ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం.. మే 28న ఫైనల్ మ్యాచ్ ధోనీ ఆడేనా....?
మరోవైపు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అతని సారథ్యంలోని చెన్నై ఎప్పటిలాగే బలంగా ఉంది. స్టోక్స్, డెవాన్ కాన్వె, రుతురాజ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, జడేజా, తీక్షణ, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ స్టోక్స్ ఆ జట్టుకు కీలకం కానున్నాడు. ప్రాక్టీస్ సందర్భంగా ధోని మోకాలికి గాయమైంది. తొలి మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశముంది. మ్యాచ్‌లన్నీ స్టార్‌స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రసారం అవుతాయి.
No comments:
Post a Comment