UPI Payments: రూ.2 వేలు మించి ఫోన్‌పే, గూగుల్‌పే చెస్తే అదనపు చార్జీలు.. ఎవరికి వర్తిస్తుందంటే..
యూపీఐ యూజర్లు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ మొదటి నుంచి మొబైల్ పేమెంట్ యాప్ కస్టమర్ల ఆర్థిక లావాదేవీలపై ఫీజు వసూలు చేయనున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఓ సర్క్యూలర్ జారీ చేసింది.
పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే కొన్ని రకాల చెల్లింపులపై యూపీఐ ద్వారా ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేయాలని ఎన్‌పీసీఐ నిర్ణయించింది. ఆన్‌లైన్ వాలెట్‌లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది.
ప్రీపెయిడ్ సాధనాల నుంచి యూపీఐ ద్వారా రూ.2000కు పైగా లావాదేవీ జరిపితే టెలికాంకు 0.70 శాతం, మ్యూచువల్ ఫండ్‌కు ఒక శాతం, యుటిలిటీస్‌కు 0.70 శాతం, విద్యకు 0.70 శాతం, సూపర్ మార్కెట్‌కు 0.90 శాతం, బీమాకు ఒక శాతం, వ్యవసాయానికి 0.70 శాతం కన్వీనియెన్స్ స్టోర్‌కు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. అయితే గరిష్ఠంగా రూ.15 మాత్రమే వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment