Jaydev Unadkat: జైదేవ్‌ ఉనాద్కట్ రికార్డు.. మొదటి ఓవర్లోనే ‘హ్యాట్రిక్‌’ సాధించిన తొలి బౌలర్‌గా ఘనత

 


Jaydev Unadkat: జైదేవ్‌ ఉనాద్కట్ రికార్డు.. మొదటి ఓవర్లోనే ‘హ్యాట్రిక్‌’ సాధించిన తొలి బౌలర్‌గా ఘనత

క్రికెట్‌లో ‘హ్యాట్రిక్‌’లు, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొత్తేం కాదు.. కానీ ఆట మొదలైన ఓవర్లోనే వరుసగా మూడు వికెట్లు (హ్యాట్రిక్‌) తీస్తే.. ఆ ముగ్గురు డకౌట్‌ అయితే అది చరిత్ర!
అలాంటి ఘనమైన రికార్డును సౌరాష్ట్ర సీమర్‌ జైదేవ్‌ ఉనాద్కట్‌ (8/39) ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో లిఖించాడు. 88 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ఈ రికార్డు సృష్టించాడు. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో జ‌న‌వ‌రి 3న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన ఉనాద్కట్‌ మూడో బంతికి ధ్రువ్‌ శోరే (0)ను, నాలుగో బంతికి వైభవ్‌ (0)ను, ఐదో బంతికి యశ్‌ ధుల్‌ (0)ను అవుట్‌ చేశాడు. తన మరుసటి ఓవర్‌ వేసిన ఉనాద్కట్‌ మళ్లీ పంజా విసిరాడు. జాంటీ సిద్ధు (4)తోపాటు లలిత్‌ యాదవ్‌ (0)నూ స్కోరు చేయనివ్వలేదు. మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 5/6. మళ్లీ ఐదో ఓవర్‌ వేసిన ఉనాద్కట్‌ లక్ష్యయ్‌   (1)ను పెవిలియన్‌ చేర్చాడు. 10 పరుగులకే ఢిల్లీ 7 వికెట్ల‌ను కోల్పోయింది.

No comments:

Post a Comment