AP DME Recruitment 2022 : ఏపీలో 1458 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు

AP DME 1458 Senior Resident Posts : ఏపీ డీఎంఈ పరిధిలోని మొత్తం 1,458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.



AP DME 1458 Senior Resident Posts : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ వైద్య, దంత వైద్య కాలేజీల్లో 49 స్పెషాలిటీల్లో మొత్తం 1,458 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 19 దరఖాస్తులకు చివరితేది.

మొత్తం ఖాళీలు: 1,458 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు
స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆఫ్తాల్మాలజీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, రెస్పిరేటరీ మెడిసిన్‌, సైకియాట్రి, రేడియో డయాగ్నోసిస్‌/ రేడియాలజీ,ఎమెర్జెన్సీ మెడిసిన్‌, డెంటిస్ట్రీ/ డెంటల్ సర్జరీ, రేడియోథెరపీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూక్లియర్ మెడిసిన్, అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, న్యూరాలజీ, కార్డియో థొరాసిక్ సర్జరీ/ సీవీటీ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, నియోనాటాలజీ, ప్రోస్థోడోంటిక్స్, ఓరల్ పాథాలజీ, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ/ ఎండోడొంటిక్స్, ఆర్థోడాంటిక్స్, పెడోడాంటిక్స్ & ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ/ కమ్యూనిటీ డెంటిస్ట్రీ, పీరియాడోంటిస్, ఓరల్ మెడిసిన్ అండ్‌ రేడియాలజీ, ఓరల్ మాక్సియోల్లో ఫేషియల్ సర్జరీ.

ముఖ్య సమాచారం:
  • అర్హత: మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్‌/ ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ ప్రభుత్వ మెడికల్ & డెంటల్ కాలేజీలలో పీజీ చదివిన స్థానిక అభ్యర్థులు అర్హులు.
  • వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.
  • జీత భత్యాలు: నెలకు రెసిడెంట్ సూపర్ స్పెషలిస్ట్ రూ.85,000; రెసిడెంట్ స్పెషలిస్ట్ డిగ్రీ(పీజీ) రూ.70,000; రెసిడెంట్ డెంటిస్ట్ (పీజీ) రూ.65,000 ఉంటుంది.
  • సర్వీసు కాలం: ఎంపికైన అభ్యర్థులు ఏడాది పని చేయాల్సి ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: పోస్టు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.500, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
  • దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్‌ 19, 2022.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://dme.ap.nic.in/

No comments:

Post a Comment