- National Youth Award: నాగర్ కర్నూల్ యువకుడికి జాతీయ యువజన అవార్డు
- కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ యువజన అవార్డును తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన శివకుమార్ అందుకున్నారు.
- శివకుమార్‌ను ఢిల్లీ పార్లమెంట్‌లో జరిగిన వేడుకలో నేషనల్ యూత్ అవార్డ్‌తో సత్కరించారు. ఈ అవార్డును కేంద్ర యువజన సంక్షేమ, క్రీడల మంత్రి మంసుఖ్ మాండవీయ అందించారు.చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా, అక్కబావల ఆలనా పాలనలో మానవ సేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో పెరగడం శివకుమార్ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.5వ తరగతిలోనే స్నేహితులతో కలిసి స్వామి వివేకానంద సేవా సంస్థను స్థాపించి, 13 ఏళ్లుగా పర్యావరణం, ప్లాస్టిక్ నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, రక్తదానం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆయన నిబద్ధతకు, సమాజం పట్ల ఆయనకున్న ప్రేమకు చిహ్నం. అంతేకాకుండా, స్వయంగా అవయవదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలవడం ఆయనలోని మానవత్వాన్ని చాటుతుంది.
- శివకుమార్.. తెలంగాణ నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తిగా గుర్తించబడారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఈ అవార్డును పొందలేదని చెప్పవచ్చు. ఆయన పర్యావరణ పరిరక్షణ, యువజన సాధికారత, విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, సామాజిక అవగాహన వంటి అనేక విభాగాల్లో చేస్తున్న సేవలను గుర్తించి ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
- 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డు దేశవ్యాప్తంగా కేవలం 12 మందికి మాత్రమే ప్రదానం చేయబడింది.
Latest News
National Youth Award: నాగర్ కర్నూల్ యువకుడికి జాతీయ యువజన అవార్డు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment