Indian Economy Bits in Telugu | TSPSC, APPSC Group-1, Group 2, Group 3, Group 4 SI, Constable Exams

Most Important Indian Economy Bits in Telugu. It is help ful for APPSC/TSPSC Group1, Group 2, Group 3, Group 4, SI, Constable and other competitive exams. 

1. కింది వాటిలో ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయాన్ని సూచించేది ఏది?

A) మారెట్‌ ధరల్లో ఆదాయం + నికర పరోక్ష పన్నులు
B) మారెట్‌ ధరల్లో ఆదాయం-నికర పరోక్ష పన్నులు
C) మారెట్‌ ధరల్లో ఆదాయం+ సబ్సిడీలు
D) మారెట్‌ ధరల్లో ఆదాయం- సబ్సిడీలు
2. 6వ ప్రణాళికలో ప్రారంభించిన పథకాల్లో సరైన వాటిని గుర్తించండి.
a)NREP  1.1999
b) DWACRA 2.1979
c) RLEGP 3.1983
d)TRYSEM 4.1982
e)SGSY 5.1980
A) a-5, b-2, c-3, d-1, e-5
B) e-1, d-2, c-3, b-4, a-5
C) e-4, d-2, c-5, a-1, b-4
D) a-4, b-3, c-2, e-1, d-5
3. చక్రీయ నిరుద్యోగానికి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి.
a) ఆర్థిక వ్యవస్థ వివిధ దశల్లో వ్యాపార చక్రాల వల్ల ఏర్పడే నిరుద్యోగం-చక్రీయ నిరుద్యోగం
b) చక్రీయ నిరుద్యోగంలో 4 దశలు ఉన్నాయి.
c) సౌభాగ్య దశలో ఉద్యోగాలు అవకాశాలు పెరుగుతాయి. మాoద్యం దశలో ఉద్యోగాలు కోల్పోతారు.
d) పురోగమన దశలో ఉద్యోగాలు కోల్పోయి తిరోగమన దశలో ఉద్యోగాలు కల్పించబడతాయి.
A) a, b, c
B) b, c, d
C) a, b, d
D) a, c, d
4. 2023 తెలంగాణ బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
1. సంక్షేమ a) Rs 33,416 కోట్లు
2.వ్యవసాయ b) Rs.12,161 కోట్లు
3. రోడ్లు, భవనాలు c) Rs.26,831కోట్లు
4. వైద్యం, ఆరోగ్యం
d) Rs. 22,260 కోట్లు
A) 1-a, 2-c, 3-d, 4-b
B) 1-a, 2-b, 3-c, 4-d
C) 1-e, 2-b, 3-c, 4-d
D) 1-e, 2-b, 3-d, 4-a
5. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని ఎప్పుడు పెంచుతుంది?
A) భారత ఆర్థిక వ్యవస్థ అధిక
ద్రవ్యోల్బణం కలిగి ఉన్నప్పుడు
B) భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం తకువగా ఉన్నప్పుడు
C)వస్తువులు, సేవల డిమాండ్‌ చాలా తకువగా ఉన్నప్పుడు
D) వీటిలో ఏవీ లేవు
6. ప్రొ.రాజకృష్ణ పేరొన్న హిందూ వృద్ధి రేటును అధిగమించి తొలిసారి ఏ ప్రణాళికలో 5% పైగా వృద్ధి నమోదుచేసుకుంది?
A ఐదో ప్రణాళిక
B) ఎనిమిదో ప్రణాళిక
C) నిరంతర ప్రణాళిక సమయంలో
D) ఆరో ప్రణాళిక
7. ప్రణాళికా సంఘం నిర్వచనం ప్రకారం పేదరికపు గీతను దేని ఆధారంగా నిర్వచించారు?
A) 1980-81 ధరల్లో పట్టణాల్లో రూ.1800, గ్రామాల్లో రూ.1200 తలసరి ఆదాయం
B) గ్రామాల్లో 2,400, పట్టణాల్లో 2100 కేలరీల శక్తినిచ్చే ఆదాయం
C) పట్టణాల కుటుంబాల్లో ఇద్దరు, గ్రామాల కుటుంబాల్లో ఒకరు ఉపాధి పొందడం
D) 1990-91 ధరల్లో పట్టణాల్లో రూ.3,200, గ్రామాల్లో రూ.2,800 తలసరి ఆదాయం
8. నికర దేశీయోత్పత్తి
A) స్థూల దేశీయోత్పత్తి మూలధనం తరుగుదల
B) స్థూల దేశీయోత్పత్తి తరుగుదల
C) స్థూల జాతీయోత్పత్తి – తరుగుదల
D) స్థూల జాతీయోత్పత్తి + తరుగుదల
9. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY) కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఏ రోజున ప్రారంభించారు?
A) 1 July 2012
B) 26th January 2013
C) 2 October 2015
D) 28th August 2014
10. స్థూల జాతీయోత్పత్తి(GNP)ని ఏవిధంగా నిర్వచించవచ్చు?
A) ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవల మొత్తం విలువ
B)దేశంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువ
C) దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవల మొత్తం విలువలో తరుగుదల
D) ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువులు, సేవల మొత్తం విలువ, విదేశాల నుంచి వచ్చే నికర కారక ఆదాయం
11. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (KC3) పథకాన్ని 1998-99లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, దీనికి సంబంధించి కిందివాటిలో సరైన ప్రకటన ఏది?
A) ఈ పథకాన్ని అన్ని సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుల ద్వారా అమలు చేయడం జరుగుతుంది.
B) సహకార బ్యాంకులు, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులకు సంబంధించి ఈ పథకాన్ని నాబార్డు పర్యవేక్షిస్తుంది.
C) వాణిజ్య బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ పర్యవేక్షిస్తుంది
D) పైవన్నీ
12. కింది వాటిలో ఏది భారత పంచవర్ష ప్రణాళికల ప్రధాన లక్ష్యం కాదు?
A) సుస్థిర సమ్మిళిత వృద్ధి, స్వావలంబన
B) పేదరిక నిర్మూలన, ఆదాయ వ్యత్యాసాల తొలగింపు
C) సంతులిత ప్రాంతీయాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ
D) జనాభావృద్ధి, ప్రాంతీయాభివృద్ధి
13. మధ్యాహ్న భోజన పథకం పేరును ప్రస్తుతం ఏ విధంగా మార్చారు?
A) పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథాకానికి జాతీయ కార్యక్రమం
B) ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ (పీఎం పోషణ్‌)
C) దీనదయాళ్‌ పోషణ్‌ శక్తి నిర్మాణ్‌ (డీడీ పోషణ్‌)
D) ఏదీ కాదు
14. హిందూ వృద్ధిరేటు అంటే ఏమిటి?
A) హిందూ మతస్థుల ఆదాయ వృద్ధికి సంబంధించినది
B) హిందూ జనాభా వృద్ధికి సంబంధించినది
C) 1950-80 సంవత్సరాల మధ్య భారత తక్కువ వృద్ధిరేటుకు సంబంధించింది
D) పైవన్నీ
15. నరసింహన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం విలీనమైన రెండు జాతీయ బ్యాంకులు ఏవి?
A) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
B) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
C) పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌,
న్యూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
D) పైవన్నీ
16. PURA విధి ఏమిటి?
A) గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలను కల్పించడం
B) గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ఆర్థిక సౌకర్యాలను అందించడం
C) గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలను అందించడం
D) గ్రామీణ ప్రాంతాల పునర్నిర్మాణానికి పట్టణ సౌకర్యాలను కల్పించడం
17. కింది వాటిలో తప్పుగా ఉన్నది ఏది?
A)3వ ప్రణాళిక – Self Reliance, self generating economy
B) 4వ ప్రణాళిక – Growth with Stability :
C) 5వ ప్రణాళిక – Removal of Poverty
D)6వ ప్రణాళిక – Food, work, productivity
18. ఎన్ని క్యాలరీల కంటే ఆదాయం తకువగా ఉంటే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ప్రకారం గ్రామీణ ప్రాంతంలో నిరపేక్ష పేదరికం ఉన్నదని భావిస్తారు.
A) 2200 B) 2400
C) 2500 D) 2700
19. నిర్వహణలో ఉన్న వ్యవసాయ కమతాల వర్గీకరణకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
కమతం  విప్లవం
A) సన్న – 1.0 హెక్టార్‌ లోపు
B) చిన్న- 1 నుంచి 2 హెక్టార్ల లోపు
C)సెమీ మీడియం- 2 నుంచి 4 హెక్టార్ల లోపు
D) మీడియం – 4 నుండి 10 హెక్టార్ల లోపు
E) భారీ కమతం – 10 హెక్టార్లకు పైన
1) a, b, e only
2) a. c and d only
3) a, b, c, d and e
4) a, b, c and d
20. కిందివాటిలో తప్పుగా ఉన్నది ఏది?
a) ప్రణాళికాసంఘం – ప్రధాని Ex-officio చైర్మన్‌
b) జాతీయ ప్రణాళికా – నెహ్రూ కమిటీ అధ్యక్షుడు
c) సర్వోదయ ప్రణాళిక- జయప్రకాష్‌ నారాయణ్‌
d) Planning and The poor -మోక్షగుండం విశ్వేశ్వరయ్య
21. గీతాకృష్ణన్‌, రాజా చెల్లయ్య, నర్సింహం కమిటీలు దేనికి సంబంధించినవి?
A) ప్రణాళికా వ్యయం-పన్నులు విత్త రంగం
B)ప్రణాళికేతర వ్యయం- విత్తరంగం – ;పన్నులు
C) ప్రణాళికేతర వ్యయం- పన్నులు- విత్తరంగం
D) సబ్సిడీలు – పన్నులు విత్తరంగం
22. భారతదేశ పదకొండవ ప్రణాళికలో వృద్ధి రేటు, ఇతర లక్ష్యాలకు సంబంధించి సరైన జత ఏది?
1. వ్యవసాయ వృద్ధి రేటు – 4శాతం
2. సవరించిన వృద్ధిరేటు – 8.1 శాతం
3. మానిటరబుల్‌ టార్గెట్స్‌ – 27
4. సేవారంగం వృద్ధిరేటు 9 -11 శాతం
A) 1, 3, 4 B) 1, 2, 4
C) 1, 2, 3 D) 1, 2, 3, 4
23. భారతదేశంలో స్థాపించిన వివిధ సంస్థలు – వాటి స్థాపన క్రమం ఆధారంగా సరైన క్రమాలను గుర్తించండి.
A) IFCI, IDBI, SIDBI, NABARD
B) SIDBI, NABARD, IDBI, IFCI
C) IFCI ,IDBI,NABARD, SIDBI
D)IFCI,SIDBI, NABARD, IDBI
24. కింది కారణాల్లో ఏది జనాభా పెరుగుదల లక్షణాల వల్ల జనాభా మార్పు మొదటి దశ చెబుతుంది?
A) జనన రేటు ఎకువ, మరణ రేటు తక్కువ
B) జనన రేటు తకువ, మరణ రేటు ఎక్కువ
C) జనన రేటు ఎకువ, మరణ రేటు ఎకువ
D) జనన రేటు తకువ, మరణ రేటు తకువ
25. ఒక దేశం నికర జాతీయాదాయం
రూ.20, 000 కోట్లు నికర బాహ్య ఆదాయ రాబడులు రూ.5,000 కోట్లు, వస్తు పన్ను రూ.2,000 కోట్లు, సబ్సిడీలు ఇచ్చినది రూ.1,000 కోట్లు అయినప్పుడు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా దేశీయోత్పత్తి ఎంత ఉంటుంది?
A) రూ. 13,000 కోట్లు
B) రూ. 17,000 కోట్లు
C) రూ. 14, 000 కోట్లు
D) రూ. 16,000 కోట్లు
26. 10వ ప్రణాళిక సామాజిక అభివృద్ధి లక్ష్యానికి సంబంధించినది కానిది?
A) 2007 నాటికి 21 శాతానికి పేదరికాన్ని తగ్గించుట
B) 2007 నాటికి 5 సంవత్సరాలు దాటిన పిల్లలందరినీ బడిలో చేర్పించడం
C) ఈ ప్రణాళికా కాలంలో అక్షరాస్యత రేటును 65% నుంచి 85% పెంచుట
D) దశాబ్దపు జనాభా వృద్ధిరేటును 2001-2011 దశాబ్దానికి 16.2% తగ్గించుట
27. కింది వాటిలో సరికానిది?
A) ప్రణాళికల్లో ఎకువ పెట్టుబడులు ప్రభుత్వరంగంలో చేయబడినవి
B) దేశీయ పొదుపునకు ప్రభుత్వరంగం నుంచి తోడ్పాటు ఏమీలేదు
C) స్వాతంత్య్రం తర్వాత పారిశ్రామికీకరణ ప్రగతిలో వైవిధ్యీకరణ సంభవించింది
D) మనదేశంలో పొదుపునకు ప్రధాన ఆధారం గృహరంగం
28. 4వ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించిన పథకాలు?
1. గ్రామీణ పని పథకం (RWP)
2. ఉపాంత రైతులు, వ్యవసాయ కూలీల పథకం (MFAL)
3. చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ (SFDA)
4. సమగ్ర పొడి భూమి వ్యవసాయ అభివృద్ధి (IDLAD)
A) 1, 2 B) 2, 4
C) 1, 2, 4 D) 1, 2, 3, 4
29. కింది వాటిలో JRY లక్ష్యం కానిదేది?
A) గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత, అల్ప ఉద్యోగితలో ఉన్న స్త్రీ పురుషులకు లాభదాయకమైన ఉపాధి కల్పించుట
B) పేదరికపు గీతకు పైనున్నవారిని స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటుచేసి సహాయం చేయుట
C) సాంఘిక, సామాజిక ఆస్తులను సృష్టించుట
D) వేతనస్థాయిపై ధనాత్మక ప్రభావం పడేటట్టు చూడటం
30. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సరికానిది?
A) SGSY, PMGSY అనే రెండు పథకాలు దీనిలో విలీనమయ్యాయి
B) కుటుంబంలో పని కోరుకునే వారిలో కనీసం ఒకరికి 100 రోజులు పని కల్పించాలి
C) 15 రోజులులోపు పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి
D) ఇది 2006 ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చింది
31. కిందివాటిలో తప్పుగా జతచేసింది ఏది?
A) ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన (PMGSY) – 2000
B) ప్రధానమంత్రి గ్రామోదయ యోజన (PMGSY) – 2000-01
C) రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం (REGP)-1995
D) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS)-2007

DOWNLOAD PDF

సమాధానాలు

1. B 2. B 3. A 4. A 5. A 6. D 7. B 8. A 9. D 10. D 11. D 12. D 13. B 14. C 15. C 16. C 17. D 18. B 19. C 20. D 21. C 22. D 23. C 24. C 25. A 26. C 27. B 28. D 29. B 30. A 31. D

No comments:

Post a Comment