List of prime ministers of India : 1947 నుండి 2024 వరకు భారత ప్రధానులు

List of prime ministers of India : 1947 నుండి 2024 వరకు భారత ప్రధానులు

 1947 నుండి 2024 వరకు పనిచేసిన భారత ప్రధానిల జాబితా పొందండి. భారత ప్రధానమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యనిర్వాహకుడుగా వ్యవహరిస్తాడు. భారత రాష్ట్రపతి రాజ్యాంగ సంబంధమైన దేశాధినేత అయినప్పటికీ, కార్యనిర్వాహక అధికారం ప్రధానమంత్రికి మరియు వారు ఎన్నుకున్న మంత్రి మండలికి ఉంటుంది. భారత పార్లమెంటు దిగువసభలో మెజారిటీతో పార్టీచే ఎన్నుకోబడిన నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు.

ప్రధానమంత్రిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే తప్ప, ప్రతి ఐదేళ్లకు ప్రత్యక్షంగా ఎన్నికయ్యే మెజారిటీ లోక్‌సభ సభ్యుల విశ్వాసాన్ని ప్రధాన మంత్రి పొందవలసి ఉంటుంది. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. కౌన్సిల్ సభ్యుల ఎంపిక మరియు తొలగింపును ప్రధానమంత్రి ఏకపక్షంగా నియంత్రిస్తారు.

1947 నుండి 2024 వరకు భారతదేశానికి మొత్తం 14 మంది ప్రధాని మంత్రులు పనిచేసారు. జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా పనిచేసారు. నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 1966లో భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అలానే ఆమె భారత ఏకైక మహిళా ప్రధానిగా పనిచేసిన ఘనత సాధించారు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Nehru

1. జవహర్‌లాల్ నెహ్రూ

  • మొదటి విడత : 15 ఆగష్టు 1947 నుండి 15 ఏప్రిల్ 1952
  • రెండవ విడత 15 ఏప్రిల్ 1952 నుండి 17 ఏప్రిల్ 1957
  • మూడవ విడత 17 ఏప్రిల్ 1957 నుండి 2 ఏప్రిల్ 1962
  • నాల్గొవ విడత 2 ఏప్రిల్ 1962 నుండి 27 మే 1964
  • జవహర్‌లాల్ నెహ్రూ 14 నవంబర్ 1889 లో జన్మించారు. 27 మే 1964లో ప్రధాని హోదాలో ఉంటూ గుండెపోటుతో మరణించారు.
  • జవహర్‌లాల్ నెహ్రూ 16 సంవత్సరాలు, 286 రోజులు ప్రధానిగా విధులు నిర్వర్తించారు.
  • రాజకీయ పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
  • జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశపు మొదటి ప్రధాని మరియు భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని.
  • జవహర్‌లాల్ నెహ్రూ పదవిలో ఉంటుండగా మరణించిన మొదటి ప్రధాని.
  • నెహ్రూ జైలులో రాసిన పుస్తకాలు : లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిస్ డాటర్ (1929), యాన్ ఆటోబయోగ్రఫీ (1936) మరియు ది డిస్కవరీ ఆఫ్ ఇండియా (1946).
  • నెహ్రూ 1955లో భారతరత్న అవార్డు అందుకున్నారు.
  • జవహర్‌లాల్ నెహ్రూ తల్లిదండ్రులు : మోతీలాల్ నెహ్రూ మరియు స్వరూప్ రాణి నెహ్రూ.
  • నెహ్రూ జన్మదినం నవంబర్ 14న యేటా భారతదేశంలో బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.
  • నెహ్రూ ప్రధానిగా ఉండగా భారత అధ్యక్షులు : జార్జ్ VI (1950 వరకు (చక్రవర్తి), లార్డ్ మౌంట్ బాటన్, సి.రాజగోపాలాచారి (గవర్నర్స్ జనరల్స్), రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ (రాష్ట్రపతులు)
Gulzarilal Nanda

2. గుల్జారీలాల్ నందా

  • పదవీకాలం : 27 మే 1964 నుండి 9 జూన్ 1964
  • పదవీకాలం: 13 రోజులు
  • పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
  • భారతదేశం యొక్క మొదటి తాత్కాలిక ప్రధాని (అక్టింగ్ పీఎం)

గుల్జారీలాల్ నందా 1898 జూలై 4న పంజాబ్‌లోని సియాల్‌కోట్‌లో పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో జన్మించారు. గుల్జారీలాల్ నందా రెండు పర్యాయములు 13 రోజుల చెప్పున భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించారు. తొలి సారి 1964లో జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత, రెండవ సారి 1966లో లాల్ బహుదూర్ శాస్త్రి మరణం తర్వాత ఆయన తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. గుల్జారీలాల్ నందా 1997లో మరణానంతరం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు.

Lal Bahadur Shastri

3. లాల్ బహదూర్ శాస్త్రి

  • పదవి కాలం : 9 జూన్ 1964 నుండి 11 జనవరి 1966 (1 ఏడాది, 216 రోజులు)
  • రాజకీయ పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
  • భారత దేశ రెండవ ప్రధానమంత్రి
  • జై జవాన్ జై కిసాన్' నినాదం ఇచ్చింది శాస్త్రి గారే
  • లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబరు 2న చిత్రగుప్తవంశీ కాయస్థ కుటుంబంలో జన్మించారు.
  • 1965 ఇండో-పాకిస్తాన్ యుద్ధ అనంతరం 10 జనవరి 1966న జరిగిన తాష్కెంట్ డిక్లరేషన్ తర్వాత రోజు 11 జనవరి 1966న ఆయన మరణించారు.
  • శాస్త్రి 1966లో మరణానంతరం భారతరత్న అవార్డు అందుకున్నారు.
  • శాస్త్రి గారు భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రోత్సహించారు.
  • 1965 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో శాస్త్రిగారు దేశానికి నాయకత్వం వహించారు.
  • 1965 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం సమయంలో అతని 'జై జవాన్, జై కిసాన్' నినాదం బాగా ప్రాచుర్యం పొందింది.
Indira Gandhi

4. ఇందిరా గాంధీ

  • భారతదేశ మొదటి మరియు ఏకైక మహిళా ప్రధాన మంత్రి
  • మొదట విడత : 24 జనవరి 1996 నుండి 4 మార్చి 1967
  • రెండవ విడత : 4 మార్చి 1967 - 15 మార్చి 1971
  • మూడవ విడత :15 మార్చి 1971 - 24 మార్చి 1977

ఇందిరా గాంధీ 19 నవంబర్ 1917న అలహాబాద్‌లో జన్మించారు. ఆమె తండ్రి భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఇందిరా, ఆమె తండ్రి నెహ్రు తర్వాత అత్యధికంగా 15 సంవత్సరాల 350 రోజులు ప్రధానిగా పని చేశారు. ఇందిరాను హెన్రీ కిస్సింగర్ "ఐరన్ లేడీ"గా అభివర్ణించారు.

ఇందిరా గాంధీ దేశంలో వేర్పాటువాద ధోరణులను ఉదహరిస్తూ 1975 నుండి 1977 వరకు అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ సమయంలో దేశంలో ప్రాథమిక పౌర హక్కులు నిలిపివేయబడ్డాయి, ప్రెస్ సెన్సార్ చేయబడింది. ఈ సిక్కు వేర్పాటువాద ఉద్యమాన్ని ఆపేందుకు ఆమె ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశించారు. ఇది గోల్డెన్ టెంపుల్‌లో సైనిక చర్యకారణమై వందలాది సిక్కుల మరణానికి కారణమైంది. దీనికి ప్రతీకార చర్యగా ఆమె 31 అక్టోబరు 1984న, ఆమె అంగరక్షకుల చేతిలో హత్యకు గురయ్యారు.

ఇందిరా గాంధీ తన పదవీకాలంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా నాయకురాలుగా గుర్తింపు పొందారు. భౌగోళిక రాజకీయ ప్రత్యర్థులు చైనా మరియు పాకిస్తాన్‌లపై స్పష్టమైన విజయాలు సాధించారు. 1980లలో హరిత విప్లవంకు మద్దత్తు అందించారు. 1999లో, బీబీసీ నిర్వహించిన ఆన్‌లైన్ పోల్‌లో "ఉమెన్ ఆఫ్ ది మిలీనియం"గా ఎంపికయ్యారు. 2020లో టైమ్ మ్యాగజైన్ యొక్క ప్రపంచ 100 మంది శక్తివంతమైన మహిళలలో ఇందిరా చోటు దక్కించుకున్నారు.

Morarji Desai

5. మొరార్జీ దేశాయ్

  • మొరార్జీ దేశాయ్ భారతదేశానికి మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి
  • భారత రాజకీయ చరిత్రలో 81 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన అతి పెద్ద వ్యక్తి
  • మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి ప్రధానిమంత్రి
  • పదవీకాలం : 24 మార్చి 1977 నుండి 28 జూలై 1979
  • మొరార్జీ దేశాయ్ 29 ఫిబ్రవరి 1896 గుజరాతీ అనవిల్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1995 లో 99 సంవత్సరాల వయస్సులో మరణించారు.
  • ఈయన ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా మరియు ఉప ప్రధానమంత్రిగా సేవలు అందించారు.
  • 1977లో వివాదాస్పద ఎమర్జెన్సీ ఎత్తివేయబడిన తర్వాత , జనతా పార్టీ గొడుగు కింద పోరాడి 1977 ఎన్నికల్లో విజయం సాధించారు.
  • 1974లో భారతదేశం యొక్క మొదటి అణు పరీక్ష తర్వాత, చైనా మరియు పాకిస్తాన్‌లతో స్నేహపూర్వక సంబంధాల పునరుద్ధరణకు కృషి చేశారు.
  • 1990లో పాకిస్తాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్-ఎ-పాకిస్తాన్‌ అందుకున్నారు.
  • 1991లో భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అందుకున్నారు.
  • మొరార్జీ దేశాయ్ పంతొమ్మిదవ శతాబ్దంలో జన్మించిన రెండవ మరియు చివరి ప్రధానమంత్రి.
Charan Singh

6. చరణ్ సింగ్

  • చౌదరి చరణ్ సింగ్ భారతదేశానికి 5వ ప్రధానమంత్రి
  • యూపీలో పుట్టిన తోలి ప్రధానమంత్రి
  • ప్రధాని మంత్రిగా ఒక్కసారిగా కూడా పార్లమెంటులో అడుగుపెట్టని పీఎం
  • భారతదేశ రైతుల ఛాంపియన్‌గా ప్రసిద్ధి
  • చరణ్ సింగ్ 1903 డిసెంబర్ 23న గ్రామీణ రైతు కుటుంబంలో జన్మించాడు. 29 మే 1987లో మరణించారు.
  • చరణ్ సింగ్ 1967 - 1968 మరియు 1970 లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
  • చరణ్ సింగ్ కేవలం 23 రోజుల పప్రధానిగా నిలిచిపోయారు. పార్లమెంటు విశ్వాసాన్ని పొందలేకపోయిన ఏకైక ప్రధానమంత్రిగా నిలిచాడు.
  • 1979లో  జనతా పార్టీ (సెక్యులర్) , సోషలిస్ట్ పార్టీ మరియు ఒరిస్సా జనతా పార్టీలను విలీనం చేయడం ద్వారా లోక్ దళ్‌పార్టీ స్థాపించాడు.
Rajiv Gandhi

7. రాజీవ్ గాంధీ

  • 1984 నుండి 1989 వరకు భారతదేశ 6వ ప్రధానమంత్రిగా పనిచేశారు
  • అతి చిన్న వయస్సులో (40 ఏళ్ళు) ప్రధాని మంత్రి అయ్యారు
  • రాజకీయ పార్టీ : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
  • 1991లో మరణానంతరం భారతరత్న అందుకున్నారు.
  • రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న బొంబాయిలో ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ దంపతులకు జన్మించారు.
  • ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు ప్రొఫెషనల్ పైలట్‌గా సేవలు అందించారు.
  • 1984 లో తల్లి ఇందిరా మరణం తర్వాత భారత 6వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
  • రాజీవ్ 40 సంవత్సరాల వయస్సులో అతి పిన్న వయస్కుడైన భారత ప్రధానమంత్రిగా నిలిచారు.
  • 1991 ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఎల్‌టిటిఇకి చెందిన ఆత్మాహుతి బాంబర్‌చే రాజీవ్ చంపబడ్డాడు.
  • తల్లి ఇందిరా తర్వాత ప్రధాని హోదాలో హత్యచేయబడ్డ రెండవ ప్రధానిగా రాజీవ్ నిలిచారు.
  • 1985లో రాజీవ్ హయాంలో ఫిరాయింపుల నిరోధక చట్టం ఆమోదించబడింది.
Vishwanath Pratap Singh

8. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్

  • 1989 నుండి 1990 వరకు భారతదేశానికి 7వ ప్రధానమంత్రి
  • 1980లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పని చేశారు.
  • మందా (రాజా బహదూర్) జమీందారీ వంశం నుండి ఎన్నికైన ఏకైక భారతదేశ ప్రధానమంత్రి.
  • అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీవిరమణ చేసిన మొదటి ప్రధాని
  • వీపీ సింగ్ 25 జూన్ 1931న హిందూ రాజ్‌పుత్ జమీందార్ కుటుంబంలో జన్మించాడు.
  • మండాకు చెందిన రాజా బహదూర్ రామ్ గోపాల్ సింగ్ చేత దత్తత తీసుకోబడ్డాడు.
  • 1941లో 10 సంవత్సరాల వయస్సులో మండాకు రాజా బహదూర్ అయ్యాడు.
  • వీపీ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి ప్రధాని అయిన రెండవ నాయకుడు.
  • ఈయన ప్రధానిగా వెనుకబడిన కులాల కోసం మండల్ కమిషన్ నివేదికను అమలు చేశాడు.
Chandra Shekhar

9. చంద్ర శేఖర్

  • చంద్ర శేఖర్ భారతదేశ 8వ ప్రధానమంత్రిగా పనిచేశారు
  • పదవీకాలం 10 నవంబర్ 1990 మరియు 21 జూన్ 1991
  • ఉత్తరప్రదేశ్ నుండి ప్రధాని అయిన మూడవ వ్యక్తి
  • చంద్ర శేఖర్ 1983లో కన్యాకుమారి నుండి న్యూఢిల్లీ వరకు భారత్ యాత్ర చేపట్టారు

చంద్ర శేఖర్ 1927 ఏప్రిల్ 17న ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలోని ఇబ్రహీంపట్టి అనే గ్రామంలో రాజపుత్ర కుటుంబంలో జన్మించారు. ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. చంద్ర శేఖర్ సోషలిస్టులలో ప్రముఖ నాయకుడుగా పేరుపొందారు. ఈయన 1964లో కాంగ్రెస్‌లో చేరారు. 1962 నుంచి 1967 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1977లో తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1977 నుండి 1988 వరకు జనతా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు.

1990లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవీవిరమణ చేసిన వీపీ సింగ్ తర్వాత విడిపోయిన జనతాదళ్ బయట మద్దతుతో ఏర్పాటు చేసిన మైనారిటీ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించారు. సమాజ్‌వాదీ జనతా పార్టీకి చెందిన 64 ఎంపీలు మరియు ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ మద్దతుతో ఈ ప్రభుత్వం ఏర్పడింది. ఈ తీర్మానానికి ఓటు వేసిన ఎనిమిది మంది జనతాదళ్ ఎంపీలను స్పీకర్ రబీ రే నాడు అనర్హులుగా ప్రకటించారు. అయితే రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఈయన ప్రభుత్వం అధికారం కోల్పోయింది. చంద్ర శేఖర్ కేవలం 223 రోజులు భారత ప్రధానిగా పనిచేసారు.

P. V. Narasimha Rao

10. పి.వి.నరసింహారావు

  • 1991 నుండి 1996 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేశారు
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రధాని అయిన మొదటి వ్యక్తి
  • హిందీ మాట్లాడం రాని & దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన మొదటి వ్యక్తి
  • ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు ఒడిశా రాష్ట్రాల నుండి 7 సార్లు ఎంపీగా గెలుపొందారు

పి.వి.నరసింహారావు 28 జూన్ 1921న నేటి తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1969లో భారత జాతీయ కాంగ్రెస్‌ను చీల్చి కొత్త కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో ఇందిరా గాంధీకి మద్దతు ఇచ్చారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఏర్పడ్డ మైనారిటీ ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహించే అవకాశం ఆయనకు లభించింది. పి.వి.నరసింహారావు నెహ్రూ-గాంధీ కుటుంబానికి వెలుపల ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా ప్రధానమంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తిగా నిలిచారు.

ఈయన హయాంలోనే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్దికమంత్రిగా చేశారు. ఈ ద్వయం 1991 ఆర్థిక సంక్షభం నుండి ఇండియాను కాపాడింది. పి.వి.నరసింహారావును భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు నిజమైన పితామహుడుగా పేర్కొంటారు. పీవీ గార సిక్కు వేర్పాటువాద ఉద్యమాన్ని విజయవంతంగా నిర్మూలించారు. కాశ్మీరీ వేర్పాటువాద ఉద్యమాన్ని కొంత మేరకు తటస్థీకరించారు. రావు ప్రభుత్వం భారతదేశం యొక్క మొట్టమొదటి తీవ్రవాద వ్యతిరేక చట్టాన్ని ( టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (నివారణ) చట్టం) ప్రవేశపెట్టింది. ఈయన హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది.

Atal Bihari Vajpayee

11. అటల్ బిహారీ వాజ్‌పేయి

  • అటల్ బిహారీ వాజ్‌పేయి భారతదేశానికి 10వ ప్రధానమంత్రిగా పనిచేసారు
  • వాజ్‌పేయి బిజెపి సహ వ్యవస్థాపకులలో ఒకరు
  • పూర్తి కాలం పదవిలో పనిచేసిన మొదటి కాంగ్రెస్ యితర భారత ప్రధానమంత్రి
  • ఈయన హయాంలోనే భారతదేశం 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలను నిర్వహించింది
  • వాజ్‌పేయి 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కన్యాకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.
  • వాజ్‌పేయి బిజెపి సహ వ్యవస్థాపకులలో ఒకరు. ఈయన హిందూ జాతీయవాద స్వచ్చంద సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ సభ్యుడు కూడా.
  • వాజ్‌పేయి ఐదు దశాబ్దాలకు పైగా భారత పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు. లోక్‌సభకు రెండుసార్లు, రాజ్యసభకు పదిసార్లు ఎన్నికయ్యారు.
  • వాజ్‌పేయి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రి అయ్యారు.
  • 1980లో బీజేపీని స్థాపించక, దాని మొదటి అధ్యక్షుడుగా వాజ్‌పేయి బాధ్యతలు నిర్వర్తించారు.
  • నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25ని సుపరిపాలన దినంగా గుర్తించాలని ప్రకటించింది.
  • 2015 లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందించారు.
  • వాజ్‌పేయి 2018 లో వయస్సు సంబంధిత అనారోగ్యంతో మరణించారు.
  • వాజ్‌పేయి మూడు పర్యాయాలు భారత ప్రధాని మంత్రిగా పని చేశారు.
  • మొదటి పర్యాయం  16 మే 1996 నుండి 1 జూన్ 1996 వరకు. బాబ్రీ మసీదు కూల్చివేత ఫలితంగా దేశవ్యాప్తంగా మతపరమైన ధ్రువణత కారణంగా 1996 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్లమెంటులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే సభ్యులలో మెజారిటీని కూడగట్టడంలో విఫలం అవ్వడంతో కేవలం 16 రోజులలో ప్రభుత్వం కూలిపోయింది.
  • రెండవ మరియు మూడవ పర్యాయం 19 మార్చి 1998 నుండి 22 మే 2004 (6 సంవత్సరాలు, 64 రోజులు) వరకు.
H. D. Deve Gowda

12. హెచ్‌డి దేవెగౌడ

  • భారతదేశానికి 11వ ప్రధానిమంత్రిగా 1 జూన్ 1996 నుండి 21 ఏప్రిల్ 1997 వరకు పని చేశారు
  • దేవెగౌడ దక్షిణ భారతదేశం నుండి ప్రధాని అయిన రెండవ వ్యక్తి
  • దేవెగౌడ కర్ణాటక నుండి ప్రధాని అయిన మొదటి వ్యక్తి
  • దేవెగౌడ కర్ణాటక 14వ ముఖ్యమంత్రిగా పనిచేశారు

హెచ్‌డి దేవెగౌడ 1933 మే 18న మైసూర్ పరిధిలోని హోలెనరసిపురా తాలూకాలోని హరదనహళ్లి అనే గ్రామంలో జన్మించారు. 1996 సార్వత్రిక ఎన్నికలలో పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మక ఓటమి తర్వాత యునైటెడ్ ఫ్రంట్ (కాంగ్రెస్ మరియు బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల సమ్మేళనం) కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో దేవెగౌడ అనూహ్యంగా ప్రభుత్వ సారథిగా ఎంపికయ్యారు.

Inder Kumar Gujral

13. ఇందర్ కుమార్ గుజ్రాల్

  • ఏప్రిల్ 1997 నుండి మార్చి 1998 వరకు భారతదేశానికి 12వ ప్రధానమంత్రిగా పనిచేశారు
  • ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు
  • దేవెగౌడ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.
  • 1976లో సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు

ఇందర్ కుమార్ గుజ్రాల్ 4 డిసెంబర్ 1919న ఒక పంజాబీ హిందూ ఖత్రీ కుటుంబంలో జన్మించారు. ఇందర్ కుమార్ గుజ్రాల్ పంజాబ్ నుండి భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి. రాజ్యసభ సభ్యులలుగా భారతదేశ ప్రధానమంత్రి అయిన వారిలో ఇందిరా గాంధీ, హెచ్‌డి దేవెగౌడ, ఇందర్ డా. మన్మోహన్ సింగ్ లతో పాటుగా ఇందర్ కుమార్ గుజ్రాల్ కూడా ఉన్నారు.

Manmohan Singh

14. మన్మోహన్ సింగ్

  • మన్మోహన్ సింగ్ భారతదేశానికి 13వ ప్రధానమంత్రిగా పనిచేసారు
  • జవహర్‌లాల్ నెహ్రూ మరియు ఇందిరా తర్వాత అత్యధిక కాలం పనిచేసిన మూడవ ప్రధానమంత్రి
  • భారతదేశం యొక్క మొదటి సిక్కు మరియు హిందూయేతర ప్రధాన మంత్రి.
  • జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత పూర్తి ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నికైన మొదటి ప్రధానమంత్రి

మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 1932 న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్‌లోని గాహ్‌లో సిక్కు కుటుంబంలో జన్మించారు. భారతదేశ విభజన తరువాత వారి కుటుంబం భారతదేశంలోని అమృత్‌సర్‌కు వలస వచ్చింది. 1991లో భారత ప్రధాని పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసారు. బీజేపీ అధికారంలో ఉన్న 1998 నుండి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.

  • మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించింది.
  • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మరియు సమాచార హక్కు చట్టం మన్మోహన్ హయాంలోనే పార్లమెంటులో ఆమోదం పొందాయి.
  • మన్మోహన్ సింగ్ హయాంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఆధార్) ఫిబ్రవరి 2009లో స్థాపించబడింది.
  • 1982లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమితులయ్యారు.
Narendra Modi

15. నరేంద్ర మోదీ

  • మే 2014 నుండి భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పని చేస్తున్నారు
  • భారత జాతీయ కాంగ్రెస్ వెలుపల ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసారు.
  • 2001–2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు
  • వరుసగా రెండువ సారి ప్రధాని అయిన 4వ వ్యక్తి

నరేంద్ర దామోదరదాస్ మోడీ 17 సెప్టెంబర్ 1950న బొంబాయి రాష్ట్రం (ప్రస్తుత గుజరాత్ ) లోని మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో కిరాణా వ్యాపారుల గుజరాతీ హిందూ కుటుంబంలో జన్మించారు. మోడీ చిన్నతనంలోవాద్‌నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లోని తన తండ్రి టీ దుకాణంలో పనిచేసారు. మోడీకి ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యందు చేరారు.

  • మోడీ ప్రభుత్వం డిసెంబర్ 2014లో ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్) ఏర్పాటు చేసింది.
  • మోడీ ప్రభుత్వం 2015లో  డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
  • 2016లో గ్రామీణ గృహాలకు ఉచిత లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్‌లను అందించడానికి ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది.
  • 2014 సెప్టెంబర్‌లో దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
  • 2017లో గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పేరుతొ స్వాతంత్ర్యం తర్వాత దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణను మోడీ ప్రభుత్వం ఆమోదించింది.
  • 9 నవంబర్ 2016న అవినీతి, నల్లధనం, తీవ్రవాదం మరియు నకిలీ కరెన్సీ వినియోగాన్ని అరికట్టాలనే ఉద్దేశ్యంతో ₹500 మరియు ₹1000 నోట్లను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది.
  • 2020లో కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందనగా ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897 మరియు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, 2005ని అమలులోకి తెచ్చింది.
  • మోడీ హయాంలో భారతదేశం 2023 జీ20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది.
  • మోడీ హయాంలో జమ్మూ & కాశ్మీర్ ప్రాంతానికి ప్రత్యక హోదా అందించే ఆర్టికల్ 370ను రద్దు చేయబడింది.

No comments:

Post a Comment