TET/DSC Important History Bits in Telugu

 TET/DSC Important Bits, History Questions in Telugu Part-1




1. ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాల ద్వారా మన దేశ చరిత్ర రెండు వేల సంవత్సరాల కిందటే ప్రారంభమైనట్లు తెలిసింది?

  1. 1915
  2. 1920  
  3. 1925
  4. 1910

2.  సింధూ లోయ నాగరికత ఏ నదీ ప్రాంతాల్లో వికసించింది?
1) సింధూ నది 2) ఘగ్గర్‌-హక్రా నది 
3) గంగా నది 4) 1, 2
3. ప్రాచీన ప్రపంచ చరిత్రలో ఏ దేశాన్ని సజీవ వస్తు ప్రదర్శనశాల అంటారు?
1) భారతదేశం  2) ఈజిప్ట్‌  3) చైనా  4) ఇరాక్‌
4. కిందివాటిని జతపరచండి.
1) సింధూనాగరికత  ఎ) క్రీ.పూ.500 - క్రీ.పూ.500
2) ఆర్యుల రాక   బి) క్రీ.పూ.1500 - క్రీ.పూ.1000
3) తొలి వేదకాలం  సి) క్రీ.పూ.1000 -క్రీ.పూ.600
4) మలి వేదకాలం డి) క్రీ.పూ.2500 -క్రీ.పూ.1700
1) 1 -డి, 2-సి, 3-ఎ, 4-బి     2) 1 -డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1 -సి, 2-ఎ, 3-బి, 4-డి    4) 1 -డి, 2-బి, 3-ఎ, 4-సి
5. సింధూ నాగరికత ఏయే ప్రదేశాల్లో బయటపడింది?
1) భారతదేశంలోని పంజాబ్, హరియాణా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర
2) పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధూ, బెలూచిస్థాన్‌
3) అఫ్గానిస్థాన్‌     4) పైవన్నీ
6. సింధూ నాగరికతలో గొప్ప స్నానవాటిక ఏ నగరంలో ఉండేది?
1) హరప్పా     2) మొహంజోదారో 
3) లోథాల్‌     4) కాలీభంగన్‌
7. ఏ రెండు గొప్ప ఇతిహాసాలు భారతీయ జీవితానికి, కళకు మార్గనిర్దేశం చేశాయి?
1) మహాభారతం, రామాయణం 
2) వేదాలు, పురాణాలు
3) బ్రహ్మణాలు, ఉపనిషత్తులు 
4) భగవద్గీత, భాగవతం
8. సింధూ నాగరికత ప్రజలు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారు?
ఎ) మెసపటోమియా బి) ఈజిప్ట్‌ 
సి) ఇరాన్‌     డి) ఇంగ్లాండ్‌
1) ఎ, బి    2) ఎ, బి, సి     
3) ఎ, బి, డి    4) ఎ, బి, సి, డి
9. పత్తిని మొదటిసారి పండించింది?
1) మెసపటోమియా నాగరికులు 
2) ఈజిప్ట్‌ నాగరికులు    
3) చైనా నాగరికులు  4) సింధూ నాగరికులు
10. సింధూ నాగరికుల ప్రధాన వినోదం?
1) చదరంగం ఆడటం 2) పాచికలు ఆడటం
3) ఎద్దుల పోటీలు 4) గోలీలు ఆడటం
11. ఏ నాగరికత ప్రజల లిపిని క్యూనిఫారమ్‌ అంటారు?
1) మెసపటోమియా 2) ఈజిప్ట్‌ 
3) చైనా 4) ఇండియా
12. సరస్వతి నది గురించి ఏ వేదంలో పలుమార్లు ప్రస్తావించారు?
1) యజుర్వేదం 2) రుగ్వేదం 
3) సామవేదం  4) అధర్వణ వేదం
13. శ్రుతులు అని వేటిని అంటారు?
1) వేదాలు     2) బ్రహ్మణాలు 
3) అరణ్యకాలు 4) ఉపనిషత్తులు
14. ‘‘వేద కాలానికే మరలా వెళ్లాలి’’ అని పిలుపునిచ్చింది ఎవరు?
1) రాజా రామ్మోహన్‌ రాయ్‌ 2) స్వామి వివేకానంద 
3) దయానంద సరస్వతి      4) పండిత రమాబాయి
15. భారతీయ సంగీతం మూలాలు ఏ వేదంలో ఉన్నాయి?
1) రుగ్వేదం     2) యజుర్వేదం 
3) సామవేదం 4) అధర్వణ వేదం
16. ఆత్మ, ప్రకృతికి సంబంధించిన రహస్యాలను తెలిపే గ్రంథాలు?
1) ఉపనిషత్తులు 2) అరణ్యకాలు 
3) బ్రహ్మణాలు 4) వేదాలు
17. తొలి వేద కాలం నాటి రాజకీయ జీవనానికి  సరిపోలని అంశాన్ని గుర్తించండి.
1) ఆర్యులు తెగలుగా నివసించేవారు.
2) తెగల నాయకుడిని రాజన్‌ అంటారు.
3) రాజరికం వంశపారంపర్యంగా ఉండేది.
4) రాజుకు పరిపాలనా విషయంలో సలహాలు ఇచ్చేందుకు సభ, సమితి అనే రెండు సభలు ఉండేవి.
18. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
1) రామాయణం, మహాభారతం అనేవి రెండు గొప్ప ఇతిహాసాలు.
2) ఆదికావ్యంగా పిలిచే మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు.
3) రామాయణాన్ని సంస్కృతంలో వాల్మీకి రచించాడు.
4) అధర్మంపై ధర్మం సాధించిన విజయమే మహాభారతంగా చెబుతారు.
19. యజ్ఞయాగాది క్రతువుల్లో పాటించాల్సిన నియమాల గురించి తెలిపే వేదం?
1) రుగ్వేదం     2) యజుర్వేదం 
3) సామవేదం 4) అధర్వణ వేదం
20. కిందివాటిలో మలివేద కాలానికి సరిపోలని అంశమేది?
1) ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది.
2) స్త్రీల స్థానం దిగజారింది.
3) వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది.
4) బాల్య వివాహాలు, సతీసహగమనం వీరి కాలంలో లేవు.
21. మలివేద కాలంలో రాజులు దేనికోసం అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసేవారు?
1) రాజ్య విస్తరణకు 
2) పంటలు బాగా పండటానికి
3) సిరిసంపదలు కలగడానికి     
4) పైవన్నీ
22. విద్యా వాదం, క్రతువులు, సంస్కారాల గురించి తెలియజేసేది-
1) బ్రహ్మణాలు     
2) అరణ్యకాలు 
3) ఉపనిషత్తులు 4) ఇతిహాసాలు
23. సంస్కృత భాషలో వేదమంటే?
1) శాస్త్రీయ జ్ఞానం     
2) ఆధ్యాత్మిక జ్ఞానం
3) ఆత్మ జ్ఞానం     
4) దైవ చింతన
24. హోరియోగ్లైఫిక్‌ లిపిని కలిగిన నాగరికత?
1) చైనా నాగరికత     
2) ఇండియా నాగరికత
3) మెసపటోమియా నాగరికత 
4) ఈజిప్ట్‌ నాగరికత
25. సింధూ ప్రజలు వేటిని పూజించేవారు?
1) వేపచెట్టు     2) రావి చెట్టు 
3) భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు 
4) పైవన్నీ
26. ఇతిహాసాల్లో ఇది ఒకటి
1) గీతాంజలి     2) శృంగార నైషధం
3) రామాయణం 4) వేదాలు
27. మొహంజోదారో, హరప్పా తవ్వకాలను ఏ సంవత్సరంలో నిర్వహించారు?
1) 1920   2) 1910   3) 1930  4) 1940
28. సింధూ నాగరికత ఏ నదుల వెంట అభివృద్ధి చెందింది?
1) సింధూ, ఘగ్గర్‌ - హక్రా     2) గోదావరి, కృష్ణా
3) గంగా, యమున  4) గంగ, బ్రహ్మపుత్ర
29. సింధూ నాగరికత ఏ దేశంలో కనిపించలేదు?
1) భారతదేశం 2) పాకిస్థాన్‌ 
3) అఫ్గానిస్థాన్‌ 4) బంగ్లాదేశ్‌
30. హరప్పా నాగరికత ఎప్పుడు అభివృద్ధి చెందింది?
1) క్రీ.పూ.2500-1700     2) క్రీ.శ.2500-1700
3) క్రీ.పూ.1700-1000     4) క్రీ.శ.1700-1000
31. రాజులు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసే యజ్ఞయాగాదుల ఆచారాలు?
1) అశ్వమేధ     2) రాజసూయ 
3) 1, 2     4) ఏదీకాదు
32. ఇది హరప్పా నాగరికతలో ప్రసిద్ధ నౌకాశ్రయం?
1) హరప్పా     2) కాలీభంగన్‌ 
3) లోథాల్‌     4) మొహంజోదారో
33. పశుపతి (శివుడు), తల్లి (అమ్మ) దేవతలను పూజించినవారు?
1) సింధూ ప్రజలు  2) ఆర్యులు
3) మెసపటోమియన్లు  4) ఈజిప్షియన్లు
34. ఏ నాగరికతలో ఫారోలు రాజ్యాన్ని దేవతలుగా  పరిపాలించారు?
1) ఈజిప్ట్‌     2) మెసపటోమియా 
3) సింధూ లోయ 4) చైనా
35. ‘సింధూ నాగరికత విధ్వంసానికి ఆర్యుల దండయాత్ర కారణం’ అనే సిద్ధాంత ప్రకటనను ఏ  చరిత్రకారుడు తిరస్కరించాడు?
1) మార్టిన్‌ వీలర్‌  2) దయారాం సాహ్ని
3) ఆర్‌.సి. మజుందార్‌  4) టాయన్‌ బీ
36. ఏ కాలంలో ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది?
1) సింధూలోయ కాలం 2) ప్రారంభ వేద కాలం 
3) మలి వేదకాలం 4) పూర్వచరిత్ర కాలం
37. ఏ కాలంలో బ్రహ్మ, విష్ణు, శివుడు ప్రాముఖ్యత పొంది, పూజలందుకున్నారు?
1) సింధూలోయ కాలం  2) ప్రారంభ వేదకాలం
3) మలి వేదకాలం  4) పూర్వ చరిత్రకాలం
38. యాగాల సమయంలో పాటించాల్సిన నియమాల వివరాలు ఎందులో ఉన్నాయి?
1) రుగ్వేదం     2) యజుర్వేదం 
3) సామవేదం 4) అధర్వణ వేదం
39. వేదం అనే పదానికి సంస్కృతంలో అర్థం?
1) ఉన్నతమైన జ్ఞానం 
2) దేవుడి గురించి జ్ఞానం
3) దైవిక విషయాల గురించి జ్ఞానం
4) రాష్ట్ర పరిపాలన గురించి జ్ఞానం
40. ఏ వేదం శ్లోకాలు, పాటల సమాహారం?
1) రుగ్వేదం     2) యజుర్వేదం 
3) సామవేదం 4) అధర్వణ వేదం
41. వేటిలో యజ్ఞాలు, యాగాలు, ఆచారాల గురించి గద్య రూపంలో ఉన్నాయి?
1) ఉపనిషత్తులు 2) ఇతిహాసాలు 
3) అరణ్యకాలు  4) బ్రహ్మణాలు
42. ఇవి విద్యావాదం, క్రతువులు, సంస్కారాలకు సంబంధించినవి-
1) ఉపనిషత్తులు 2) ఇతిహాసాలు 
3) అరణ్యకాలు 4) బ్రహ్మణాలు
43. కిందివాటిలో ఏవి ఆత్మ, ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు?
1) ఉపనిషత్తులు 2) ఇతిహాసాలు 
3) అరణ్యకాలు  4) బ్రహ్మణాలు
44. ఘోష, అపలా, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర మొదలైనవారు ఎవరు?
1) గొప్ప వేద పండితులు     
2) రాణులు
3) రాయబారులు 
4) రాజుల సభల్లో అధికారులు
సమాధానాలు
1-2; 2-4; 3-1; 4-2; 5-4; 6-2; 7-1; 8-2; 9-4; 10-3; 11-1; 12-2; 13-1; 14-3; 15-3; 16-1; 17-3; 18-2; 19-2; 20-4; 21-1; 22-2; 23-3; 24-4; 25-4; 26-3; 27-1; 28-1; 29-4; 30-1; 31-3; 32-3; 33-1; 34-1; 35-1; 36-3; 37-3; 38-2; 39-1; 40-4; 41-4; 42-3; 43-1; 44-1.
x

No comments:

Post a Comment