CISF Constable : 10వ తరగతి పాసైన వాళ్లకు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. 787 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల


CISF Constable Recruitment 2022 : సీఐఎస్‌ఎఫ్‌ 787 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి అర్హతతో మహిళలు, పురుషులు


CISF Constable Tradesman Recruitment 2022 : కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల వారీగా పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ యూనిట్లకు రక్షణ నిమిత్తం సీఐఎస్‌ఎఫ్‌ 787 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి అర్హతతో మహిళలు, పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నార్తర్న్‌, ఎన్‌సీఆర్‌, వెస్ట్రన్‌, సెంట్రల్‌, ఈస్ట్రన్‌, సదరన్‌, సౌత్‌ ఈస్ట్రన్‌, నార్తర్న్‌ ఈస్ట్రన్‌ సెక్టార్లలో ఈ ఖాళీలున్నాయి.
మొత్తం ఖాళీలు: 787
  • కానిస్టేబుల్/ కుక్: 304 పోస్టులు
  • కానిస్టేబుల్/ కోబ్లర్‌: 06 పోస్టులు
  • కానిస్టేబుల్/ టైలర్: 27 పోస్టులు
  • కానిస్టేబుల్/ బార్బర్: 102 పోస్టులు
  • కానిస్టేబుల్/ వాషర్ మ్యాన్: 118 పోస్టులు
  • కానిస్టేబుల్/ స్వీపర్: 199 పోస్టులు
  • కానిస్టేబుల్/ పెయింటర్: 01 పోస్టు
  • కానిస్టేబుల్/ మేసన్: 12 పోస్టులు
  • కానిస్టేబుల్/ ప్లంబర్: 04 పోస్టులు
  • కానిస్టేబుల్/ మాలి: 03 పోస్టులు
  • కానిస్టేబుల్/ వెల్డర్: 03 పోస్టులు
బ్యాక్‌లాగ్ ఖాళీలు:
  • కానిస్టేబుల్/ కోబ్లర్‌: 01 పోస్టు
  • కానిస్టేబుల్/ బార్బర్: 07 పోస్టులు

ముఖ్య సమాచారం:
  • అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
  • వయోపరిమితి: 01.08.2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02/08/1999 కంటే ముందు, 01/08/2004 తర్వాత జన్మించి ఉండకూడదు.
  • శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థులు: ఎత్తు- 170 సెం.మీ., ఛాతీ- 80-85 సెం.మీ. మహిళా అభ్యర్థులు: ఎత్తు- 157 సెం.మీ. ఉండాలి.
  • జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100.
  • ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్‌ బేస్డ్/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), మెడికల్ ఎగ్జామినేషన్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు ఫీజు: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
  • రాత పరీక్ష విధానం: పీఎస్‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులు రాత పరీక్షకు ఎంపికవుతారు. పరీక్షకు 2 గంటల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్ అవేర్‌నెస్/ జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఆప్టిట్యూడ్, హిందీ/ ఇంగ్లిషులో ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే సామర్థ్యం తదితరాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌/ హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులు ప్రారంభం: నవంబర్‌ 21, 2022
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్‌ 20, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://cisfrectt.in/

No comments:

Post a Comment