Nobel Prize 2023 Winners List: నోబెల్ బహుమతి-2023 విజేతల పూర్తి జాబితా

Nobel Prize Questions asked in APPSC & TSPSC group-1,2,3,4 , SI, Constable and all other Competitive Exams.

Nobel Prize 2023 Winners List in Telugu: నోబెల్ బహుమతి-2023 విజేతల పూర్తి జాబితా ఇదే

నోబెల్ బహుమతులు-2023 

1. వైద్య శాస్త్రం - 2 అక్టోబర్ 2023 - కాటలిన్‌ కరికో(హంగేరీ), డ్రూ వెయిస్‌మన్‌( అమెరికా) - న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలకు, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA Vaccine) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ పురస్కారం ల‌భించింది.  

హంగేరీకి చెందిన కాటలిన్‌ కరికో, అమెరికాకు చెందిన డ్రూ వెయిస్‌మన్ యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను కణాల్లోకి పంపినప్పుడు అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు, శరీరంలో ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచుతాయని తేలింది. వీరి పరిశోధనల కారణంగానే 2020 చివర్లో రెండు mRNA వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది.

2. భౌతిక శాస్త్రం - 3 అక్టోబర్ 2023 - పెర్రీ అగోస్తిని(అమెరికా), ఫెరెన్స్‌ క్రౌజ్‌(జర్మనీ), అన్నె ఎల్‌ హ్యులియర్‌(స్వీడన్‌) - ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు ఆటోసెకెండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకుగాను వీరికి ఈ పురస్కారం ల‌భించింది. 

 వీరి పరిశోధనలతో అణువులు, పరామణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం చేసేందుకు మానవాళికి కొత్త సాధనాలు అందాయని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్ తెలిపింది.

వీరిలో ఎల్'హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్‌లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. ప్రైజ్ మనీని ముగ్గురి శాస్త్రవేత్తలకు సమానంగా పంపిణీ చేయనున్నారు.

3రసాయన శాస్త్రం- 4 అక్టోబర్ 2023 - మౌంగి జి. బావెండి(అమెరికా), లూయిస్ ఇ. బ్రస్(అమెరికా), అలెక్సీ ఐ. ఎకిమోవ్‌(అమెరికా) - నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణలో  చేసిన పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారం ల‌భించింది. 

క్వాంటమ్ డాట్స్ అనేవి చాలా సూక్ష‍్మమైన నానోపార్టికల్స్. నానోటెక్నాలజీలో ఈ క్వాంటమ్ డాట్స్‌ను ప్రస్తుతం టెలివిజన్‌లు, ఎల్‌ఈడీ దీపాలతో పాటు అనేక పరికరాల్లో ఉపయోగిస్తున్నాము. అంతేకాకుండా ఇవి కణితి కణజాలాన్ని తొలగించినప్పుడు సర్జన్‌లకు కూడా ఇవి మార్గనిర్దేశం చేయగలవు.

4. సాహిత్యం - 5 అక్టోబర్ 2023 - జాన్‌ ఫోసె(నార్వే) - మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు జాన్‌ వినూత్న నాటకాలు, గద్యాలు గళంగా మారాయని నోబెల్‌ పురస్కారాన్ని ప్ర‌క‌టించారు.

సాహిత్యంలో 1901 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 116 నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఇప్పటి వరకు 17 మంది మహిళలకు సాహిత్య పురస్కారం లభించింది. 2022గాను సాహిత్యంలో ఫ్రాన్స్ రచయిత అన్నీ ఎర్నాక్స్‌ను నోబెల్ బహుమతి వ‌రించింది

5. శాంతి -  6 అక్టోబర్ 2023 - న‌ర్గిస్‌ మొహమ్మది (ఇరాన్‌ ) - ఇరాన్‌ మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఈమెకు ఈ పురస్కారం ల‌భించింది


మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు శాంతి బహుమతి లభించింది. ఇరాన్‌ మహిళల కోసం న‌ర్గిస్‌ మొహమ్మది వీరోచిత పోరాటం చేశారు.  ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది. ఐదుసార్లు ఆమెను దోషిగా నిర్ధారించింది. అంతేకాకుండా ఆమెకు మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష మరియు 154 కొరడా దెబ్బలు విధించింది. న‌ర్గిస్‌ మహ్మదీ ఇంకా జైలులోనే ఉన్నారు.

  • 1901 నుంచి ఇప్ప‌టి వ‌రకు 104 సార్లు నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించారు.
  • ఇప్పటివరకు 19 మంది మహిళలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.
  • అవార్డు ప్ర‌క‌టించ‌న‌ సమయంలో 5గురు శాంతి బహుమతి గ్రహీతలు జైల్లో ఉన్నారు.
6. ఆర్థిక శాస్త్రం - 9 అక్టోబర్ 2023 - క్లాడియా గోల్డిన్‌(అమెరికా) - లేబర్‌ మార్కెట్‌లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి విశేష కృషి చేసినందుకుగాను ఈమెకు ఈ పురస్కారం ల‌భించింది.  

ఆర్థిక శాస్త్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 55 సార్లు నోబెల్‌ను ప్ర‌క‌టించారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు మహిళల‌కు ఈ బహుమతి లభించింది.

No comments:

Post a Comment