Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్ పేరు
భారత మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్‌కు అరుదైన గౌరవం దక్కింది.
ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలోని ఎమ్‌సీఎఫ్ హాకీ స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్’ అని పిలవనున్నారు. స్వయంగా ఆమెనే ఈ స్టేడియాన్ని ప్రారంభించారు. దేశంలో ఒక స్టేడియానికి మహిళా ప్లేయర్ పేరుపెట్టడం ఇదే తొలిసారి. టోక్యో ఒలింపిక్స్ అనంతరం గాయపడ్డ రాణి(28) ఈ మధ్యే పూర్తి ఫిట్‌నెస్‌తో ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.
ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం.. మే 28న ఫైనల్ మ్యాచ్ ధోనీ ఆడేనా....?
No comments:
Post a Comment