TS DSC TRT 2023 : తెలంగాణ DSC ఎగ్జామ్‌ వాయిదా.. విద్యాశాఖ నిర్ణయం

 TS DSC 2023 Notification : తెలంగాణ డీఎస్సీ (TS DSC TRT 2023) రాత పరీక్షలు నవంబర్‌ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. 




TS DSC Notification TRT 2023 : తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ (TS DSC 2023) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లా స్థాయి ఎంపిక కమిటీ(DSC)ల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు మునిసిపల్ స్కూళ్లలో ఖాళీలను కూడా ఈ డీఎస్సీ (TS DSC 2023) ద్వారా భర్తీ చేస్తారు. డీఎస్సీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్‌ పండిట్స్‌, పీఈటీ ఉద్యోగాలున్నాయి. తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌  https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. 

No comments:

Post a Comment