BSF: 10వ తరగతి, ఇంటర్‌ పాసైన వాళ్లకు గుడ్‌న్యూస్‌.. 1312 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

BSF Head Constable RO RM Recruitment 2022: మొత్తం పోస్టుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌) - 982, హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌)- 330 ఉన్నాయి. 75 శాతం ఖాళీలను నేరుగా భర్తీ చేస్తారు. 25 శాతం ఖాళీలను బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నవారితో భర్తీ చేస్తారు.

  

BSF Head Constable Recruitment 2022:బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య సరిహద్దు భద్రతా కేంద్రాల్లో ఖాళీలగా ఉన్న 1312 పోస్టుల భర్తీకి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌) - 982, హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌)- 330 ఉన్నాయి. 75 శాతం ఖాళీలను నేరుగా భర్తీ చేస్తారు. 25 శాతం ఖాళీలను బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్నవారితో భర్తీ చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్‌ 19 దరఖాస్తులకు చివరితేది.

అర్హతలు:
అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ పాసై ఉండాలి. రేడియో అండ్‌ టెలివిజన్‌/ ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ /డేటా ప్రిపరేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌/జనరల్‌ ఎలక్ట్రానిక్స్‌/డేటా ఎంట్రీ ఆపరేటర్‌/ ఎలక్ట్రీషియన్‌/ ఫిట్టర్‌ /ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌/ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌/కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌/నెట్‌వర్క్‌ టెక్నీషియన్‌/ మెకట్రానిక్స్‌ కోర్సు పాసై ఉండాలి. లేదా ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
  • వయసు: సెప్టెంబరు 19, 2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికోద్యోగులు, బీఎస్‌ఎఫ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: రూ.100 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీఎప్‌ఎఫ్‌ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
  • ఎంపిక విధానం:
    • రాత పరీక్షలో అర్హత సాధించినవారిని ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ), డాక్యుమెంటేషన్, మెడికల్‌ ఎగ్జామ్‌లకు ఎంపికచేస్తారు.
    • హెడ్‌కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌) అభ్యర్థులు డిక్టేషన్, పారాగ్రాఫ్‌ రీడింగ్‌ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఆ తర్వాతే వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
    • హెచ్‌సీ (ఆర్‌ఎం) అభ్యర్థులకు పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. హెచ్‌సీ (ఆర్‌వో) అభ్యర్థులకు ఓఎంఆర్‌ పరీక్షకు 200 మార్కులు, డిక్టేషన్‌కు 50 మార్కులు ఉంటాయి. దీనిలో భాగంగా 100 పదాలకు డిక్టేషన్‌ ఉంటుంది. దీని ద్వారా అభ్యర్థుల ఇంగ్లిష్‌ ఉచ్చారణ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
    • రాత, పీఈటీ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను మెడికల్‌ పరీక్షకు ఎంపికచేస్తారు.
    • ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌ (పీఈటీ): పురుష అభ్యర్థులు 1.6 కి.మీ. పరుగు పందేన్ని 6 1/2 నిమిషాల్లో, 11 అడుగుల లాంగ్‌ జంప్‌ను మూడు ప్రయత్నాల్లో పూర్తి చేయాలి. 3 1/2 అడుగుల దూరం హైజంప్‌ను మూడు ప్రయత్నాల్లో పూర్తిచేయాలి.
    • మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందాన్ని 4 నిమిషాల్లో, 9 అడుగుల లాంగ్‌ జంప్, 3 అడుగుల హైజంప్‌లను 3 ప్రయత్నాల్లో పూర్తిచేయాలి.
    • మాజీ సైనికోద్యోగులు, బీఎస్‌ఎఫ్‌ ఉద్యోగులకు పీఈటీ నుంచి మినహాయింపు ఉంటుంది.
    • శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థుల ఎత్తు 168 సెం.మీ. ఉండాలి. చాతీ 80 సెం.మీ.ఉండి గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. వ్యాకోచించాలి. వయసు, ఎత్తులకు తగ్గట్టుగా అభ్యర్థి బరువు ఉండాలి.
    • మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. వయసూ ఎత్తులకు తగ్గట్టుగా బరువు ఉండాలి.
    • రాత పరీక్ష విధానం:
      ఈ పరీక్ష.. మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. రాత పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. పార్ట్‌-1 ఫిజిక్స్‌లో 40 ప్రశ్నలు 80 మార్కులకు, పార్ట్‌-2 మేథమెటిక్స్‌లో 20 ప్రశ్నలు 40 మార్కులకు, పార్ట్‌-3 కెమిస్ట్రీ 20 ప్రశ్నలు 40 మార్కులకు, పార్ట్‌-4 ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌లో భాగంగా.. కరెంట్‌ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, జనరల్‌ సైన్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.

      ముఖ్య సమాచారం:
      • దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 19, 2022
      • రాత పరీక్ష తేదీ: నవంబరు 20, 2022 (పీఎస్‌టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్‌ జనవరి 16, 2023 నుంచి జరుగుతాయి)
      • మెడికల్‌ ఎగ్జామినేషన్‌: ఫిబ్రవరి 15, 2023 నుంచి ప్రారంభమవుతుంది.
      • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://bsf.gov.in/

No comments:

Post a Comment