'క్లీన్ నోట్ పాలసీ' అంటే? ఆర్బీఐ బ్యాంకులకిచ్చిన కీలక ఆదేశాలు తెలుసుకోండి!

 


సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని మరోసారి షాకిచ్చింది. అయితే ఇది చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుందని తెలిపింది. 'క్లీన్ నోట్ పాలసీ' లో భాగంగానే ఈనిర్ణయం  తీసుకున్నామని ఆర్బీఐ శుక్రవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు కస్టమర్లకు రూ. 2వేల నోట్లను జారీని తక్షణమే నిలిపివేయాలని  బ్యాంకులకు ఆదేశించింది.అలాగే అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30, 2023 వరకు 2,000 నోట్లకు డిపాజిట్ /లేదా మార్పిడిని అవకాశాన్ని  కల్పించాలని  కూడా  ఆదేశించింది. అలాగే  మే 23, 2023 నుండి ఏ బ్యాంక్‌లోనైనా రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది.
'క్లీన్ నోట్ పాలసీ' అంటే ఏమిటి?  
ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ.  2016 నోట్లు రద్దు తరువాత రూ.2 వేల  నోటునుతీసు‍‍కొచ్చింది ఆర్బీఐ. అయితే ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత , 2018-19లో 2,000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు ఆర్బీఐ  పేర్కొంది. 2017 మార్చిలో  89 శాతం  జారీ చేయగా వాటి జీవిత కాలం 4-5 సంవత్సరాల అంచనా వేసింది. 2018 మార్చి 31, నాటికి గరిష్టంగా ఉన్న రూ. 6.73 లక్షల కోట్ల (చెలామణీలో ఉన్న నోట్లలో 37.3 శాతం) మొత్తం విలువ రూ. 6.73 లక్షల కోట్ల నుంచి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గింది, ఇది కేవలం 10.8 శాతం మాత్రమే.  2016 నవంబరులో అప్పటిదాకా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు  రూ. 500, 1,000 నోట్లను రద్దు చేసింది.  (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు)
మరోవైపు రూ. 2వేల నోటు వితడడ్రా ప్రకటించిన వెంటనే ఆర్బీఐ వెబ్‌సైట్‌ క్రాష్‌ కావడం గమనార్హం.   భారీ ట్రాఫిక్‌ కారణంగా ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. 

No comments:

Post a Comment