World Bank: భారత్ వృద్ధికి సంస్కరణల ఊతం.. ప్రపంచ బ్యాంక్ విశ్లేషణ
భారత్ ఇప్పటికే అమలు చేస్తున్న ప్రతిష్టాత్మకమైన సంస్కరణల ఎజెండాను మరింత వేగవంతంగా అమలు చేయడం వల్ల దేశ వృద్ధి వేగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక పేర్కొంది.
ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రతికూలతకు దారితీసిందని బహుళజాతి బ్యాంకింగ్ దిగ్గజం స్పష్టం చేసింది. ఆయా పరిస్థితులు ఎకానమీ పురోగతికి సంబంధించి ప్రపంచం ఒక ‘దశాబ్దాన్ని’ కోల్పోయే పరిస్థితిని సృష్టిస్తున్నాయని హెచ్చరించింది. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక పురోగతి మూడు దశాబ్దాల కనిష్టానికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. 2000–2010 మధ్య ప్రపంచ స్థూల వృద్ధి రేటు దాదాపు 6.5 శాతం ఉంటే, 2020–30 మధ్య కాలానికి ఈ రేటు 2.2 శాతానికి పడిపోవచ్చని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, ఎకానమీ క్షీణత 2000– 2010 మధ్య సంవత్సరానికి సగటున 6 శాతం ఉంటే, ఈ దశాబ్దంలో మిగిలిన కాలంలో సంవత్సరానికి 4 శాతానికి పడిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం– మాంద్యం పరిస్థితులు తలెత్తితే ఈ పతనం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.
No comments:
Post a Comment