భారత్‌ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్‌ కోత

 భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది.
World Bank Cuts India's Growth Forecast
ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్‌ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్‌) సమావేశాలకు ముందు వరల్డ్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ (దక్షిణాసియా) హన్స్‌ టిమ్మర్‌ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. 
☛ బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణం.  
☛ దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్‌ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్‌ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే.


No comments:

Post a Comment