General Science : Biology(మొక్కల కణజాలాలు) APPSC/TSPSC Exams 2022

 Important General Science Questions in Telugu for APPSC/TSPSC Group1,2,3,4 SI of Police, Constable, AP High court Jr. Assistant, Office Subordinates, Examiner, Typist, Copyist, Stenographer, Process Server, Gramasachivalayam, RRB Group D, NTPC, SSC Exams


1. మొక్కల్లో విభాజ్య కణజాలం ఉపయోగం?

1) కాండం, వేరు పొడవు పెరుగుటకు
2) దృఢత్వాన్ని ఇవ్వడానికి
3) ప్రసరణకు
4) పదార్థాల రవాణాకు
2. కిరణజన్యసంయోగక్రియ, శ్వాసక్రియ వంటి వాటికి ఉపయోగపడే కణజాలం?
1) దృఢ కణజాలం 2) దారు కణజాలం
3) మృదు కణజాలం 4) పోషక కణజాలం
3. వివిధ రకాల కణాలతో ఏర్పడి, అన్ని ఒకే క్రియాత్మక ప్రమాణంగా వ్యవహరించే కణజాలాన్ని ఏమంటారు?
1) సరళ కణజాలం
2) సంక్లిష్ట కణజాలం
3) ప్రత్యేక కణజాలం
4) విభాజ్య కణజాలం
4. మొక్కల్లో దారుకణజాలం దేనికి ఉపయోగ పడుతుంది? 
1) దృఢత్వాన్ని ఇవ్వడానికి
2) కిరణజన్య సంయోగ క్రియకు
3) మొక్క వ్యాసార్థంగా పెరుగుటకు
4) నీటి ప్రసరణకు
5. నీటి ప్రసరణకు ఉపయోగపడే దారుకణజాలంలో దారునాళాలు ఏ మొక్కల్లో ఉంటాయి?
1) బ్రయోఫైటా 2) టెరిడోఫైటా
3) ఆవృతబీజాలు 4) వివృతబీజాలు
6. మొక్కల్లో పోషకపదార్థాల రవాణాకు ఉపయోగపడే కణజాలం?
1) పోషక కణజాలం
2) రవాణా కణజాలం
3) దృఢ కణజాలం
4) మృదు కణజాలం
7. కింది ఏ కణాలు మొక్క భాగాలు వ్యాకోచం చెందడానికి ఉపయోగపడుతాయి?
1) దృఢ కణజాలం 2) స్థూలకోణ కణజాలం
3) స్థిర కణజాలం 4) సంక్లిష్ట కణజాలం
8. ఏ మొక్క నుంచి స్రవించే లేటెక్స్‌ అనే ద్రవం పసుపు రంగులో ఉంటుంది?
1) ఆర్జిమోన్‌ 2) అరటి
3) సపోటా 4) గన్నేరు
9. ఫైకస్‌ ఎలాస్టికా అనే మొక్క నుంచి లభించే రబ్బరును ఏమని పిలుస్తారు?
1) పనామా రబ్బరు
2) ఇండియా రబ్బరు
3) సియోర రబ్బరు
4) గ్యుయల్‌ రబ్బరు
10. గోల్ఫ్‌ బంతుల తయారీలో ఉపయోగపడే లేటెక్స్‌ ఏ మొక్క నుంచి లభిస్తుంది?
1) పార్థీనియం 2) ఫైకస్‌
3) పలాక్వియం గుట్టా 4) మానిహట్‌
11. అంతరిక్ష ప్రయాణాల్లో ఉపయోగపడే శైవలం?
1) క్లామిడోమోనాస్‌ 2) స్పైరోగైరా
3) క్లోరెల్లా 4) కారా
12. శిలీంధ్రాలు, శైవలాలతో కూడి ఏర్పరిచిన జీవిని ఏమని పిలుస్తారు?
1) మైకోరైజా 2) లైకెన్‌
3) రైజోమార్ఫ్‌ 4) థాలస్‌
13. కింది వాటిలో ఏ శిలింధ్రం నుంచి యాంటిబయాటిక్‌ను తయారుచేయవచ్చు?
1) ఈస్ట్‌ 2) బ్యాక్టీరియా
3) రైజోపస్‌ 4) పెనిసీలియం
14. బ్రయోఫైటా మొక్కలను ఏ మారుపేరుతో పిలుస్తారు?
1) వృక్షరాజ్య ఉభయ జీవులు
2) వృక్షరాజ్య సరీసృపాలు
3) సముద్రపు కలుపుమొక్కలు
4) ఎంబ్రియోఫైటా మొక్కలు
15. మాస్‌ మొక్కలు వృక్షరాజ్యంలో ఏ విభాగానికి చెందుతాయి?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) బ్రయోఫైటా 4) టెరిడోఫైటా
16. ఆహారంగా ఉపయోగపడే శిలీంధ్రానికి ఉదాహరణ?
1) రిక్సియా 2) ఈస్ట్‌
3) పెనిసీలియం 4) పుట్టగొడుగు
17. కింది వాటిలో టెరిడోఫైటా మొక్కల లక్షణం?
1) ఈ మొక్కలన్నీ నీటిలో ఉంటాయి
2) వీటి ఫలదీకరణకు నీరు అవసరం
3) కాండానికి మూలతంతువులు ఉంటాయి
4) కాండంలో ప్రసరణ కణజాలాలు ఉంటాయి
18. ఏ టెరిడోఫైటా మొక్కను జీవ ఎరువుగా వరిపొలాల్లో ఉపయోగిస్తారు?
1) సెలాజినెల్లా 2) అజొల్లా
3) సైకస్‌ 4) ప్యునేరియా
19. శైవలాలతో ఏ తరగతికి చెందిన వాటిని ఆదిమమైన జీవులుగా పరిగణిస్తారు?
1) ఆకుపచ్చ శైవలాలు
2) పసుపుపచ్చ శైవలాలు
3) గోధుమ వర్ణశైవలాలు
4) నీలి ఆకుపచ్చ శైవలాలు
20. ఏ శైవలాల కణకవచం సిలికాతో ఉంటుంది?
1) డయాటమ్‌లు 2) నాస్టాక్‌
3) అనబినా 4) వాచీరియా
21. కాలేయ ఆకృతిలో ఉండే మొక్కలు, కొమ్ము ఆకృతిలో ఉండే మొక్కలు ఏ విభాగానికి చెందుతాయి?
1) వివృత బీజాలు 2) బ్రయోఫైటా
3) వృత బీజాలు 4) ఆవృతబీజాలు
22. వివృత బీజాల్లో ఏర్పడే శంఖువులను వేటితో పోల్చవచ్చు?
1) వేరు 2) కాండం
3) పుష్పం 4) విత్తనం
23. కింది వాటిలో ద్విదళ బీజ లక్షణం కానిది?
1) అబ్బురపు వేరు వ్యవస్థ
2) తల్లి వేరు వ్యవస్థ
3) జాలాకార ఈనెల వ్యాపనం
4) విత్తనంలో రెండు బీజదళాలుంటాయి
24. వరి, గోధుమ, మొక్కజొన్న ఏ విభాగానికి చెందుతాయి?
1) ఏకదళ బీజాలు 2) ద్విదళ బీజాలు
3) స్పెర్మటోఫైటా 4) వివృత బీజాలు
25. వరి మొక్క శాస్త్రీయ నామం?
1) ట్రిటికమ్‌ ఈస్టివమ్‌
2) టామరిండస్‌ ఇండికా
3) పైసమ్‌ సటైవమ్‌
4) ఒరైజా సటైవా
26. కజానస్‌ కజాన్‌ అనేది ఏ మొక్క శాస్త్రీయ నామం?
1) పెసర 2) శనగ
3) కంది 4) చెరకు
27. ఏ మొక్కలు అతిచిన్న విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి?
1) ఆర్కిడ్‌ మొక్కలు
2) గడ్డిజాతి మొక్కలు
3) పామ్‌ మొక్కలు
4) ఎడారి మొక్కలు
28. ఆడ, మగ వేరువేరుగా ఉండే మొక్కకు ఉదాహరణ?
1) కొబ్బరి 2) ఖర్జూరం
3) బొప్పాయి 4) అరటి
29. ఏ మొక్కలను ప్రప్రథమ నిజమైన మొదటి నేల మొక్కలని పిలుస్తారు?
1) శైవలాలు 2) ఏకదళ బీజాలు
3) ద్విదళ బీజాలు
4) టెరిడోఫైటా మొక్కలు
30. వివృత బీజాల్లోని విత్తనంలో అంకురచ్ఛదం ఏస్థితిలో ఉంటుంది?
1) ఏకస్థితిలో 2) ద్వయస్థితికలో
3) త్రయస్థితికలో 4) చతుఃస్థితిలో
31. విత్తనాలను ఉత్పత్తిచేసే మొక్కలను ఏమని పిలుస్తారు?
1) స్పెర్మటోఫైటా 2) ట్రాకియోఫైటా
3) ఎట్రాకియోఫైటా 4) క్రిపోటగామ్స్‌
32. మొక్క దేహం కాండం, వేరు, పత్రాలుగా విభజన చెందించలేని మొక్కలను ఏ విభాగంలో చేర్చారు?
1) బ్రయోఫైటా 2) థాలోఫైటా
3) టెరిడోఫైటా 4) స్పెర్మటోఫైటా
33. కింది వాటిలో పుష్పించని మొక్కలకు చెందినది?
1) అరటి 2) నీటమ్‌
3) వరి 4) మార్సీలియా
34. థాలోఫైటాకు చెందిన ఏ మొక్కలను సముద్రపు కలుపు మొక్కలు అనే పేరుతో
పిలుస్తారు?
1) శైవలాలు 2) శిలీంధ్రాలు
3) వివృత బీజాలు 4) ఆవృత బీజాలు
35. శిలీంధ్రాలకు చెందిన ఏ జీవిని బ్రెడ్‌ మౌల్డ్‌ అని అంటారు?
1) పెనిసీలియం 2) అగారికస్‌
3) రైజోపస్‌ 4) ఈస్ట్‌
36. కిందివాటిలో కాంతి రసాయనిక చర్యకు ఉదాహరణ?
1) కిరణజన్యసంయోగక్రియ
2) శ్వాసక్రియ
3) ప్రొటీన్‌ సంశ్లేషణ
4) ఎన్‌జైమ్‌ సంశ్లేషణ
37. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్‌ దేని నుంచి వెలువడుతుంది?
1) కార్బన్‌ డై ఆక్సైడ్‌ 2) నీరు
3) గ్లూకోజ్‌ 4) పిండి పదార్థం
38. ఏ కాంతిలో కిరణజన్య సంయోగ క్రియ అధికంగా జరుగుతుంది?
1) అరుణ కాంతి 2) ఆకుపచ్చ కాంతి
3) నీలి కాంతి
4) పసుపు పచ్చకాంతి
39. కిరణజన్య సంయోగ క్రియ జరిగే కణాంగం?
1) రైబోజోమ్‌ 2) మైటోకాండ్రియా
3) హరిత రేణువు 4) కేంద్రకం
40. కిరణజన్య సంయోగ క్రియలో కర్బన క్షయకరణాన్ని వివరించిన ఏ శాస్త్రవేత్తకు నోబెల్‌ బహుమతి ప్రదానం చేశారు?
1) జాన్సన్‌ 2) మెండల్‌
3) కాల్విన్‌ 4) వాట్సన్‌
41. కిరణజన్య సంయోగ క్రియలో నేరుగా ఏర్పడే ఆహారపదార్థాలు?
1) కొవ్వుపదార్థం 2) మాంసకృత్తులు
3) గ్లూకోజ్‌ 4) అమైనో ఆమ్లాలు
42. కింది వాటిలో కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరికానిది ఏది?
1) ఇది ఒక కాంతి రసాయన చర్య
2) ఇది హరితరేణువులో జరుగుతుంది
3) దీనిలో ఆక్సిజన్‌ వెలువడుతుంది
4) ఇది ఒక విచ్ఛిన్న క్రియ
43. కిరణజన్య సంయోగ క్రియలో కాంతి ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1) నీటిని విశ్లేషించడానికి
2) పత్రహరిత సంశ్లేషణకు
3) పిండి పదార్థాల తయారీకి
4) నీటి ఉత్పత్తికి
44. హరితరేణువుల్లో ఉండే ఏ వర్ణ ద్రవ్యం కాంతిని గ్రహించుకొంటుంది, వినియోగించుకుంటుంది?
1) కెరోటినాయిడ్‌లు
2) ఫైకోబిలియన్‌లు
3) పైకోసయనిన్‌ 4) పత్రహరితం
45. లైకోపిన్‌ అనే వర్ణ ద్రవ్యం కింది ఏ ఫలంలో ఉంటుంది?
1) మామిడి 2) బొప్పాయి
3) టొమాటో 4) నారింజ
46. శ్వాసక్రియలో ఆహారపదార్థాలు విచ్ఛిన్నమవడం లేదా మండటం వల్ల విడుదలయ్యే వాయువు?
1) ఆక్సిజన్‌ 2) కార్బన్‌ డై ఆక్సైడ్‌
3) హైడ్రోజన్‌ 4) నైట్రోజన్‌
47. ఒక గ్లూకోజ్‌ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెంది ఎన్ని కిలోకాలరీల శక్తి విడుదలవుతుంది?
1) 986 కి.కా 2) 770 కి.కా
3) 686 కి.కా 4) 590 కి.కా
48. క్రెబ్స్‌ వలయం, ఎలక్ట్రాన్‌ రవాణా అనేవి కింది ఏ ప్రక్రియలో జరిగే చర్యలు?
1) వాయు శ్వాసక్రియ
2) అవాయు శ్వాస క్రియ
3) ప్రొటీన్‌ సంశ్లేషణ
4) కిరణజన్యసంయోగక్రియ
49. ఉన్నతస్థాయి జంతువుల్లో, మొక్కల్లో శ్వాస క్రియలో ఎక్కువ చర్యలు ఏ కణాంగంలో జరుగుతాయి?
1) రైబోజోమ్‌ 2) హరితరేణువు
3) మైటోకాండ్రియా 4) కేంద్రకం
50. వాయు శ్వాసక్రియలో ఆహారపదార్థాలు మండటానికి వినియోగపడే వాయువు?
1) కార్బన్‌ డై ఆక్సైడ్‌ 2) ఓజోన్‌
3) హైడ్రోజన్‌ 4) ఆక్సిజన్‌
51. శ్వాసక్రియ కింది ఏ ప్రక్రియకు ఉదాహరణగా పేర్కొనవచ్చు?
1) నిర్మాణాత్మక క్రియ
2) విచ్ఛిన్న క్రియ
3) శక్తి గ్రాహక చర్య
4) ఉష్ణగ్రాహక చర్య
52. జీవుల్లో జరిగే ఏ చర్య ఉష్ణమోచక చర్యకు ఉదాహరణ?
1) ప్రొటీన్‌ల సంశ్లేషణ
2) కొవ్వుల సంశ్లేషణ
3) శ్వాసక్రియ
4) కిరణజన్య సంయోగ క్రియ
53. జీవరసాయనిక చర్యలకు ఉపయోగపడే ఏ శక్తి రూపాన్ని ఎనర్జికరెన్సి అని పిలుస్తారు?
1) ATP 2) NADH
3) NADPH 4) FADPH
54. శ్వాసక్రియలో ఎక్కువ సందర్భాల్లో ప్రాథమికంగా, నేరుగా వినియోగించే పదార్థం?
1) అమైనో ఆమ్లం 2) కొవ్వు ఆమ్లం
3) గ్లూకోజ్‌ 4) విటమిన్‌ -ఎ
55. అవాయు శ్వాసక్రియ కింది ఏ జీవిలో జరుగుతుంది?
1) కప్ప 2) ఈస్ట్‌
3) స్టార్‌ఫిష్‌ 4) చేప
56. పారిశ్రామికంగా ఎక్కువగా వినియోగించే కింది ఏ పదార్థం అవాయు శ్వాసక్రియలో చివరగా ఏర్పడుతుంది?
1) పైరువిక్‌ ఆమ్లం
2) పాస్ఫోగ్లిసరిక్‌ ఆమ్లం
3) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం
4) ఆల్కహాల్‌
57. వాయు, అవాయు శ్వాసక్రియ రెండింటిలో ఉండే దశ?
1) కిణ్వనం 2) ైగ్లెకాలిసిస్‌
3) క్రెబ్స్‌ వలయం 4) ఎలక్ట్రాన్‌ రవాణా
58. అవాయు శ్వాసక్రియలో వెలువడే శక్తి?
1) 100 కిలో క్యాలరీలు
2) 56 కిలో క్యాలరీలు
3) 686 కిలో క్యాలరీలు
4) 120 కిలో క్యాలరీలు
59. మొలాసిస్‌ నుంచి కిణ్వ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్‌ తయారీకి ఏ జీవి ఉపయోగపడుతుంది?
1) ఈస్ట్‌ 2) అమీబా
3) యూగ్లీనా 4) బ్యాక్టీరియా
60. అవాయు పద్ధతిలో ఈస్ట్‌ కిణ్వప్రక్రియ ద్వారా ఏర్పరిచే ఆల్కహాల్‌?
1) మిథైల్‌ ఆల్కహాల్‌
2) బ్యుటైల్‌ ఆల్కహాల్‌
3) ఇథైల్‌ ఆల్కహాల్‌
4) పెంటైల్‌ ఆల్కహాల్‌


సమాధానాలు

1.1 2.3 3.2 4.4 5.3
6.1 7.2 8.1 9.2 10.3
11.3 12.2 13.4 14.1 15.3
16.4 17.4 18.2 19.4 20.1
21.2 22.3 23.1 24.1 25.4
26.3 27.1 28.3 29.4 30.1
31.1 32.2 33.4 34.1 35.3
36.1 37.2 38.1 39.3 40.4
41.3 42.3 43.3 44.4 45.1
46.4 47.3 48.2 49.3 50.1
51.3 52.4 53.2 54.3 55.1
56.3 57.2 58.4 59.2 60.2

No comments:

Post a Comment