అభ్యర్థులు అక్టోబర్ 16వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని TSPSC కల్పించగా..తొలిరోజే 1,32,406మంది అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.. అక్టోబర్ 16వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1041 పరీక్షా కేంద్రాల్లో జరిగే ప్రిలిమ్స్‌కు 380202 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షను సాఫీగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది.
టెస్ట్ బుక్‌లెట్‌లో మార్పులు...:
గ్రూప్–1 పరీక్ష నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ బుక్‌లెట్‌ను కొత్తగా డిజైన్ చేసింది. ఇదివరకు టెస్ట్‌బుక్‌లెట్ సిరీస్ కోడ్ స్థానంలో ఏ,బీ,సీ,డీ ని రాయాల్సి ఉండేది. అలా కాకుండా పరీక్షను మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు టెస్ట్‌బుక్‌లెట్ సిరీస్ స్థానంలో ఆరు అంకెల నంబర్‌ను ఏర్పాటు చేసింది. నిర్దేశించిన బుక్‌లెట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్‌లో పూరించాల్సి ఉంటుంది. టెస్ట్‌బుక్‌లెట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్‌లో నిర్దేశించిన స్థానంలో నిర్ణీత పద్ధతిలో బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో గుర్తించే విధానాన్ని వివరణాత్మకంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి అక్టోబర్ 9న ఒక ప్రకటనలో తెలిపారు.
Download TSPSC Group-I Prelims Hall Ticket 2022 Click Here
TSPSC Official Website
No comments:
Post a Comment