Indian Geography Important Questions for APPSC/TSPSC group-1, Group-2, Group-3, Group-4, SI, Constable and all other Competitive Exams.
1. కింది వాటిలో వాతావరణ పొరలను జతపర్చండి?
1. ట్రోపోపాస్ ఎ. మిసో, ఐనో ఆవరణం మధ్య
2. స్ట్రాటో పాస్ బి. స్ట్రాటో, మిసో ఆవరణం మధ్య
3. మిసో పాస్ సి. ఐనో, ఎక్సో ఆవరణం మధ్య
4. ఐనోపాస్ డి. ట్రోపో, స్ట్రాటో ఆవరణం మధ్య
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి 2) 1-డి, 2-బి, 3-ఎ,4-సి
3) 1-బి, 2-సి, 3-ఎ,4-డి 4) 1-సి, 2-డి, 3-బి,4-ఎ
2. జెట్ విమానాయానానికి అనుకూలంగా ఉండే పొర ఏది?
1) ట్రోపో ఆవరణం 2) మీసో ఆవరణం
3) ఐనో ఆవరణం 4) స్ట్రాటో ఆవరణం
3. ఏ ఆవరణంలో పదార్థం ప్లాస్మా స్థితిలో ఉంటుంది?
1) ఎక్సో ఆవరణం 2) మీసో ఆవరణం
3) స్ట్రాటో ఆవరణం 4) ట్రోపో ఆవరణం
4. జతపర్చండి?
1. ఉల్కపాతాలు సంభవించే పొర ఎ. స్ట్రాటో ఆవరణం
2. సమాచార వ్యవస్థ పొర బి. మీసో ఆవరణం
3. నాక్టెల్యు సెంట్ మేఘాలు సి. థర్మో ఆవరణం
4. సిరస్ మేఘాలు డి. ఎక్సో ఆవరణం
1) 1-డి, 2-బి, 3-ఎ,4-సి 2) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
3) 1-డి, 2-సి, 3-బి,4-ఎ 4) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
5. జెట్‌స్ట్రీమ్స్ వల్ల గందరగోళ పరిస్థితులు ఏ ఆవరణంలో ఏర్పడుతాయి?
1) ఎక్సో ఆవరణం 2) ట్రోపో ఆవరణం
3) థర్మో ఆవరణం 4) స్ట్రాటో ఆవరణం
6. జతపర్చండి?
1. ఉష్ణవహనం ఎ. సముద్ర భూపవనాలు ఏర్పడటం
2. ఉష్ణసంవహనం బి. సూర్యుని నుంచి ఉష్ణం భూమిని చేరడం
3. ఉష్ణవికిరణం సి. భూమి కింద పొరలు వేడెక్కడం
1) 1-సి, 2-ఎ, 3-బి
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
7. భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం?
1) వెర్కోయానౌస్కి 2) ఓమికాన్
3) బౌవోస్టాక్ 4) అల్ ఆజిజియా
8. కింది వాటిలో సరైన క్రమంలో జతపరచనిది ఏది?
1. నక్షత్రాల్లో ఉష్ణోగ్రత కొలిచే పరికరం ఎ. ఫైరోమీటర్
2. అతి శీతల ప్రాంతాల గురించి అధ్యయనం బి. క్రయోజనిక్స్
3. అత్యధిక ఉష్ణోగ్రతలు కనుగొనే పరికరం సి. ఆప్టికల్ ఫైరోమీటర్
4. అత్యల్ప ఉష్ణోగ్రతలు కనుగొనే పరికరం డి. నిక్రయోమీటర్
9. కింది వాటిలో సరికానిది గుర్తించండి?
1) భారమితిలో పాదరస ఘట్టం అకస్మాత్తుగా తగ్గడం-తుఫాన్
2) భారమితిలో పాదరస ఘట్టం నెమ్మదిగా తగ్గడం- వర్షం
3) వాయువు పీడనం కొలిచే పరికరం- మానోమీటర్
4) పీడనాన్ని కొలిచే ఆధునిక ప్రమాణం- మిల్లీమీటర్
10. జతపర్చండి?
1. ఆస్ట్రేలియా ఎ. గోబి ఎడారి
2. దక్షిణ అమెరికా బి. పెటగోనియా ఎడారి
3. అర్జెంటీనా సి. అటకామా ఎడారి
4. చైనా
1) 1-ఎ , 2-బి, 3-సి,4- డి
2) 1-ఎ, 2-డి, 3-సి,4-బి
3) 1-సి, 2-బి, 3-ఎ,4-డి
4) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
11. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి?
1.నార్వేస్టర్లు ఎ. న్యూజిలాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం
2. హర్మట్టన్ బి. ఆఫ్రికా పశ్చిమ తీరం
3. బెర్గ్ సి. దక్షిణాఫ్రికాలో (డ్రాకెన్స్బర్గ్ పర్వతాల వెంబడి)
4. బ్యూరాన్ డి. అర్జెంటీనా
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
2) 1-డి, 2-బి, 3-సి,4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి,4-ఎ
12. జతపర్చండి?
1. స్పెయిన్ ఎ. చిలీ ఉష్ణపవనాలు
2. ఇటలీ బి. బ్రిక్‌పీల్డర్స్ ఉష్ణపవనాలు
3. ఆస్ట్రేలియా సి. సిరాకో ఉష్ణపవనాలు
4. ట్యునీషియా డి. లెవిచె ఉష్ణపవనాలు
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
2) 1-డి, 2-బి, 3-సి,4-ఎ
3) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి,4-ఎ
13. ‘ఆర్ధత’ను కొలిచే పరికరం పేరు?
1) హైడ్రోమీటర్ 2) హైగ్రోమీటర్
3) భారమితి 4) బారోమీటర్
14. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి?
1. అధిక వర్షపాతం సంభవించే మేఘాలు ఎ. క్యుములోనింబస్
2. తక్కువ ఎత్తులో ఏర్పడే మేఘాలు బి. నింబోస్ట్రాటస్
3. క్యాలిఫ్లవర్/గుమ్మడి ఆకారంలో మేఘాలు సి. స్ట్రాటస్
4. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్నిచ్చే మేఘాలు డి. క్యుములోస్
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
2) 1-డి, 2-బి, 3-సి,4-ఎ
3) 1-బి, 2-సి, 3-డి,4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి,4-ఎ
15. మేఘాలు ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించేది?
1) సిలోమీటర్ 2) హైగ్రోమీటర్
3) ఎనిమోమీటర్ 4) హైడ్రోమీటర్
16. జతపర్చండి?
1. అంధీలు ఎ. కర్ణాటక
2. నార్వేస్టర్స్ బి. కేరళ
3. మాంగోషవర్స్ సి. అస్సాం
4. చెరిబ్లోసమ్స్ డి. ఉత్తరప్రదేశ్
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
2) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
3) 1-డి, 2-బి, 3-ఎ,4-సి
4) 1-సి, 2-బి, 3-ఎ,4-డి
17. ‘రుతుపవన ఆరంభపు జల్లులు’ అని ఏ వర్షపాతాన్ని పిలుస్తారు?
1) పర్వతీయ వర్షపాతం
2) చక్రవాత వర్షపాతం
3) సంవహన వర్షపాతం 4) 1,2
18. జతపర్చండి
1. ఉత్తర పసిఫిక్ తీరం ఎ. విల్లీ విల్లీలు
2. మెక్సికో సింధూశాఖ బి. సైక్లోన్స్
3. అరేబియా, బంగాళాఖాతం సి. హరికేన్స్
4. దక్షిణ ఆస్ట్రేలియా డి. టైపూన్స్
1) 1-డి, 2-సి, 3-బి,4-ఎ
2) 1-ఎ, 2-డి, 3-సి,4-బి
3) 1-బి, 2-డి, 3-సి,4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
19. వాతావరణంలో అధికంగా ఉండే వాయువుల వరుస క్రమంలో సరైనది ఏది?
1) నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆక్సిజన్, ఆర్గాన్, నియాన్
2) నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్, నియాన్
3) ఆక్సిజన్, నైట్రోజన్, నియాన్, ఆర్గాన్, కార్బన్ డై ఆక్సైడ్ 4) ఏదీకాదు
20. భారత్‌లో రుతుపవనాలు ఎక్కువగా ప్రభావితమయ్యేది?
1) ఆయన రేఖా తుఫానులు
2) పశ్చిమ అలజడులు
3) వాయు తుఫానులు
4) నిమ్నోన్నత ప్రాధాన్యత
21. ప్రతిపాదన (A): వేసవి కాలంలో అంతర ఆయనరేఖా అభిసరణ మండలం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉంటుంది.
కారణం (R): అంతర ఆయనరేఖా అభిసరణ మండలం ఉత్తరం దిక్కుగా భారత్ వైపు వెళ్లడం వల్ల రుతుపవనాలు ఏర్పడేందుకు దారితీస్తాయి.
1) A, R రెండూ సరైనవి A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి కాని A కు R సరైన వివరణ కాదు
3) A, సరైనది కాని R సరైనది కాదు
4) A, సరైనది కాదు R సరైనది
22. ప్రతిపాదన (A): దక్షిణ చైనాలో జనించే ఉష్ణమండల చక్రవాతాలను టైపూన్‌లు అంటారు.కారణం (R): ఉష్ణమండల చక్రవాతాల సమపీడన రేఖలు వర్తులాకారంలో ఉంటాయి.
1) A, R రెండూ సరైనవి A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి కాని A కు R సరైన వివరణ కాదు
3) A, సరైనది కాని R సరైనది కాదు
4) A, సరైనది కాదు R సరైనది
23. ప్రతిపాదన (A): ఎల్‌నినో దృగ్విషయం పెరూవియన్ సముద్ర ప్రవాహంతో సంబంధించినది.కారణం (R): పెరూవియన్ సముద్ర ప్రవాహం ఒక శీతల ప్రవాహం.
1) A, R రెండూ సరైనవి. కాని R, A కు సరైన వివరణ కాదు
2) A సరైనది R సరైనది కాదు
3) A సరైనది కాదు R సరైనది
4) A, R రెండూ సరైనవి. కాని R, Aకు సరైన వివరణ
24. కింది వివరణ చదవండి?
ఎ. రుతుపనాలొక వాయువ్యవస్థ ఇందులో గాలుల దిశ రుతుపవనాల ప్రకారం మారుతుంది
బి. వేసవికాలంలో రుతుపవనాలు సముద్రం నుంచి భూమి పైకి వీస్తాయి. అవి తేమను కలిగి ఉండే వర్షపాతాన్ని ఇస్తాయి
సి. శీతాకాలంలో రుతువపనాలు నైరుతి దిశలో భూమి నుంచి సముద్రం వైపునకు వీస్తాయి
వీటిలో ఏది సరైన వివరణ:
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి 4) ఎ, బి, సి
25. కింది వివరణలను చదవండి?
ఎ. శీతాకాలంలో పశ్చిమ ఆటంకాల వల్ల ఉత్తర భారతదేశానికి వర్షపాతం చేకూరుతుంది
బి. ఈశాన్య రుతుపవనాలు తమిళనాడుకు వర్షపాతాన్ని ఇస్తాయి
సి. భారతదేశానికి ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం లభిస్తుంది
వీటిలో సరైన వివరణలు ఏవి
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
26. ప్రతిపాదన (A): ముంబయి దగ్గరగా ఉన్న పుణే..ముంబయి కంటే తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది.
కారణం (R): పుణే పశ్చిమ కనుమలకు పవన పరాన్ముఖం వైపు ఉంది. అలాగే ముంబయి పశ్చిమ కనుమలకు పవన అభిముఖంగా ఉంది.
సరైన జవాబును ఎంపిక చేయండి?
1) A, R రెండూ సరైనవి A కు R సరైన వివరణ
2) A, R రెండూ సరైనవి కాని A కు R సరైన వివరణ కాదు
3) A, సరైనది కాని R సరైనది కాదు
4) A, సరైనది కాదు R సరైనది
27. సిమ్లా, అమృత్‌సర్ ఒకే అక్షాంశాల్లో ఉన్నప్పటికీ సిమ్లా చల్లగా ఉండటానికి కారణం ?
1) సిమ్లా ఉత్తరంలో కలదు
2) సిమ్లా అధిక ఎత్తులో ఉంది
3) సిమ్లా భూమధ్య రేఖకు దూరంగా ఉంది
4) ఏదీకాదు
28. పశ్చిమ కల్లోలాలు పంటలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి?
1) కోత పంటలను నాశనం చేస్తాయి
2) మట్టిచేత కప్పివేస్తాయి
3) పంటలకు తోడ్పడుతాయి
4) ఏదీకాదు
29. లైలా, నీలం, హెలెన్, లెహర్ అనే పేర్లు కింది వాటిలో వేటికి సంబంధించినవి?
1) భారతదేశాన్ని ప్రభావితం చేసిన తుఫాన్‌లు
2) ఎయిర్ ఇండియా విమానాలు
3) భారతీయ రైల్వేలు
4) భారత నౌకాదళ జలాంతర్గాములు
30. జతపర్చండి
1. స్ట్రాటో ఆవరణం ఎ. వర్షం, మేఘాలు, పవనాలు, ఆర్ధత, ధూళి మొదలైన శీతోష్ణస్థితి అంశాలు కలిగి ఉండే ఆవరణం
2. ట్రోపో ఆవరణం బి. దూళి కణాలు, మేఘల్లాంటివి, శీతోష్ణస్థితి అంశాలు లేని ఆవరణం
3. మీసో ఆవరణం సి. బాహ్య ట్రోపోఆవరణం
4. ఐనో ఆవరణం డి. ఆక్సిజన్ అణువులు కలిసి ఆయానీకరణం చెందుతాయి
1) 1-సి, 2-బి, 3-ఎ,4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ,4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి,4-డి
31. కోరియాలిస్ ఫలితం అంటే?
1) ఉత్తరార్ధగోళంలో వీచే పవనాలు కుడి వైపునకూ, దక్షిణార్థగోళంలో వీచే పవనాలు ఎడమవైపునకు నెట్టబడతాయి
2) ఉత్తరార్థగోళంలో వీచే పవనాలు ఎడమ వైపునకు, దక్షిణార్థగోళంలో వీచే పవనాలు కుడివైపునకు నెట్టబడతాయి
3) 1, 2 4) ఏదీకాదు
32. జతపర్చండి
1. ద్రవాల సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఎ. హైడ్రోమీటర్
2. ఆర్ధతను కొలవడానికి ఉపయోగించే పరికరం బి. హైగ్రోమీటర్
3. సాపేక్ష తేమను కొలవడానికి ఉపయోగించే పరికరం సి. తడి, పొడి బల్బు థర్మామీటర్
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-బి, 2-ఎ, 3-సి
జవాబులు
1-2, 2-4, 3-1, 4-3, 5-2, 6-1, 7-4, 8-4, 9-4, 10-4, 11-1, 12-3, 13-2, 14-3, 15-1, 16-2, 17-3, 18-1, 19-2, 20-4, 21-2, 22-2, 23-1, 24-3, 25-1, 26-1 , 27-2, 28-3, 29-1, 30-4, 31-1, 32-3
No comments:
Post a Comment