APRS, APRJC, APRDC CET 2023: ఏపీఆర్‌జేసీ సెట్‌కు నోటిఫికేషన్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ(APREIS) నిర్వహణలో ఉన్న జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది.
 ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(APRJC CET 2023)కు ఏప్రిల్‌ 4 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.నరసింహారావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను మే 12 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. మే 20న మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష ఉండనుంది. ఈ పరీక్షఫలితాలను జూన్‌ 8న ప్రకటిస్తారు. అనంతరం ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సిలింగ్‌ జూన్‌ 12 నుంచి 16వరకు; జూన్‌ 19 నుంచి 21వరకు రెండో విడత; జూన్‌ 26 నుంచి 28వరకు మూడో విడత కౌన్సిలింగ్‌ జరగనుంది.

ఇదిలా ఉండగా, డిగ్రీ కళాశాలల్లోనూ ప్రవేశాలకూ దరఖాస్తులు మంగళవారం నుంచే మొదలయ్యాయి. అలాగే, పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలతో పాటు ఆయా విద్యా సంస్థల్లో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు కార్యదర్శి నరసింహారావు ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని తరగతుల్లో ప్రవేశాల కోసం మే 20న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ https://aprs.apcfss.inను సందర్శించాలని కోరారు.








No comments:

Post a Comment