భారతీయ రిజర్వ్ బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై రూ.2 వేల నోట్లు చలామణిలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు మార్కెట్లో చలామణిలో ఉన్న నోట్లన్నీ డిపాజిట్ చేయాలని సూచించింది.
అయితే ఒక దఫాలో కేవలం 20 వేల విలువైన 2 వేల రూపాయల నోట్లనే డిపాజిట్ చేసేందుకు అనుమతించింది.
2023 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న నోట్లలో రూ.2 వేల నోట్ల వాటా 10.8 శాతంగా ఉంది. వీటిని పూర్తిగా ఆర్బీఐ స్వీకరిస్తుంది. తక్షణమే 2,000 రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకున్న నిర్ణయం అమలులోకి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఇకపై సాధారణ లావాదేవీలకు ఈ నోటును ఉపయోగించే అవకాశం లేదు.
- 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2 వేల నోట్ల వాటా 10.8 శాతం
- ఇకపై ఈ నోటును లావాదేవీలకు ఉపయోగించరు.
- అయితే రూ.2,000 నోట్లు మాత్రం చట్టబద్ధంగా కొనసాగుతాయని ఆర్బీఐ తెలిపింది.
- తక్షణమే రూ.2,000 నోట్ల జారీని నిలిపివేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది.
- అయితే, ప్రజలు తమ వద్ద ఉన్న 2,000 రూపాయల బ్యాంకు నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్పిడి చేయడానికి బ్యాంకు శాఖలను సంప్రదించవచ్చని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ సదుపాయం 2023 సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.
♦ మే 23 నుంచి ఆర్బీఐ రీజనల్ కార్యాలయాల్లో రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.
♦ రూ. 2 వేల నోట్లను చలామణిలో ఉంచొద్దని బ్యాంకులకు ఆదేశించిన ఆర్బీఐ
♦ సెప్టెంబరు 30 లోగా ప్రజలు తమ దగ్గరున్న 2 వేల నోట్లను ఆర్బీఐ వద్ద సమర్పించాలి.
♦ ఒక వ్యక్తి గరిష్టంగా పది రూ. 2 వేల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు.
♦ ఈ నెల 23 నుంచి రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం
♦ మార్చుకోడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 - దేశవ్యాప్తంగా 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే అనుమతి ♦ 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయిన రూ.2 వేల నోటు ముద్రణ
ఈ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం..
రూ.2000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89శాతం మార్చి 2017కి ముందు జారీ చేసినవి. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. మార్చి 31, 2018 నాటికి (చెలామణిలో ఉన్న నోట్లలో 37.3శాతం) గరిష్టంగా ఉన్న రూ.6.73 లక్షల కోట్ల నుండి చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది, మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8శాతం మాత్రమే ఉన్నాయి. ఈ విలువ సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదని గమనించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అలాగే ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా 2016లో నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000 రూ.500 నోట్ల రద్దు చేసిన తరువాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
Latest News
RBI to withdraw 2,000 rupee note : 2 వేల నోట్ల ఉపసంహరణ.. కండిషన్స్ ఇవే..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment