణ పొడిగింపు
  • -ఏప్రిల్ 3న తదుపరి ద్రవ్యసమీక్ష ఫలితాలు



ఫిబ్రవరి 6

అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా విరాట్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది భారత్‌లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు.
Current Affairs
ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ.1690 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. రూ.743 కోట్లతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో కోహ్లి బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది.
నలుగురు క్రికెటర్లు..2019 ఏడాదికి సంబంధించి రూపొందించిన ‘అత్యధిక బ్రాండ్ విలువ గల భారత ప్రముఖుల జాబితా’లో టాప్-20లో కోహ్లి సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు. ధోని (రూ.293 కోట్లు) 9వ స్థానంలో, సచిన్ టెండూల్కర్(రూ. 153 కోట్లు) 15వ స్థానంలో, రోహిత్ శర్మ (రూ.163 కోట్లు) 20వ స్థానంలో ఉన్నారు.

భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్‌గా సర్ ఫిలిప్
భారత్‌లో బ్రిటన్ హైకమిషనర్ (రాయబారి)గా సర్ ఫిలిప్ బార్టన్ ఫిబ్రవరి 6న నియమితులయ్యారు.
ప్రస్తుత రాయబారి సర్ డొమినిక్ అస్కిత్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బార్టన్ ప్రస్తుతం విదేశీ, కామన్‌వెల్త్ కార్యాలయంలో కాన్సులర్-సెక్యూరిటీ విభాగం డెరైక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1994లో ఢిల్లీలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా పనిచేశారు.
ఫిబ్రవరి 5
అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు
ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అలయెన్స్)గా ఏర్పాటయ్యాయి
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఫిబ్రవరి 5న ఈ కూటమి ప్రారంభమైంది.
అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, నెదర్లాండ్‌‌స, గ్రీస్ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్య దేశాలుగా చేరాయి. మత స్వాతంత్యాన్న్రి గౌరవించి, పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని కూటమిలోని సభ్య దేశాలు ప్రతినబూనాయి.