Indian Economy Bits in Telugu #part2(ఇండియన్ ఎకనామి ప్రశ్నలు )

 Indian Economy Most important questions in Telugu for APPSC/TSPSC Group-1, Group-2, Group-3, Group-4, SI of Police, Constable, AEE, JE and other competitive exams.


1. కింది వాటిలో అతి ప్రాచీనమైన వ్యవస్థ ఏది?
ఎ) సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ
బి) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ
సి) మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ
డి) పైవన్నీ

2. నిర్ణీత కాలంలో దేశంలోని వస్తు సేవల ఉత్పత్తిలోని పెరుగుదలను ఏమంటారు?
ఎ) ఆర్థిక వృద్ధి బి) ఆర్థికాభివృద్ధి
సి) మానవాభివృద్ధి డి) సుస్థిరాభివృద్ధి

3. ఒక దేశంలో అభివృద్ధి ఏమేరకు జరిగిందో తెలుసు కొనుటకు ఉపయోగపడేవి ఎవి?
ఎ) అభివృద్ధి సూచిక
బి) వృద్ధి మాపనలు
సి) బహుళ కోణ సూచికలు
డి) ఎ, బి

4. లింగ అసమానత సూచిక (జీఐఐ)ను ఏ సంవత్సరంలో ప్రవేశ పెట్టారు?
ఎ) 2009 బి) 2010
సి) 2011 డి) 2012

5. ప్రపంచ అకలిసూచీ స్కేల్‌ విలువ సున్నా(0) ఉంటే?
ఎ) Best Score Ist Rank
బి) Worest Score Last Rank
సి) మధ్యస్థం డి) పైవన్నీ

6. మూడో ప్రపంచ దేశాలు అంటే?
ఎ) అభివృద్ధి చెందిన దేశాలు
బి) అభివృద్ధి చెందుతున్న దేశాలు
సి) అతిపేద దేశాలు డి) పైవన్నీ

7. సంప్రదాయ సమాజాన్ని మొదట ఎవరు పేర్కొన్నారు?
ఎ) డబ్ల్యూ.డబ్ల్యూ. రోస్టోవ్‌
బి) హల్బర్ట్‌, హర్షమన్‌
సి) రాగ్నర్‌ నర్క్స్‌ డి) గుర్నాల్‌ మిర్దాల్‌

8. అంతర్గత ప్రదర్శనా ప్రభావం ప్రతిపాదించినది ఎవరు?
ఎ) రాగ్నర్‌ నర్క్స్‌ బి) డ్యూసెన్‌ బెర్రి
సి) ఆడమ్‌ స్మిత్‌ డి) ఆచార్య పిగూ

9. వ్యయార్హ ఆదాయం
ఎ) వ్యష్టి ఆదాయం-వ్యష్టిపన్ను
బి) వినియోగం+ పొదుపు
సి) ఎ, బి, డి) పైవేవీకావు

10. ఆర్థికాభివృద్ధితో పాటు జనాభా పెరుగుదలరేటు కూడా పెరగడాన్ని ఏమంటారు?
ఎ) అధిక జనాభా
బి) జనాభా విస్పోటనం
సి) వ్యతిరేఖ జనాభా విప్లవం
డి) పైవన్నీ

11. గొప్ప విభాజక సంవత్సరం ఏది?
ఎ) 1911 బి) 1921
సి) 1951 డి) 1975

12. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళ్రిఎ ఎన్ని సంవత్సరాలకు ప్రణాళికను రూపొందించారు?
ఎ) 10 బి) 15 సి) 20 డి) 25

13. గాంధేయ ప్రణాళికను ఏ సంవత్సరంలో రూపొందించారు?
ఎ) 1934 బి) 1943
సి) 1944 డి) 1945

14. పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో రూపొందించి అమలు పరిచే ప్రణాళికను ఏమంటారు?
ఎ) నిర్దేశాత్మక ప్రణాళిక
బి) అదేశాత్మక ప్రణాళిక
సి) సూచనాత్మక ప్రణాలిక
డి) ఎ, బి

15. నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొదట అమలు చేసిన దేశం?
ఎ) భారతదేశం బి) జపాన్‌
సి) నెదర్లాండ్‌ డి) ఫ్రాన్స్‌

16. కిందివాటిలో నీతి ఆయోగ్‌ వెబ్‌సైట్‌ ఏది?
ఎ) my gov.group
బి) Gov.group
సి) Niti gov.group
డి) India.niti.group

17. పీహెచ్‌డీ చేసిన వ్యక్తి తక్కువ జీతంతోప్రైవేట్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఏ రకమైన నిరుద్యోగం?
ఎ) అనుద్యోగిత
బి) అల్ప ఉద్యోగిత
సి) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
డి) విద్యానిరుద్యోగిత

18. ‘ఎన్విరాన్‌మెంట్‌’ అనే ఆంగ్లపదం ‘ఎన్విరానర్‌’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) గ్రీక్‌ బి) ఫ్రెంచ్‌
సి) జర్మనీ డి) ఇటాలియన్‌

19. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు ఏ రకమైన వలస?
ఎ) దర్భిక్ష వలస బి) శాశ్వత వలస
సి) మేధావుల వలస డి) బాహ్య వలస

20. జమీందారి పద్ధతిని ఏ సంవత్సరం నుంచి అమలు చేశారు?
ఎ) 1793 బి) 1883
సి) 1833 డి) 1792



Download Economy Part-1 Bits in Telugu

No comments:

Post a Comment