NOBLE PRIZE WINNERS LIST 2022 : నోబెల్ ప్రైజ్ విజేతలు

ప్రపంచ వ్యాప్తంగా మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ (శాంతి) విభాగాల్లో కృషి చేసిన వారికి ప్రతి యేట అక్టోబర్ లో ప్రకటిస్తారు , డిసెంబర్‌ 10న నోబెల్‌ ఫ్రైజ్‌ ప్రధానం చేస్తారు. నోబెల్ అవార్డు విలువ దాదాపు 10 మిలియన్ స్వీడిష్ క్రోన్స్‌ ($900,357). అంటే 9 లక్షల డాలర్లు (73 కోట్ల రూపాయలు). స్వీడిష్ డైనమైట్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేర ఈ బహుమతిని స్థాపించారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.., నోబెల్ మరణించిన ఐదు సంవత్సరాల తర్వాత 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. 2022వ సంవత్సరానికి గానూ అన్ని రంగాల్లో నోబెల్‌ బహుమతులు అందుకోబోతున్న విజేతలు వీరే.

స్వాంటే పాబో వైద్యశాస్త్రంలో జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ బహుమతి లభించింది.

67 ఏళ్ల స్వాంటే పాబో.. పరిణామ జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ పేరుప్రఖ్యాతలు, ఎన్నో గౌరవాలు అందుకున్నారు. పాలియోజెనెటిక్స్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు పాబో. పురాతన జీవుల అవశేషాల నుంచి సంరక్షించబడిన జన్యు పదార్థాన్ని పరిశీలించడం ద్వారా గతాన్ని(ఒకప్పటి మనిషి జాతులు- ప్రాచీన ఆదిమతెగల గురించి) అధ్యయనం చేయడం పాలియోజెనెటిక్స్ ముఖ్యోద్దేశం.
జర్మనీ లెయిప్‌జిగ్ నగరంలోని మ్యాక్స్‌ ఫ్లాంక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో జన్యుశాస్త్ర విభాగానికి డైరెక్టర్ట్‌గా పాబో గతంలో విధులు నిర్వహించారు. జపాన్‌ ఒకినావా ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌ సైన్సెస్‌ & టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు.

కుటుంబ నేప‌థ్యం ఇదే..

స్వాంటే పాబో(Svante Paabo) పుట్టింది స్టాక్‌హోమ్‌లో. ఈయన తల్లి ఎస్టోనియాకు చెందిన కెమిస్ట్‌ కరిన్‌ పాబో. తండ్రి స్వీడన్‌కు చెందిన ప్రముఖ బయోకెమిస్ట్‌ కార్ల్‌ సనె బెర్గ్‌స్ట్రోమ్‌. బెర్గ్‌స్ట్రోమ్‌ 1982లో వైద్య రంగంలోనే నోబెల్‌ బహుమతి అందుకోవడం గమనార్హం. స్వీడన్‌కే చెందిన బయోకెమిస్ట్‌ బెంగ్ట్‌ శ్యాముల్‌స్సన్‌, బ్రిటిష్‌ పార్మకాలజిస్ట్‌ జాన్‌ ఆర్‌ వేన్‌లతో కలిసి కార్ల్‌ సనె బెర్గ్‌స్ట్రోమ్‌ నోబెల్‌ బహుమతిని పంచుకున్నారు. ఇప్పుడు బెర్గ్‌స్ట్రోమ్‌ తనయుడు పాబో కూడా వైద్యరంగంలోనే నోబెల్‌ విజేతగా నిలిచారు. 

➤ 1997లో, పాబో తన సహచరులు కలిసి నియాండర్తల్ మైటోకాన్డ్రియల్ DNA (mtDNA) సీక్వెన్సింగ్‌ను విజయవంతంగా నివేదించారు. నియాండర్ లోయలోని ఫెల్‌హోఫర్ గ్రోటోలో కనుగొనబడిన ఒక నమూనా నుంచి ఉద్భవించింది.
➤ ఆగష్టు 2002లో.. పాబో డిపార్ట్‌మెంట్ ‘‘భాషా జన్యువు’’.. FOXP2 గురించి పరిశోధనలను ప్రచురించింది. భాషా వైకల్యం ఉన్న కొందరిలో ఈ జన్యువు లేకపోవడం లేదంటే దెబ్బతినడం గుర్తించారు.
➤ 2006లో.. నియాండర్తల్‌ల మొత్తం జన్యువును పునర్నిర్మించే ప్రణాళికను ప్రకటించారు పాబో. ఈ పరిశోధనకుగానూ.. 2007లో టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పాబో ఎంపికయ్యారు.

➤ నియాండర్తల్స్‌.. అంతరించిన మానవజాతి. యూరేషియాలో వేల సంవత్సరాల కిందట బతికిన అర్చాయిక్‌ ఉపజాతిగా కూడా భావిస్తుంటారు.
➤ దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్‌ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో గుర్తించారు.
➤ ఫలితంగా.. ఈ తరం మానవుల్లోనూ ఈ పురాతన జన్యువుల ప్రవాహం కొనసాగుతోందని, ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, అంటువ్యాధులకు ప్రతిస్పందిస్తుందని ఆయన తన బృందంతో సాగించిన పరిశోధనల ఆధారంగా వెల్లడించారు.

➤ 2014లో నియాండర్తల్‌ మ్యాన్‌: ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ లాస్ట్‌ జీనోమ్స్‌ అనే పుస్తకం పాబో కోణంలో మానవ పరిణామ క్రమాన్ని వివరించే యత్నం చేసింది.
➤ కరోనా టైంలోనూ ఆయన చేసిన పరిశోధనలు.. ఎంతో పేరు దక్కించుకున్నాయి.
➤ స్వీడన్‌తో పాటు జర్మనీ నుంచి కూడా ఎన్నో ఉన్నత గౌరవాలు, బిరుదులు అందుకున్నారాయన.
➤ బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్‌ బయాలజీలో పరిశోధనలకుగానూ.. ఇంటర్నేషనల్‌ సైంటిఫిక్‌ సొసైటీ ‘ఎఫ్‌ఈబీఎస్‌’ థియోడోర్‌ బుచర్‌ మెడల్‌తో ఆయన్ని సత్కరించింది. డాన్ డేవిడ్‌ ప్రైజ్‌, మెస్రీ ప్రైజ్‌లు సైతం అందుకున్నారీయన.

➤ వీటితో పాటు ఐర్లాండ్‌, ఆస్ట్రియా, జపాన్‌, తదితర దేశాల నుంచి కూడా విశేష గౌరవాలను సొంతం చేసుకున్నారు.
➤ పాబోSvante Paabo తనను తాను బైసెక్సువల్‌ అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2014 వరకు ‘గే’గా ఉన్న ఈయన.. ఆపై సైంటిస్ట్‌ లిండా విజిలెంట్‌ను వివాహం చేసుకుని.. ఇద్దరు పిల్లల్ని కన్నారు.
➤ మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాబోకీ నోబెల్‌ బహుమతి లభించింది.
వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2022 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 10న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

ఈయ‌న పేరు మీద‌..

నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెల్సిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.

ఫిజిక్స్‌లో విశేష కృషి చేసినందుకుగానూ అలేన్‌ ఆస్పెక్ట్‌, జాన్‌ ఎఫ్‌ క్లాసర్‌, ఆంటోన్‌ జైలింగర్‌ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌-2022 వరించింది.

ఈ పరిశోధలకుగానూ.. నోబెల్‌

చిక్కుబడ్డ ఫోటాన్‌లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్‌ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది.
ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెయిన్‌ ఆస్పెక్ట్‌ కాగా.. జాన్‌ ఎఫ్‌. క్లౌజర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇక ఆంటోన్‌ జెయిలింగర్‌ ఆస్ట్రియాకు చెందిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త. చిక్కుకుపోయిన క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహించారు ఈ ముగ్గురు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ ముగ్గురి సాధన ఫలితాలు.. క్వాంటం సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి అని నోబెల్‌ కమిటీ ప్రకటించింది.
‘పరమాణువు నుంచి గ్రహాల ప్రమాణాల వరకు భౌతిక వ్యవస్థలలో హెచ్చుతగ్గుల పరస్పర చర్యలపై పరిశోధనలకు జార్జియోకు నోబెల్ బహుమతి లభించింది. ఈ ముగ్గురు విశేష పరిశోధనలు చేస్తున్నారని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రశసించింది.
☛ కిందటి ఏడాది కూడా ఫిజిక్స్‌లో ముగ్గురికే సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
☛ 1901 నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో నలుగురు గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడమ్‌ క్యూరీ(1903), మారియా జియోప్పెర్ట్‌ మయర్‌(1963), డొన్నా స్ట్రిక్‌ల్యాండ్‌(2018), ఆండ్రియా గెజ్‌(2020) ఈ లిస్ట్‌లో ఉన్నారు.
☛ ఇక ఫిజిక్స్‌లో చిన్నవయసులో నోబెల్‌ ఘనత అందుకుంది లారెన్స్‌ బ్రాగ్‌. కేవలం పాతికేళ్ల వయసుకే ఇతను 1915లో ఫిజిక్స్‌ నోబెల్‌ అందుకున్నాడు.

బహుమతిని రెండు సమానా భాగాలు చేసి.. స్యూకురో మనాబే, క్లాస్ హాసెల్‌మన్‌లకు ఒక భాగం.. జార్జియో పారిస్‌కు ఒక భాగం అందజేయనున్నారు. భూ వాతావరణం భౌతిక నమూనా, వైవిధ్యాన్ని లెక్కించడం.. గ్లోబల్ వార్మింగ్‌ను ఖచ్చితంగా అంచనా వేయడానికి స్యూకూరో, క్లాస్ సంయుక్తంగా పరిశోధనలు చేశారు.
‘2021 నోబెల్ గ్రహీత క్లాస్ హాసెల్‌మాస్ శీతోష్ణస్థితి, వాతావరణాన్ని కలిపే ఒక నమూనాను సృష్టించారు. వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రత కార్బన్ డయాక్సైడ్ మానవ ఉద్గారాల వల్ల అని నిరూపించడానికి ఆయన పద్ధతులు ఉపయోగపడ్డాయి’ అని కొనియాడింది. ‘జార్జియో క్రమరహిత సంక్లిష్ట పదార్థాలలో దాగున్న నమూనాలను కనుగొన్నారు.. సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంతానికి అతని ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి’ పేర్కొంది.
జపాన్ సంతతికి చెందిన అమెరికన్ స్యూకురో మనాబే ప్రిన్సిటన్ యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నారు. జర్మనీకి చెందిన క్లాస్ హాస్సెల్‌మాన్ హంబర్గ్‌లోని మ్యాక్ ప్లాంక్ మెటీరియాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. జార్జియో పారిసి ఇటలీకి చెందిన శాస్త్రవేత్త. బహుమతి కింద బంగారు పతకం, 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (1.14 మిలియన్ డాలర్ల) అందజేస్తారు.

కెమిస్ట్రీలో విశేష పరిశోధనలు జరిపిన రోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌.. ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి లభించింది.



రసాయన శాస్త్రంలో (Chemistry) విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (Nobel Prize 2022) లభించింది. క్లిక్‌ కెమిస్ట్రీతోపాటు బయోఆర్థోగోనల్‌ కెమిస్ట్రీలను అభివృద్ధి చేసినందుకు గానూ శాస్త్రవేత్తలు కరోలిన్‌ ఆర్‌ బెర్టోజీ, మార్టెన్‌ మెల్డల్‌, కే బ్యారీ షార్ప్‌లెస్‌లను ఈ ఏడాది నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ వెల్లడించింది.మరో విశేషమేంటంటే.. ఈఏడాది పురస్కారానికి ఎంపికైనన జాబితాలో ఉన్న బ్యారీ షార్ప్‌లెస్‌.. రెండుసార్లు నోబెల్‌ బహుమతి అందుకున్న ఐదో వ్యక్తిగా ఘనత సాధించనున్నారు. 2001లో బ్యారీ షార్ప్‌లెస్‌ ఒకసారి నోబెల్‌ పురస్కారం పొందగా ఈ ఏడాది రెండోది అందుకోనున్నారు. ఇప్పటివరకు నోబెల్‌ బహుమతులను జాన్‌ బర్డీన్‌, మేరీ స్ల్కోదోవ్‌స్కా క్యూరీ, లైనస్‌ పాలింగ్‌, ఫ్రెడెరిక్‌ సాంగర్‌లు రెండుసార్లు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును స్వీకరించారు.
గతేడాది రసాయన శాస్త్రంలో నోబెల్‌ అవార్డుకు ఇద్దరు ఎంపికకాగా ఈసారి ముగ్గురు విజేతలుగా నిలిచారు. పరమాణువు నిర్మాణంలో నూతన విధానమైన ఆర్గానోక్యాటలసిస్‌ అభివృద్ధి చేసినందుకు గాను 2021లో బెంజిమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ మెక్‌మిల్లన్‌లకు ఈ అవార్డు దక్కింది. రసాయన శాస్త్రాన్ని పర్యావరణహితంగా మార్చిన ఆ విధానం మానవాళికి ఎంతో ఉపయుక్తంగా ఉందని సెలక్షన్‌ కమిటీ అభిప్రాయపడింది.
ఇప్పటివరకు వైద్య విభాగంతోపాటు భౌతిక, రసాయనశాస్త్రాలలో నోబెల్‌ బహుమతుల విజేతలను ప్రకటించారు. ఆర్థిక రంగం, సాహిత్యం, శాంతి బహుమతులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించాల్సి ఉంది. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు.

పౌర హక్కుల కోసం కృషి చేస్తోన్న బెలారస్‌కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్‌ బియాలియాత్‌స్కీతో పాటు రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్‌’, ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’కు ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి దక్కింది.

నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. బెలార‌స్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల అడ్వ‌కేట్ అలెస్ బియాలియాస్కీతో పాటు ర‌ష్యాకు చెందిన మాన‌వ హ‌క్కుల సంస్థ‌, ఉక్రెయిన్‌కు చెందిన సివిల్ లిబ‌ర్టీస్‌ మాన‌వ హ‌క్కుల సంస్థ‌ల‌కు ఈ సారి ప్రైజ్ ద‌క్కింది. నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెలిచిన‌వాళ్లు త‌మ స్వ‌దేశాల్లో సివిల్ సొసైటీ త‌ర‌పున పోరాటం చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంత‌రం ప్ర‌శ్నించార‌ని, పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ర‌క్షించిన‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది.

శాంతి, ప్ర‌జాస్వామ్యం కోసం..

యుద్ధ నేరాల‌ను డాక్యుమెంట్ చేయ‌డంలో వాళ్లు అసాధార‌ణ సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌లు, అధికార దుర్వినియోగాన్ని వాళ్లు వేలెత్తి చూపిన‌ట్లు తెలిపింది. శాంతి, ప్ర‌జాస్వామ్యం కోసం శాంతి పుర‌స్కార గ్ర‌హీత‌లు ఎంతో కృషి చేసిన‌ట్లు నోబెల్ క‌మిటీ చెప్పింది.

ఫ్రెంచ్ రచయిత్రి అన్నే ఎర్నాక్స్‌కు 2022 సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది.

జెండ‌ర్‌, లాంగ్వేజ్‌, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాల‌పై చాలా స్ప‌ష్ట‌మైన రీతిలో ఎర్నాక్స్ అనేక ర‌చ‌న‌ల్లో త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేసినందుకు గానూ నోబెల్‌ బహుమతి వరించింది.
సుమారు 30కి పైగా సాహిత్య ర‌చ‌న‌లు చేశారు అర్నాక్స్‌. 1940లో ఆమె నార్మాండీలోని యెవ‌టోట్‌లో జ‌న్మించారు.చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ ర‌చ‌న‌లు చేస్తున్నారు. నోబెల్‌ బహుమతి ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడారు అర్నాక్స్‌. ‘ఇది నాకు చాలా పెద్ద గౌరవం. అలాగే.. గొప్ప బాధ్యత, నాకు లభించిన బాధ్యత. ర‌చ‌న అంటే ఓ రాజ‌కీయ చ‌ర్య, సామాజిక అస‌మాన‌త‌ల‌పై దృష్టి పెట్ట‌డ‌మే.’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా.. స‌మాజ ర‌చ‌న‌ల‌పై భాష‌ను ఆమె ఓ క‌త్తిలా వాడుతున్న‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది. స‌మాజ రుగ్మ‌త‌ల‌ను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగ‌డ‌తో ర‌చ‌న‌లు చేస్తున్న‌ట్లు క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది.

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై పరిశోధనలకుగానూ బెన్‌ షాలోమ్‌ బెర్నాంకే, డాగ్లస్‌ డబ్ల్యూ. డైమండ్‌, ఫిలిప్‌ హెచ్‌.డైబ్‌విగ్‌కు సంయుక్తంగా ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం అందజేస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది.

అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్‌విగ్‌లకు అక్టోబ‌ర్ 10వ తేదీన (సోమవారం) నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాల‌పై ఈ ముగ్గురి ప‌రిశోధ‌న‌లకుగాను రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్ర‌క‌టించింది.

ఈ ముగ్గురూ త‌మ ప‌రిశోధ‌న‌ల్లో..

ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్‌లను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహనను గణనీయంగా మెరుగుపరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్య‌మైంద‌న్న విష‌యాన్ని ఈ ముగ్గురూ త‌మ ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డించారు.. బ్యాంకులు దివాళా తీయ‌కుండా ఉండేందుకు ఈ స్ట‌డీ చాలా కీల‌క‌మైంద‌ని పేర్కొంది.

No comments:

Post a Comment