నిరక్షరాస్యతకు ప్రధాన కారణాలు
పేదరికం: నిరక్షరాస్యత మహమ్మారి ఈనాటికీ చాలా దేశాలను పీడిస్తుంది. దీనికి పేదరికంతో గల దగ్గరి సంబంధంతో మరింత తీవ్రమవుతోంది. ఉదాహరణకు, పేదరికానికి, వయోజన అక్షరాస్యతకు పరిగణించదగిన వ్యతిరేక సహసంబంధం కనిపిస్తుంది. భారతదేశం లాంటి వర్ధమాన దేశాలలో నిరక్షరాస్యత మరింత ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పేదరికం ఎక్కువ. పేదరికం ఎక్కువయినప్పుడు అక్షరాస్యత తక్కువ అయ్యే అవకాశం ఉంది. జనాభాలో అధిక భాగం పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉండదు. ఎందుకంటే పేదరికం వలన వారు తమ నిత్యజీవిత అవసరాల కొరకు పని చేయవలసి వస్తుంది. పేదరికం, నిరక్షరాస్యత విడదీయడానికి వీలులేని ఒక వలయంలా ఏర్పడుతుంది.
లైంగిక అసమానతలు: అక్షరాస్యత 95 శాతం అంతకంటే ఎక్కువ ఉన్న దేశాలలో లైంగిక అసమానతలు శూన్యం లేదా అతి తక్కువగా కనిపిస్తాయి. దాదాపు అన్ని దేశాలలో పురుషులు స్త్రీల కంటే మంచి చదువు, రాయగలిగే నైపుణ్యాలు కలిగి ఉంటారు. వయోజనులైన పురుషులు, స్త్రీల మధ్య అక్షరాస్యతలో వ్యత్యాసం దక్షిణ, పశ్చిమ ఆసియా దేశాలలో అత్యధికం. ఇక్కడ పురుషుల అక్షరాస్యత 70 శాతం కాగా, స్త్రీల అక్షరాస్యత కేవలం 46 శాతం మాత్రమే. అదే అరబ్ దేశాలలో పురుషులు స్త్రీల అక్షరాస్యత వరుసగా 73 శాతం, 51 శాతం. ఆఫ్రికాలో 68 శాతం, 52 శాతం. పురుషులు, స్త్రీల మధ్య అక్షరాస్యతలో వ్యత్యాసం, వయోజన అక్షరాస్యత రేటు తక్కువ గల దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
వయస్సు: అన్ని దేశాలలో అక్షరాస్యత రేటు వయస్సు సమూహాల వారీగా మారుతూ ఉంటుంది. ప్రత్యేకంగా 15-34 వయస్సులో ఉన్న వ్యక్తులలో అక్షరాస్యత రేటు 45, ఆ పైన వయస్సులో గల వ్యక్తుల కంటే అధికంగా ఉంటుంది. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో పాఠశాలల సంఖ్య పెరగడం, కొన్ని దేశాలలో యుక్తవయస్సు సమూహాలలో అక్షరాస్యతా రేటులో స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. విభిన్న వయస్సు గల వ్యక్తులలో
భౌగోళిక అంతరాలు: జనాభా లెక్కల సమాచారం లేదా కుటుంబాల సమాచారం ప్రకారం గ్రామీణ ప్రాంత ప్రజల అక్షరాస్యతా స్థాయి, పట్టణ ప్రాంత ప్రజల కంటే తక్కువగా కనిపిస్తుంది. అక్షరాస్యతా రేటు తులనాత్మకంగా తక్కువ గల దేశాలలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల మధ్య వ్యత్యాసం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అక్షరాస్యతా సాధనలో పట్టణీకరణ ప్రభావం పాఠశాలల లభ్యత, నాణ్యమైన విద్య, సాంప్రదాయేతర విద్యా కార్యక్రమాల అమలుపై ఆధారపడి ఉంటాయి. పట్టణ వాసులు, గ్రామీణ ప్రజలతో పోల్చినప్పుడు ఎక్కువ శాతం విద్యావంతులు గల ప్రదేశాలలో నివసిస్తారు. పట్టణాలలో విద్యా సంబంధం గల నైపుణ్యాలు గలవారి అవసరం ఎక్కువ, నైపుణ్యాలు గల వారు మాత్రమే మంచి జీతం గల ఉద్యోగాలు పొందుతారు. ఎక్కువ మొత్తం నిరక్షరాస్యులు గల దేశాలలో ప్రాంతీయ భేదాలు ఎక్కువగా కనిపిస్తాయి.
పరిమిత వనరులు: చాలా పేద దేశాలు, అంతర్జాతీయ రుణభారం వల్ల, విద్య లాంటి సామాజిక కార్యక్రమాలపై వ్యయాన్ని తగ్గిస్తున్నాయి.
యుద్ధాలు: యుద్ధాలు, ప్రజాందోళనల వలన విద్య ప్రభావితమవుతుంది. యుద్ధ ప్రయత్నాలలో పిల్లల భాగస్వామ్యం కూడా అవసరముంటుంది కావున పాఠశాలల నిర్వహణలో ఆటంకాలు ఏర్పడతాయి.
1990 దశకంలో భారతదేశానికి గుండెలాంటి నాలుగు రాష్ట్రాలు అయిన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నిరక్షరాస్యతా సమస్య తీవ్రంగా ఉండేది. కాని భారతదేశ జనాభా లెక్కల ప్రకారం ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రంలోను అభివృద్ధి రేటు దేశం మొత్తం అభివృద్ధి రేటు కంటే త్వరితగతిన సాధించబడింది. 1991లో లైంగిక నిష్పత్తిలో లోటు రాజస్థాన్లోని 27 జిల్లాలకు 24 జిల్లాలో ఎక్కువగా నమోదు కాగా, 2001 జనాభా లెక్కల ప్రకారం 32 జిల్లాలకు గాను కేవలం 13 జిల్లాల్లో మాత్రమే అధికంగా నమోదయింది. 19 జిల్లాల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి లోటు తగ్గింది. పెరిగిన చోట పెరుగుదల నామమాత్రం కాగా, తగ్గిన చోట మాత్రం గణనీయంగా తగ్గింది. ఆశ్చర్యకరంగా, అధిక అక్షరాస్యతకు, తక్కువ లైంగిక నిష్పత్తి లోటుకు ధనాత్మక సహసంబంధం లేదు. 1991 నాటి పరిస్థితులు మారినప్పటికీ వాటి అధిక అక్షరాస్యత శాతం జిల్లాలు తక్కువ లైంగిక నిష్పత్తి లోటు కలిగి ఉన్నప్పటికీ మొత్తం మీద పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇది తాత్కాలిక పరిస్థితి కావచ్చును. స్త్రీల అక్షరాస్యత పెరగనిదే, దేశ సమగ్ర అక్షరాస్యతా శాతం పెరిగే వీలులేని పరిస్థితి ఏర్పడింది. కావున స్త్రీ విద్య ప్రాముఖ్యంపై అందరూ దృష్టి నిలుపవలసిన అవసరం ఏర్పడింది.
No comments:
Post a Comment