Indian Economy Bits in Telugu #part1(ఇండియన్ ఎకనామి ప్రశ్నలు )

 Indian Economy Most important questions in Telugu for APPSC/TSPSC Group-1, Group-2, Group-3, Group-4, SI of Police, Constable, AEE, JE and other competitive exams.



1. ప్రపంచంలో మొదటిసారి ద్రవ్యాన్ని కాగిత రూపంలో ఉపయోగించినవారు?
1) జపాన్‌ 2) స్వీడన్‌
3) బ్రిటన్‌ 4) చైనా

2. ఏ సంవత్సరంలో మనదేశంలో మొదటిసారి ద్రవ్యాన్ని కాగితరూపంలో ఉపయోగించారు?
1) 1856 2) 1806
3) 1757 4) 1824

3. భారతదేశంలో రూపియా పేరుతో మొదటిసారిగా వెండి రూపాయి నాణేన్ని ముద్రించినది ఎవరు?
1) జహంగీర్‌ 2) షేర్షా
3) హుమాయున్‌ 4) అక్బర్‌

4. ఏ సంవత్సరంలో మొదటిసారిగా బ్రిటిష్‌ ప్రభుత్వం రూపీ పేరుతో కరెన్సీని ప్రవేశపెట్టింది?
1) 1834 2) 1857
3) 1858 4) 1934

5. నోట్ల ముద్రణలో భద్రతా దారాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
1) 1940 2) 1935
3) 1955 4) 1938

6. కింది వాక్యాల్లో సరైనది ఏది?
ఎ. భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
బి. విదేశాల్లో అధిక బ్రాంచ్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏర్పాటు చేసింది
సి. భారతదేశంలో అతిపెద్ద రెండో వాణిజ్య బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌
డి. మహాత్మగాంధీ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ముంబైలో ఏర్పాటు చేశారు
1) 1, 2 2) 2, 3
3) 1, 3 4) పైవన్నీ

7. భారతదేశంలో మొదటిసారి రూపాయి విలువను ఎప్పుడు తగ్గించారు?
1) 1949 2) 1966
3) 1951 4) 1956

8. 1 ఏప్రిల్‌ 1957 నుంచి నూతన దశాంశ పద్ధతి అమలులోకి వచ్చిన తొలిసారిగా 1 పైసా నాణేన్ని ఎప్పుడు విడుదల చేశారు?
1) 1957 2) 1959
3) 1962 4) 1967

9. కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం ఏటా ఎంత వ్యయం చేస్తుంది?
1) రూ.2,872 కోట్లు
2) రూ.2,562 కోట్లు
3) రూ.3,232 కోట్లు
4) రూ.4,326 కోట్లు

10. భారతదేశంలో అత్యంత విలువ గల కరెన్సీ రూ.10,000 నోటును తొలిసారి ఎప్పుడు ముద్రించారు?
1) 1938 2) 1946
3) 1950 4) 1952

11. 2022 మార్చి నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ ఎంత?
1) రూ.24,20,975 కోట్లు
2) రూ.24,20,463 కోట్లు
3) రూ.28,26,863 కోట్లు
4) రూ.25,22,863 కోట్లు

12. భారత రూపాయికి విశిష్ట చిహ్నాన్ని రూపొందించింది ఎవరు?
1) ఉదయ్‌ కుమార్‌ 2) రంజిత్‌ కుమార్‌
3) ఉమేశ్‌ కుమార్‌ 4) రణబీర్‌ అక్బర్‌

13. భారత రూపాయికి విశిష్ట చిహ్నాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 2010 జూలై 15 2) 2015 జూన్‌ 10
3) 2010 జూలై 5 4) 2010 జూన్‌ 5

14. ప్రపంచంలో కరెన్సీ చిహ్నంగా ఉన్న ఎన్నో ఆర్థిక వ్యవస్థగా భారత్‌ గుర్తింపు పొందింది?
1) 4 2) 8 3) 3 4) 5

15. భారతదేశంలో అధిక విలువ గల కరెన్సీ నోట్లను మొదటిసారిగా ఎప్పుడు రద్దు చేశారు?
1) 1945 2) 1949
3) 1951 4) 1946

16. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను ఎప్పుడు రద్దు చేసింది?
1) 2016 నవంబర్‌ 18
2) 2016 అక్టోబర్‌ 18
3) 2016 నవంబర్‌ 8
4) 2018 నవంబర్‌ 8

No comments:

Post a Comment