Brazil President: బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డా సిల్వా
బ్రెజిల్ దేశ 39వ అధ్యక్షుడిగా లులా డా సిల్లా జనవరి 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధించారు. లులా డ సిల్వా పూర్తి పేరు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా. గతంలో ఆయన 2003 నుంచి 2006 వరకు, 2007 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు. మిలియన్ల మంది బ్రెజిలియన్లు పేదరికం నుండి తప్పించుకోవడానికి సహాయం చేసిన నాయకుడిగా ఘనత పొందారు. లులా మనీలాండరింగ్ సంబంధించి భారీ అవినీతి కుంభకోణంలో చిక్కుకొని సుమారు ఏడాదిన్నర జైలు జీవితం గడిపాడు. అయితే 2019లో ఈ కేసు కొట్టివేయబడింది. ఈ కేసులో న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారనే కారణంతో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అతని నేరారోపణను రద్దు చేసింది.
No comments:
Post a Comment