JEE Main 2025 Session 2 Day 1 Exam Analysis: జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువ ప్రశ్నలు
JEE Main 2025 Session 2 Day 1 Exam Analysis: జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం.. గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువ ప్రశ్నలు జేఈఈ మెయిన్–2025 రెండో దశ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి అడిగిన ప్రశ్నల్లో భిన్నత్వం కనిపించిందని నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. మొదటి సెషన్‌లో రసాయన శాస్త్ర ప్రశ్నలు తేలికగా ఉంటే, ఈసారి కఠినమైన ప్రశ్నలు వచ్చాయని తెలిపారు. న్యుమరికల్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సమయం సరిపోలేదని కొందరు విద్యార్థులు చెప్పారు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ లోంచి ప్రశ్నలను ట్విస్ట్ చేస్తూ ఇచ్చినట్టు నిపుణులు వెల్లడించారు.JEE Main 2025 Session 2 Day 1 Exam Analysisసాధారణంగా ఫిజిక్స్‌లో మధ్యస్తంగా స్కోర్ చేసేందుకు అవకాశం ఉండేది. ఈసారి మాత్రం కెమెస్ట్రీతో పోలిస్తే ఫిజిక్స్ విభాగంలో కొంత సులభమైన ప్రశ్నలున్నట్టు నిపుణులు తెలిపారు. గణితంలో ఈసారి సుదీర్ఘ ప్రశ్నలు కొంత తగ్గినట్లు అభిప్రాయపడ్డారు. ఈ విభాగంలో లాగరిథమ్స్, క్వాడ్రాట్రిక్ ఈక్వేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్‌ల నుంచి వచ్చిన ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు రాబట్టినట్టు పలువురు విద్యార్థులు తెలిపారు.
No comments:
Post a Comment