నిరుద్యోగులకు భారీ శుభవార్త.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 7500 పోస్టుల భర్తీకి .. దరఖాస్తులు ప్రారంభం(SSC CGL Notification 2023)


పూర్తి వివరాలు 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు సంబంధించి 7,500ల ఉద్యోగాల భర్తీకి నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌) పరీక్ష-2023కు సంబంధించి 7,500ల ఉద్యోగాల భర్తీకి నియామక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

 ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

                               అర్హత 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ/ ఎంబీఏ (ఫైనాన్స్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

                            వయస్సు 

 అభ్యర్ధుల వయసు ఆగస్టు 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

                         ధరఖాస్తు చివరి తేది

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మే 3, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

                           ధరఖాస్తు ఫీజు 

 జనరల్ అభ్యర్ధులు రూ .100లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. 

                         ఎంపిక విధానం 

రాతపరీక్ష (టైర్‌-1, టైర్‌-2), డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్/ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

                          జీతభత్యాలు

 ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,51,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
  • అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఐబీ)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎవోఆర్‌)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఎంవోఈఏ)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎఫ్‌హెచ్‌క్యూ)
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఈ అండ్‌ ఐటీ)
  • అసిస్టెంట్
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్
  • ఇన్‌స్పెక్టర్(సీజీఎస్టీ అండ్‌ సెంట్రల్ ఎక్సైజ్)
  • ఇన్‌స్పెక్టర్(ప్రివెంటివ్ ఆఫీసర్)
  • ఇన్‌స్పెక్టర్(ఎగ్జామినర్)
  • అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
  • సబ్ ఇన్‌స్పెక్టర్
  • ఇన్‌స్పెక్టర్(పోస్ట్ డిపార్ట్‌మెంట్)
  • అసిస్టెంట్/ సూపరింటెండెంట్
  • అసిస్టెంట్
  • అసిస్టెంట్(ఎన్‌సీఎల్‌ఏటీ)
  • రిసెర్చ్ అసిస్టెంట్
  • డివిజనల్ అకౌంటెంట్
  • సబ్ ఇన్‌స్పెక్టర్
  • జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
  • ఆడిటర్(సీ అండ్‌ ఏజీ)
  • ఆడిటర్
  • ఆడిటర్ (సీజీడీఏ)
  • అకౌంటెంట్
  • అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్‌
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌
  • సబ్-ఇన్‌స్పెక్టర్

                   ముఖ్యమైన తేదీలు 

  •  ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు 03-04-2023 నుండి 03-05-2023 వరకు
  •  ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరియు సమయం 03-05-2023 (23:00)
  •  ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ మరియు సమయం 04-05-2023 (23:00)
  •  ఆఫ్‌లైన్ చలాన్ ఉత్పత్తికి చివరి తేదీ మరియు సమయం 04-05-2023 (23:00)
  •  చలాన్ ద్వారా చెల్లింపుకు చివరి తేదీ (ఈ సమయంలో బ్యాంక్ పని గంటలు) 05-05-2023
  •  ఆన్‌లైన్ చెల్లింపుతో సహా దిద్దుబాటు. 07-05-2023 నుండి 08-05-2023 వరకు (23:00)
  •  టైర్-I యొక్క తాత్కాలిక షెడ్యూల్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) జులై, 2023
  •  టైర్-II యొక్క తాత్కాలిక షెడ్యూల్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) తర్వాత తెలియజేయబడుతుంది.
                     ముఖ్యమైన లింకులు 
          
               Apply Link  :- CLICK HERE 
       
             Notification  :- CLICK HERE 


No comments:

Post a Comment