IT: ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల ఉద్యోగాలు తొల‌గింత‌... ఐటీ అంటేనే భ‌య‌ప‌డుతున్న ఉద్యోగులు

 ఐటీ,ఐటీయేతర కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోతలు ఆగడం లేదు. ఆయా సంస్థలు వరుసగా విసురుతున్న లేఆఫ్స్‌ కత్తులు టెక్కీలతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు భయంతో వణికిపోయేలా చేస్తున్నాయి.
MASSIVE JOB CUTS
ఉద్యోగం నుంచి తొలగించినట్లు అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో వస్తున్న ఈ-మెయిల్స్‌ వారిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
మూడు నెల‌ల్లో 2.7ల‌క్ష‌ల మంది...!
తాజాగా విడుదలైన ఓ నివేదిక సైతం క్యూ1లో అమెరికాకు చెందిన కంపెనీలు 2.70 లక్షల మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపింది. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగుల్లో ఐటీ రంగానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు తేలింది. చికాగో కేంద్రంగా ప్లేస్‌మెంట్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఛాలెంజర్, గ్రే అండ్‌ క్రిస్మస్’ అనే సంస్థ ఉద్యోగాల తొలగింపులపై ‘ఛాలెంజర్‌ రిపోర్ట్‌’ పేరుతో ఏప్రిల్‌ 6న ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో జనవరి 2023 నుంచి మార్చి 31వ తేదీకి అమెరికాలో సుమారు 2,70,416 మంది ఉద్యోగుల్ని వివిధ సంస్థలు ఇంటికి పంపినట్లు తెలిపింది. జనవరిలో 102,943 మంది, ఫిబ్రవరిలో 77,770 మంది, మార్చిలో 89,703 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
ఖ‌ర్చులు తొల‌గించుకునే నెపంతో...!
ఉద్యోగుల తొల‌గింపు విష‌య‌మై చాలెంజర్, గ్రే అండ్‌ క్రిస్మస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ చాలెంజర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో కంపెనీలు సానుకూల దృక్పథంతో ఉన్నాయని, అయితే ముందస్తు ఆర్థిక మాంద్యం భయం, వడ్డీరేట్ల పెంపు, కంపెనీల ఖర్చలు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల్ని ఫైర్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఈ తొలగింపులు టెక్నాలజీ రంగంలో ఎక్కువగా ఉన్నాయన్నారు.

No comments:

Post a Comment