కరెంటు అఫైర్స్ 2022 (డిసెంబర్) : Current Affairs Decmber 2022 Download PDF | Monthly Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2022 కు చెందిన తాజా ముఖ్యాంశాలు . పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థుల కోసం నేషనల్, ఇంటర్నేషనల్, సైన్స్ & టెక్నాలజీ, డిఫెన్స్ & సెక్యూరిటీ, బిజినెస్ & ఎకానమీ, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, స్పోర్ట్ అంశాలకు చెందిన పూర్తిస్థాయి తాజా వర్తమాన అంశాలను చదవండి.

డిసెంబరు నుంచి జీ20 అధ్యక్ష హోదాలో భారత్‌
భారతదేశం అధికారికంగా ఒక సంవత్సరం పాటు G20 అధ్యక్ష పదవిని చేపట్టింది. 1 డిసెంబర్ 2022 నుండి నవంబర్ 20, 2023 వరకు ఒక సంవత్సరం పాటు ఈ హోదాను కలిగి ఉండటంతో పాటుగా వివిధ సమావేశాలకు ఆతిథ్యమివ్వనుంది. ఈ సందర్భంగా జి-20 లోగోతో పాటుగా 100 స్మారక చిహ్నాలను విడుదల చేశారు.

సిసియూఎస్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించిన నీతి ఆయోగ్
నీతి ఆయోగ్ ఇటీవలే కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (CCUS) పాలసీ ఫ్రేమ్‌వర్క్ మరియు దాని డిప్లాయ్‌మెంట్ మెకానిజంను భారతదేశంలో ప్రారంభించింది. దీని ద్వారా ఉక్కు, సిమెంట్, చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్, రసాయనాలు మరియు ఎరువులు వంటి అధిక కాలుష్య రంగాల నుండి కార్బన్ డయాక్సైడును డీకార్బనైజ్ చేసే సాంకేతికతను ఉపయోగించి 2050 నాటికి 750 mtpa కార్బన్ క్యాప్చర్‌ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.


Download Complete Decmber 2022 Monthly Current Affairs Click Here

No comments:

Post a Comment