ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ తిరిగి టాప్ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
83.4 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియా కుబేరుడిగా ఆవిర్భవించారు. ప్రపంచ కుబేరుల్లో 9వ ర్యాంకును ఆక్రమించారు. వ్యక్తిగత సంపదపై ఫోర్బ్స్ విడుదల చేసిన 2023 ప్రపంచ బిలియనీర్ల తాజా జాబితాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 24వ ర్యాంకుకు దిగిపోయారు. ఈ ఏడాది జనవరి 24న గౌతమ్ అదానీ 126 బిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మూడో ర్యాంకులో నిలిచారు. అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ సంపద 47.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
Top 10 Billionaires: అంబానీ.. టాప్–10 సంపన్నుల్లో ఏకైక భారతీయుడు.. 23వ స్థానంలో అదానీ
ప్రపంచ కుబేరుల తీరిలా ..
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సంపదలో 38 శాతం(57 బిలియన్ డాలర్లు) నష్టపోయారు. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో రెండు నుంచి మూడో స్థానానికి తగ్గారు. ఈ ఏడాది టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సంపదలో 39 బిలియన్ డాలర్లు ఆవిరికావడంతో రెండో ర్యాంకుకు పరిమితమయ్యారు. కాగా.. విలాస వస్తువుల ఫ్రెంచ్ టైకూన్ బెర్నాల్డ్ ఆర్నాల్ట్ 211 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో తొలిసారి ప్రపంచ టాప్ ర్యాంకును ఆక్రమించారు. మస్క్ సంపద 180 బిలియన్ డాలర్లు కాగా, బెజోస్ ఆస్తులు 114 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Latest News
Mukesh Ambani: ఆసియా కుబేరుడిగా ముకేశ్ అంబానీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment