School Holidays 2023: 1 నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సెల‌వులు... పెరుగుతున్న ఎండ‌ల‌ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యం

 
School Holidays 2023: 1 నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సెల‌వులు... పెరుగుతున్న ఎండ‌ల‌ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యం
సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఇంకా మే మొద‌లుకానే లేదు. భానుడు విరుచుకుప‌డుతున్నాడు. ఎండ‌ల ధాటికి చిన్నా, పెద్దా తేడా లేకుండా అంద‌రూ నీడ ప‌ట్టునే ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల శ్రేయ‌స్తు ద‌`ష్ట్యా ప్ర‌భుత్వాలు సెల‌వులు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలు ఈ మేర‌కు నిర్ణ‌యం కూడా తీసుకున్నాయి. ప్ర‌స్తుతం ఒంటి పూట మాత్ర‌మే పాఠ‌శాల‌లు న‌డుస్తున్నాయి.
School Holidays
                                                            School Holidays
పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు
భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్ఛ‌రిక‌ల నేప‌థ్యంలో ఒడిశా ప్ర‌భుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేడి గాలులు భారీగా వీస్తుండ‌డంతో పిల్ల‌ల‌కు వ‌డ‌దెబ్బ త‌గిలే అవ‌కాశం ఉంది. వ‌చ్చే మూడు రోజుల పాటు సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌ల కంటే 3, 4 డిగ్రీల ఉష్ణోగ్ర‌త ఎక్కువ‌గా న‌మోద‌వుతుంద‌ని హెచ్చ‌రించింది. దీంతో పాఠ‌శాల‌లకు సెల‌వులను ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఒడిశా వ్యాప్తంగా మంగ‌ళ‌వారం తొమ్మిది చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. దీంతో ఏప్రిల్ 12 నుంచి 16వ తేదీ వరకు పదో తరగతి వరకు అన్ని పాఠశాలలతో పాటు అంగన్ వాడీ సెంట‌ర్ల‌ను మూసివేయాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు.
స‌మీక్ష నిర్వ‌హించి నిర్ణ‌యం
ఒడిశా అంతటా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం జపాన్ నుంచి వచ్చిన నవీన్ పట్నాయక్ వెంటనే రాష్ట్రంలో ప్రస్తుత వడగాల్పుల పరిస్థితితో పాటు కోవిడ్ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వడగాల్పుల సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలన్నారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లేటప్పుడు ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

No comments:

Post a Comment