IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచలనం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే.. టాస్ గెలిస్తే ఒక టీమ్, ఓడితే మరో టీమ్ రంగంలోకి..
ఐపీఎల్ 2023 అభిమానులకు గంతంలో కంటే మరింత కిక్‌ను ఇవ్వబోతోంది.
మార్చి 31 నుంచి జరగబోయే ఐపీఎల్ సీజన్‌లో బీసీసీఐ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. గత ఏడాది నుంచి ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడుతున్నాయి. లక్నో, గుజరాత్ జట్లను కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఐపీఎల్‌లో బీసీసీఐ కొన్ని కీలక మార్పులు చేసింది.
టాస్ తర్వాతే తుది జట్టు..
ఇప్పటిదాకా 11 మంది జట్టు సభ్యులను టాస్‌కు ముందే ప్రకటించాల్సి ఉండే రూల్‌ను క్లాజ్ 1.2.1 ప్రకారం బీసీసీఐ మార్చేసింది. టాస్ తర్వాత రిఫరీకి సమర్పించే 11 మంది ప్లేయర్లు, ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ల లిస్ట్ నుంచి తమకు నచ్చిన తుది జట్టును ఎంచుకోవచ్చు. అంతకుముందే జట్టును ప్రకటించినా సరే.. మ్యాచ్ ప్రారంభానికి ముందు మార్పులు చేసుకోవచ్చు. దీనివల్ల టాస్ గెలిస్తే ఒక టీమ్‌ను, ఓడితే మరో టీమ్‌ను ఎంచుకునే వెసులుబాటు దొరుకుతుంది. ఈ కొత్త రూల్‌ను ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రవేశపెట్టారు.
Latest News
IPL 2023 New Rules: ఐపీఎల్‌లో సంచలనం రేకెత్తించే కొత్త రూల్స్ ఇవే.. టాస్ గెలిస్తే ఒక టీమ్, ఓడితే మరో టీమ్ రంగంలోకి..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment