INDIAN GEOGRAPHY BITS-I(ఇండియన్‌ జాగ్రఫీ) : భారతదేశం- ఉనికి

 Indian Geography Questions in Telugu for APPSC/TSPSC Group 1, Group 2, Group 3, Group 4, SI of Police, Constable, AEE, JE, SSC, and Other Competitive Exams.

1.కింది వివరణను చదవండి.

ఎ. భారతదేశ ఉత్తర, దక్షిణం మధ్య పొడవు 3241 కి.మీ.
బి. భారతదేశ తూర్పు, పడమర మధ్య పొడవు 2933 కి.మీ
సి. ప్రపంచంలో రెండో అతిపెద్ద ద్వీపకల్పం భారత్‌
పై వాటిలో సరైనది గుర్తించండి?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి

2. భారత్‌లో కర్కటరేఖను ఖండించుకుంటూ
ప్రవహించే నదులు ఏవి?
1) హుగ్లీ, మహానది 2) గంగా, యమున
3) సోన్‌, నర్మద 4) బెట్వా, కెన్‌

3. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. లక్షదీవులను, మాల్దీవులను వేరుచేస్తున్నది-8 డిగ్రీల ఛానల్‌
బి. అండమాన్‌ నికోబార్‌ దీవులు- ఇండోనేషియాను వేరుచేస్తున్న ఛానల్‌- గ్రేట్‌ ఛానల్‌
సి. తీరరేఖ పొడవు ఎక్కువ గల నగరం-చెన్నై
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఏదీకాదు

4. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సరిహద్దు రేఖ?
1) రాడ్‌క్లిఫ్‌ రేఖ 2) డ్యురాండ్‌ రేఖ
3) మాజినాట్‌ రేఖ 4) మెక్‌మోహన్‌ రేఖ

5. కింది వివరణను చదివి సరైనది గుర్తించండి?
ఎ. భారతదేశం పూర్వార్ధ గోళంలో విస్తరించి ఉంది
బి. భారతదేశం 68071 నుంచి 970251 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది
సి. భారత్‌ అక్షాంశాల, రేఖాంశాల పరంగా 30 డిగ్రీల పొడవు, వెడల్పులో విస్తరించి ఉంది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి, డి

6. కింది వాటిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం?
1) మేఘాలయ 2) త్రిపుర
3) పశ్చిమ బెంగాల్‌ 4) మణిపూర్‌

7. జతపరచండి?
1. పాక్‌జల సంధి ఎ. భారత్‌, బంగ్లాదేశ్‌
2. రాడ్‌క్లిఫ్‌ రేఖ బి. భారత్‌, థాయ్‌లాండ్‌
3. న్యూమూర్‌ దీవులు సి. భారత్‌, శ్రీలంక
4. అండమాన్‌ సముద్రం
డి. భారత్‌, పాకిస్థాన్‌
1) 1-డి, 2-బి ,3-ఎ, 4-సి
2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ

8. కింది వాటిలో సరికానిది ఏది?
1) మన్నార్‌ సింధూశాఖ భారత్‌, మాల్దీవుల మధ్య ఉంది
2) పాంబన్‌ దీవి భారత్‌, శ్రీలంక మధ్య ఉంది
3) భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న దీవి
గ్రేట్‌ నికోబార్‌
4) పోర్ట్‌బ్లెయిర్‌ దక్షిణ అండమాన్‌ దీవిలో ఉంది

9. కింది వాటిలో భారత్‌- నేపాల్‌ మధ్య వివాదాస్పద ప్రాంతం?
1) కార్‌దుంగ్లా మార్గం 2) కాలాపాని
3) కాంచన్‌జంగా 4) డోక్లాం

10.కింది వాటిలో సరైనది గుర్తించండి?
ఎ. అసోం రాష్ట్రం భూటాన్‌, బంగ్లాదేశ్‌
దేశాలతో సరిహద్దును కలిగిఉంది
బి. మిజోరం బంగ్లాదేశ్‌, మయన్మార్‌
దేశాలతో భూసరిహద్దులు కలిగిఉంది
సి. ఉత్తరాఖండ్‌ రాష్టం చైనా, నేపాల్‌
దేశాలతో భూసరిహద్దు కలిగి ఉంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి

11. దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
1) ఢిల్లీ 2) చండీగఢ్‌
3) లక్షదీవులు
4) అండమాన్‌ నికోబార్‌ దీవులు

12. భారతదేశ ప్రామాణిక రేఖాంశం వెళ్లని రాష్ట్రం ఏది?
1) ఛత్తీస్‌గఢ్‌ 2) జార్ఖండ్‌
3) ఒడిశా 4) మధ్యప్రదేశ్‌

13. జతపరచండి
రాష్ట్రం సరిహద్దు దేశాలు
1. జమ్ముకశ్మీర్‌ ఎ. నేపాల్‌, చైనా, భూటాన్‌
2. పశ్చిమబెంగాల్‌ బి. భూటాన్‌, చైనా, మయన్మార్‌
3. సిక్కిం సి. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, చైనా
4. అరుణాచల్‌ప్రదేశ్‌ డి. భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌
1) 1-బి ,2-సి ,3-ఎ, 4-డి
2) 1-డి,2-ఎ, 3-బి, 4-సి
3) 1-సి,2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి,2-సి, 3-బి, 4-ఎ

14. భారత్‌తో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది?
1) పాకిస్థాన్‌ 2) నేపాల్‌
3) బంగ్లాదేశ్‌ 4) చైనా

15. భారత్‌తో అతి తక్కువ సరిహద్దు ఉన్న దేశం?
1) మయన్మార్‌ 2) నేపాల్‌
3) భూటాన్‌ 4) అఫ్గానిస్థాన్‌

16. జతపరచండి
దేశం సరిహద్దు రాష్ర్టాలు
1. మయన్మార్‌ ఎ. మేఘాలయ,
అసోం, మిజోరం,
త్రిపుర
2. నేపాల్‌ బి. అరుణాచల్‌ప్రదేశ్‌,
మిజోరం, మణిపూర్‌,
నాగాలాండ్‌
3. భూటాన్‌ సి. బీహార్‌,
పశ్చిమబెంగాల్‌,
ఉత్తరప్రదేశ్‌, సిక్కిం
4. బంగ్లాదేశ్‌ డి. పశ్చిమ బెంగాల్‌,
అసోం, సిక్కిం,
అరుణాచల్‌ప్రదేశ్‌
1) 1-బి ,2-సి ,3-ఎ, 4-డి
2) 1-డి,2-ఎ, 3-బి, 4-సి
3) 1-బి,2-సి, 3-డి, 4-ఎ
4) 1-డి,2-సి, 3-బి, 4-ఎ

17. కింది వాటిలో సరైనది ఏది?
1) ప్రపంచ ఖండ భూభాగంలో భారత వైశాల్యం 42శాతం
2) భారతదేశ పశ్చిమాన ఉన్న చివరి కొన గౌర్‌మోతా
3) భారతదేశ తూర్పున ఉన్న చివరి కొన దిల్పాకనుమ
4) పైవన్నీ సరైనవే

18. జతపరచండి?
1. ఎలిఫెంటా దీవి ఎ. ముంబై తీరం
2. అబ్దుల్‌ కలాం దీవి బి. చిలుకా సరస్సు
3. న్యూమూర్‌ దీవులు సి. గంగా నది డెల్టా
4. అలియబెట్‌ దీవి డి. నర్మద, తపతి
ముఖద్వారం
1) 1-సి ,2-ఎ ,3-బి, 4-డి
2) 1-బి,2-డి, 3-ఎ, 4-సి
3) 1-డి,2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ,2-బి, 3-సి, 4-డి

19. ప్రతిపాదన (ఎ): భారతదేశ తూర్పుకొనకు, పశ్చిమ కొనకు 2 గంటల వ్యత్యాసం ఉంటుంది
కారణం (ఆర్‌): దేశ తూర్పు కొనకు, పశ్చిమ కొనకు మధ్య సుమారు 40డిగ్రీల రేఖాంశం తేడా ఉంది.
సరైన దాన్ని గుర్తించండి?
1) (ఎ), (ఆర్‌) సరైనవి. (ఆర్‌), (ఎ) కు
సరైన వివరణ
2) (ఎ), (ఆర్‌) రెండూ సరైనవి. (ఆర్‌), (ఎ) కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కాని (ఆర్‌) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్‌) నిజం

20. కింది వాటిలో సరికానిది ఏది?
1) సిక్కిం రాష్ట్రం మూడు వైపులా అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉంది
2) తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం పరంగా దేశంలో 10వ స్థానాన్ని కలిగి ఉంది
3) భారతదేశ ప్రాదేశిక జలాల పరిధి 12 నాటికల్‌ మైళ్లు
4) అండమాన్‌ దీవుల్లో అతి ఎత్తయిన శిఖరం సాగిల్‌ పీక్‌

21. భారత్‌లో విస్తీర్ణం పరంగా అతి పెద్ద రాష్ర్టాలు ఏవి?
1) రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర
2) మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌
3) ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర
4) రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌

22. ప్రతిపాదన (ఎ): లక్షదీవుల్లో దక్షిణంగా ఉన్న దీవి సుహేలి దీవి.
కారణం (ఆర్‌): సుహేలి దీవికి దక్షిణంగా 9 డిగ్రీల ఛానల్‌ ఉంది.
పై వాటిలో సరైనది గుర్తించండి?
1) (ఎ), (ఆర్‌) సరైనవి. (ఆర్‌), (ఎ) కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్‌) రెండూ సరైనవి. (ఆర్‌), (ఎ) కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కాని (ఆర్‌) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్‌) నిజం

23. భారత్‌లోని ఏ రాష్ట్రం గుండా కర్కటరేఖ వెళ్లదు?
1) మిజోరం 2) ఒడిశా
3) ఛత్తీస్‌గఢ్‌ 4) జార్ఖండ్‌

24. కింది వాటిలో సరికానిది?
1) భారత్‌లో సముద్ర తీరం గల రాష్ర్టాల సంఖ్య-9
2) దేశంలో మూడు సముద్రాల కలయిక గల రాష్ట్రం- తమిళనాడు
3) సముద్రతీరం గల రాష్ర్టాలు తూర్పు తీరంలో 5 ఉన్నాయి
4) అత్యధిక సముద్ర తీరం గల రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌

25. సరిహద్దుపరంగా భారత్‌తో ఎక్కువ కి.మీ. నుంచి తక్కువ కి.మీ ఉన్న దేశాల క్రమం కింది వాటిలో సరైనది?
1) పాకిస్థాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, మయన్మార్‌
2) చైనా, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌
3) మయన్మార్‌, పాకిస్థాన్‌, చైనా, బంగ్లాదేశ్‌
4) బంగ్లాదేశ్‌, చైనా, పాకిస్థాన్‌, మయన్మార్‌

26. భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ‘ఇందిరా పాయింట్‌’ ఎక్కడ ఉంది?
1) కేరళ 2) లక్షదీవులు
3) గ్రేట్‌ నికోబార్‌ 4) లిటిల్‌ నికోబార్‌

27. సూర్యకిరణాలు ఒక రేఖాంశం దాటడానికి ఎంత సమయం పడుతుంది?
1) 4 సెకన్లు 2) 4 నిమిషాలు
3) 4 గంటలు 4) 14 నిమిషాలు

28. కింది వాటిలో సరికానిది ఏది?
1) గ్రీనిచ్‌ ప్రామాణిక సమయానికి, భారతదేశ ప్రామాణిక సమయానికి 5.30 గంటలు తేడా ఉంటుంది
2) భారతదేశ ప్రామాణిక రేఖాంశం 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం
3) 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం
భారత్‌లో అలహాబాద్‌, కాకినాడ పట్టణాల మీదుగా వెళ్తుంది
4) 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం భారత్‌లో 8రాష్ర్టాల గుండా వెళ్తుంది

29. భారత్‌ ఏ అక్షంశాల మధ్య విస్తరించి ఉంది?
1) 68071 ఉత్తర అక్షాంశం నుంచి 68071
దక్షిణ అక్షాంశం
2) 8041 ఉత్తర అక్షాంశం నుంచి
68071 ఉత్తర అక్షాంశం
3) 8041 ఉత్తర అక్షాంశం నుంచి
37061 ఉత్తర అక్షాంశం
4) 37061 ఉత్తర అక్షాంశం నుంచి
68071 ఉత్తర అక్షాంశం

30. ‘రాడ్‌క్లిఫ్‌ రేఖ’ ఏ దేశాల మధ్య సరిహద్దు ఒప్పంద రేఖగా ఉంది?
1) చైనా 2) బంగ్లాదేశ్‌
3) పాకిస్థాన్‌ 4) 2, 3

31. నీమ్‌రానా డైలాగ్‌కు సంబంధించిన కింది వ్యాఖ్యలను గమనించండి.
ఎ. ఇది భారత్‌, పాకిస్థాన్‌ మధ్య డైలాగ్‌
బి. ఇది భారత్‌, చైనా మధ్య డైలాగ్‌
సి. ఇది ట్రాక్‌ II డిప్ల్లమసీ భాగం
డి. భారత్‌ తరపున దీనికి అజిత్‌ డోభాల్‌ నాయకత్వం వహించాడు
1) ఎ, సి, డి 2) బి, సి
3) సి, డి 4) ఎ, సి

32. కింది వివరణను చదివి సరైన దాన్ని గుర్తించండి?
ఎ. భారత ప్రామాణిక రేఖాంశం పాండిచ్చేరి ప్రాంతంలోని యానాం గుండా వెలుతుంది
బి. భారత్‌ సుమారు 15,200 కి.మీ. భూ సరిహద్దును కలిగి ఉంది
సి. భారతదేశం ఎనిమిది దేశాలతో ఉమ్మడి భూ సరిహద్దును కలిగి ఉంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి

33. భారత్‌లోని ఏయే రాష్ర్టాల మీదుగా కర్కటరేఖ వెళుతుంది?
1) రాజస్థాన్‌, బీహార్‌, మేఘాలయ
2) గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర
3) ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మణిపూర్‌
4) పశ్చిమబెంగాల్‌, త్రిపుర, జార్ఖండ్‌

34. ప్రతిపాదన (ఎ): దక్షిణ భారత్‌లో అయనరేఖా శీతోష్ణస్థితి, ఉత్తర భారత్‌లో ఉప అయనరేఖా శీతోష్ణస్థితి ఉంటుంది.
కారణం (ఆర్‌): భారత్‌ సుమారు 3.28 మి. చ.కి.మీ వైశాల్యం కలిగి ఉంది.
పై వాటిలో సరైనది గుర్తించండి?
1) (ఎ), (ఆర్‌) సరైనవి. (ఆర్‌), (ఎ) కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్‌) రెండూ సరైనవి. (ఆర్‌), (ఎ) కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కాని (ఆర్‌) తప్పు
4) (ఎ) తప్పు కాని (ఆర్‌) నిజం

35. జతపరచండి?
1. 10 డిగ్రీల ఛానల్‌ ఎ. భారత్‌, మయన్మార్‌ దేశం మధ్య
2. 8 డిగ్రీల ఛానల్‌ బి. మినికాయ్‌ దీవి, సుహేళి దీవుల మధ్య
3. 9 డిగ్రీల ఛానల్‌ సి. మినికాయ్‌దీవి, మాల్దీవుల మధ్య
4. కోకో ఛానల్‌ డి. లిటిల్‌ అండమాన్‌, కార్‌నికోబార్‌ మధ్య
1) 1-బి ,2-ఎ ,3-డి, 4-సి
2) 1-డి,2-సి, 3-ఎ, 4-బి
3) 1-ఎ ,2-బి, 3-సి, 4-డి
4) 1-డి,2-సి, 3-బి, 4-ఎ

36. కింది వాటిలో సరికానిది?
1) భారతదేశ ప్రత్యేక ఆర్థికమండలి పరిధి 200 నాటికల్‌ మైళ్లు
2) లక్షదీవుల్లో చివరగా ఉన్న దీవి మినికాయ్‌ దీవి
3) పాకిస్థాన్‌..గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీర్‌ రాష్ర్టాలతో సరిహద్దును కలిగి ఉంది
4) అండమాన్‌ నికోబార్‌ దీవులు అగ్నిపర్వత టెర్షియరీ మహాయుగానికి చెందినవి

37. 100 డిగ్రీల ఛానల్‌ ఏ దీవులను వేరుచేస్తుంది?
1) గ్రేట్‌ అండమాన్‌, లిటిల్‌ అండమాన్‌
2) లిటిల్‌ అండమాన్‌, కార్‌ నికోబార్‌
3) లిటిల్‌ అండమాన్‌, గ్రేట్‌ నికోబార్‌
4) గ్రేట్‌ నికోబార్‌, కార్‌ నికోబార్‌

38. కింది వివరణను చదివి సరైన దాన్ని ఎంచుకోండి?
ఎ. భారతదేశ దక్షిణ కొన ఇందిరాపాయింట్‌ గ్రేట్‌ నికోబార్‌ దీవిలో ఉంది
బి. శిలా ఉపరితలం గల పాంబన్‌ దీవి మన్నార్‌ సింధుశాఖలో ఉంది
సి. ప్రసిద్ధి చెందిన నార్కొండమ్‌ అగ్నిపర్వతం కార్‌నికోబార్‌ దీవిలో ఉంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి



No comments:

Post a Comment