దక్షిణమధ్య రైల్వేకు తక్కువ సమయంలోనే రెండో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌గా అందుబాటులోకి వస్తున్న సికింద్రాబాద్–తిరుపతి సర్వీసును ప్రధాని మోదీ ఏప్రిల్ 8న ఉదయం 11:45 గంటలకు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ రైలు రెగ్యులర్ సర్వీసు ఏప్రిల్ 9న మధ్యాహ్నం 3:15 గంటలకు తిరుపతి నుంచి మొదలు కానుంది. సికింద్రాబాద్–తిరుపతి ఏసీ చైర్‌కార్ ధరను రూ.1,680గా ఖరారు చేయగా ఎగ్జిక్యూటివ్ కోచ్‌లోని ఏసీ చైర్‌కార్ ధరను రూ.3,080 (కేటరింగ్ చార్జీలు కలుపుకొని)గా నిర్ణయించారు. అలాగే తిరుపతి–సికింద్రాబాద్ వందేభారత్ రైల్లో ఏసీ చైర్‌కార్ ధర రూ.1,625గా ఉండగా ఎగ్జిక్యూటివ్ కోచ్‌లోని ఏసీ చైర్‌కార్ ధర రూ.3,030గా ఉంది. తిరుపతికి వెళ్లే ఇతర ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే ఈ రైల్లో టికెట్ ధరలు అధికంగా నిర్ణయించడంతో ప్రస్తుతానికి 8 కోచ్‌లనే ఏర్పాటు చేశారు. డిమాండ్ ఎలా ఉంటుందో స్పష్టత వచ్చే వరకు తక్కువ కోచ్‌లతోనే నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ – కొన్ని సంగతులు..
☛ దేశంలోనే 13వ వందేభారత్ సర్వీసు
☛ దక్షిణ మధ్య రైల్వేలో రెండోది
☛ ట్రైన్ నంబర్లు: సికింద్రాబాద్– తిరుపతి 20701, తిరుపతి–సికింద్రాబాద్ 20702
☛ రెగ్యులర్ ట్రిప్పుల్లో ఈ రైలు ఆగే స్టేషన్లు: నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు
☛ మొత్తం కోచ్‌లు: 8 (ఎకానమీ చైర్‌కార్ కోచ్‌లు 7, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లు 1), రెండూ కలిపి మొత్తం సీట్లు: 530
☛ ప్రత్యేకతలు: స్లైడింగ్ డోర్స్, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో 360 డిగ్రీల కోణంలో తిరిగే కుర్చీలు, ఇతర కోచ్‌లలో సెమీ స్లీపర్ స్థాయిలో తిరిగే కుర్చీలు, ఎమర్జెన్సీ అలారం బటన్, లోకో పైలట్ కేబిన్‌తో మాట్లాడే ప్రత్యేక వ్యవస్థ, సీసీ కెమెరాలు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయాలు ఇవీ..
సికింద్రాబాద్ టు తిరుపతి తిరుపతి టు సికింద్రాబాద్
అరైవల్ | డిపార్చర్ | స్టేషన్ | అరైవల్ | డిపార్చర్ |
– | ఉ.6:00 | సికింద్రాబాద్ | రా.11:45 | – |
7:19 | 7:20 | నల్లగొండ | 10:10 | 10:11 |
9:45 | 9:50 | గుంటూరు | 7:45 | 7:50 |
11:09 | 11:10 | ఒంగోలు | 6:30 | 6:31 |
12:29 | 12:30 | నెల్లూరు | 5:20 | 5:21 |
2:30 | –– | తిరుపతి | –– | 3:15 |
No comments:
Post a Comment