ECIL Recruitment 2024: ECILలో 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాతపరీక్ష లేదు.. ఎంపిక విధానం వివరాలు ఇవే.

 తెలంగాణ రాష్ట్రం(హైదరాబాద్‌)లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 1100 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


వీటిలో ఎలక్ట్రానిక్స్/మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్‌సైట్ ecil.co.inని సందర్శించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ECIL రిక్రూట్‌మెంట్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ హైదరాబాద్‌లో జరగనుంది.

ఖాళీల వివరాలు.. 
జూనియర్ టెక్నీషియన్ (Electronics Mechanic) : 275 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (Electrician) : 275 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (Fitter) : 550 పోస్టులు

జీతం : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.22,528 జీతం ఉంటుంది.

వయసు : జనవరి 16, 2024 నాటికి 30 ఏళ్ల‌ మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

అర్హతలు : ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ ట్రేడ్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ITI (2 సంవత్సరాలు) ఉత్తీర్ణులై ఉండాలి. ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ తయారీలో కనీసం ఒక సంవత్సరం అనుభవం (ITI + అప్రెంటిస్‌షిప్ తర్వాత) ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాలుగు నెలల కాలవ్యవధికి నియమించబడతారు. ఈ ప్రాజెక్ట్, అవసరాలు, అభ్యర్థి పనితీరు ఆధారంగా దీనిని రెండు నెలలు పొడిగించవచ్చు. 

దరఖాస్తు ప్రారంభం తేదీ : జనవరి 12, 2024
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ : జనవరి 16, 2024

Official Website

Official Notification

No comments:

Post a Comment