PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

 
PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?
పాన్‌తో ఆధార్‌ను అనుసంధానానికి సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడిగించింది.
PAN-Aadhaar link
మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలలు పెంచుతూ జూన్‌ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపు దారులకు మరికొంత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్స్‌ అధికారికంగా ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా  పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు పొడిగింపుపై కేంద్రం ఆర్ధిక శాఖ స్పందించింది. జూన్‌ 30, 2023 లోపు  పాన్‌ -ఆధార్‌ అనుసంధానం చేయాలని, లేదంటే పాన్‌ కార్డ్‌ పని చేయదని స్పష్టం చేసింది. పాన్‌ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానం చేయాలి. 
☛ అంతేకాదు పాన్‌ కార్డ్‌ నిరుపయోగమైతే చెల్లింపులు నిలిచిపోతాయి.  
☛ పాన్‌ కార్డ్‌ పని చేయని కాలానికి వడ్డీలు పొందలేరు.  
☛ చట్టం ప్రకారం.. టీడీఎస్‌, టీసీఎస్‌లు ఎక్కువ రేటుతో తొలగించడం/సేకరించడం జరుగుతుంది. 

UPI Payments: రూ.2 వేలు మించి ఫోన్‌పే, గూగుల్‌పే చెస్తే అదనపు చార్జీలు.. ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే..

No comments:

Post a Comment