Big Breaking: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో గ్రూపు 1, గ్రూపు 2 నోటిఫికేషన్లు..

 Big Breaking: ఏపీలోని నిరుద్యోగులకు అక్కడ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా గ్రూపు 1, గ్రూపు 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు APPSC చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు.

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఆయా నోటిషికేషన్ల విడుదలకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.సాధ్యమైనంత త్వరగా గ్రూప్‌ 1, 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఈ నోటిఫికేషన్లను విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తాజాగా కీలక ప్రకటన చేశారు. గ్రూప్-1లో 100 పోస్టులు.. గ్రూప్-2లో 900 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. అంతేకాదు గ్రూప్ 1 ప్రక్రియ 9 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మరో పేపర్‌తోనే గ్రూప్ -1 ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మెయిన్ పేపర్‌లో 5 పేపర్లకు బదులు 4 పేపర్లు ఉంటాయని పేర్కొన్నారు.ఇందులో 6,455 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేశారు. వాస్తవానికి 1:50 నిష్పత్తి ప్రకారం 5,550 మందిని మాత్రమే మెయిన్స్ కు ఎంపిక చేయాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఏపీలో గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి మరో 900కిపైగా పోస్టులు భర్త చేయనున్నారు.ఈ మొత్తం 1000కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు.

No comments:

Post a Comment