రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతి

 

భారత రాజ్యాంగ రచన - రాజ్యాంగ పరిషత్తు



రాజ్యాంగ అమలు తేది

జనవరి 26ను రాజ్యాంగ అమలు తేదీగా నిర్ణయించడానికి చారిత్రక నేపథ్యం ఉంది. నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ 'లాçహోర్సమావేశం'(1929 డిసెంబర్‌ 31) జనవరి 26ను పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా ప్రకటించింది. సంఘటనకు గుర్తుగా జనవరి 26ను అమలు తేదీగా నిర్ణయించారు.

రాజ్యాంగ పరిషత్తు ఇతర విధులు

భారత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనతోపాటు కొన్ని సాధారణ చట్టాలను కూడా రూపొందించి ఆమోదించింది. అందులోని ముఖ్యాంశాలు.

·         1947 జూలై 22 జాతీయ జెండాను ఆమోదించింది.

·         రాజ్యాంగ పరిషత్తు కేంద్ర శాసనసభగా కూడా పనిచేసింది. స్వతంత్ర శాసనసభగా 1947 నవంబర్‌ 17 సమావేశమై మొదటి స్పీకర్గా జి.వి.మౌలాంకర్ను ఎన్నుకుంది.

·         భారత రాజ్యాంగ పరిషత్తు చిహ్నంగా ఏనుగును గుర్తించింది.

·         దేవనాగరి లిపిలో ఉన్న హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా 1949 సెప్టెంబర్‌ 14 ఆమోదించింది.

·         కామన్వెల్త్లో భారత సభ్యత్వాన్ని 1949 మే నెలలో ధ్రువీకరించింది.

·         తొలి రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ను 1950 జనవరి 24 ఎన్నుకుంది (అప్పటి వరకు ఎన్నికైన పార్లమెంటు ఏర్పడలేదు కాబట్టి).

·         1950 జనవరి 24 జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించింది.

 

సబ్కమిటీలు

కమిటీ పేరు

చైర్మన్

ప్రాథమిక హక్కుల ఉప కమిటీ

జె.బి. కృపలాని

మైనారిటీల సబ్కమిటీ

హెచ్‌.సి.ముఖర్జీ

ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీ

గోపినాథ్బోర్డోలాయ్

ప్రత్యేక ప్రాంతాల కమిటీ

.వి.టక్కర్

రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతి

రాజ్యాంగ రచనలో పరిషత్తు అంశాన్నీ ఓటింగ్ద్వారా ఆమోదించలేదు. ప్రతి ప్రతిపాదనను, సమస్యను సుదీర్ఘంగా చర్చించి సర్దుబాటు, సమన్వయం లేదా ఏకాభిప్రాయ సాధన ద్వారా పరిష్కరించిందని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు 'గ్రాన్విలె ఆస్టిన్‌' పేర్కొన్నారు.

సమ్మతి పద్ధతి (Consensus)

ఒక సమస్య లేదా ప్రతిపాదన వచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చర్చల ద్వారా దాదాపు అందరు సభ్యులు ఒప్పుకునేలా చేసే పద్ధతి. పద్ధతి ద్వారా సమాఖ్య వ్యవస్థ, ప్రాంతాల ప్రత్యేకత, భాషకు సంబంధించిన అంశాలను పరిష్కరించారు.

సమన్వయ పద్ధతి (Accommodation)

ఒక సమస్యపై మధ్యే మార్గాన్ని సాధించడం. పరస్పర వ్యతిరేక వాదనలు ఉన్నప్పుడు సుదీర్ఘంగా చర్చించి గుణ దోషాలపై వివేచనతో, తర్కబద్ధంగా ఒక అభిప్రాయానికి రావడం. భారత రాజ్యాంగంలోని చాలా అంశాలను పద్ధతి ద్వారానే అంగీకరించారు.

రాజ్యాంగం  ముఖ్య ఆధారాలు

భారత రాజ్యాంగ రచనపై ఆనాటి ప్రపంచ రాజ్యాంగాల ప్రభావం గణనీయంగా ఉంది. వివిధ దేశాల్లోని రాజ్యాంగాల్లో ఉన్న ఉత్తమ లక్షణాలను స్వల్ప మార్పులతో రాజ్యాంగంలో పొందుపరిచారు. అందుకే భారత రాజ్యాంగాన్ని 'అతుకుల బొంత' అంటారు. మన రాజ్యాంగానికి అత్యంత ముఖ్యమైన ఆధారం భారత ప్రభుత్వ చట్టం1935. అందుకే రాజ్యాంగాన్ని '1935 చట్టానికి నకలు'గా అభివర్ణిస్తారు.

ఆధారం

గ్రహించిన అంశాలు

1935 చట్టం

కేంద్ర, రాష్ట్రాలతో సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్కోర్టు, రాష్ట్రపతి పాలన (ఆర్టికల్‌ 356), గవర్నర్‌        పదవి, విచక్షణాధికారాలు, పబ్లిక్సర్వీస్కమిషన్లు, ఇతర పరిపాలన అంశాలు.

బ్రిటిష్‌ రాజ్యాంగం

పార్లమెంటు/కేబినెట్తరహా పాలనా పద్ధతి, ద్విసభా పద్ధతి, సమన్యాయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంప్ట్రోలర్ఆడిటర్జనరల్,అటార్నీ జనరల్మొదలైన పదవులు,రిట్లు జారీచేసే విధానం.

అమెరికా రాజ్యాంగం

ప్రాథమిక హక్కులు, న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయశాఖ, ఉప రాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాలు ఆమోదం తెలపడం.

కెనడా

బలమైన కేంద్ర ప్రభుత్వం, గవర్నర్నియామక పద్ధతి. రాజ్యాంగం అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం, ఆర్టికల్‌ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం.

ఐర్లాండ్‌ రాజ్యాంగం

ఆదేశిక సుత్రాలు, రాష్ట్రపతిని ఎన్నుకునే నైష్పత్తిక ప్రాతినిధ్యం, ఓటు బదిలీ పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం.

వైమార్

జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులను రద్దుచేసే అధికారం రిపబ్లిక్‌(జర్మనీ) మొదలైనవి. (వైమార్అనేది జర్మనీ దేశ రాజ్యాంగ పరిషత్తు సమావేశమైన నగరం).

ఆస్ట్రేలియా

ఉమ్మడి జాబితా, పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం(బిల్లు ఆమోదం విషయంలో వివాదం తలెత్తితే),వాణిజ్య, వ్యాపార లావాదేవీలు, అంతర్రాష్ట వ్యాపారం.

దక్షిణాఫ్రికా

రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి.

ఫ్రాన్స్

గణతంత్ర విధానం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తాత్కాలిక సభా«ధ్యక్షుల నియామకం.

రష్యా

ప్రాథమిక విధులు, దీర్ఘకాలిక ప్రణాళిక, సామ్యవాద సూత్రాలు.

జపాన్

నిబంధన 21లో పేర్కొన్న చట్టం నిర్దేశించిన పద్ధతి.

స్విట్జర్లాండ్

ప్రధాని, మంత్రిమండలి మధ్య సమష్టి బాధ్యత.

భారత రాజ్యాంగంలో మౌలికాంశాలు

భారత రాజ్యాంగంలో కింది లక్షణాలను స్వతహాగా ఏర్పాటు చేసుకున్నాం.

·         రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం

·         పంచాయతీరాజ్వ్యవస్థ

·         అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులు.

·         రక్షిత వివక్షత

·         ఆర్థిక సంఘం, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్సర్వీస్కమిషన్, భాషా సంఘాలకు సంబంధించిన ప్రత్యేకాంశాలు.

·         ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ

·         అఖిల భారత సర్వీసులు 

·         ఏక పౌరసత్వం

రాజ్యాంగ పరిషత్తుఅదనపు, విశిష్ట సమాచారం

·         రాజ్యాంగ పరిషత్తు రచనకు అయిన ఖర్చు  రూ. 64 లక్షలు.

·         భారత రాజ్యాంగానికి ఆధార రాజ్యాంగాల సంఖ్య - 60

·         రాజ్యాంగ పరిషత్తులో నామినేటెడ్సభ్యుల సంఖ్య - 15. ముఖ్య నామినేటెడ్సభ్యులు.. సర్వేపల్లి రాధాకృష్ణన్, కె.టి.షా

·         రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కానివారు - బి.యన్‌.రావు, ఎస్‌.వరదాచారియర్, - హెచ్‌.వి.కామత్‌.

·         డాక్టర్బి.ఆర్‌.అంబేద్కర్రాజ్యాంగ నిర్మాత అని అభివర్ణించింది - అనంత శయనం అయ్యంగార్

·         బి.ఆర్‌.అంబేద్కర్ను 'నైపుణ్యం ఉన్న పైలెట్‌'గా పేర్కొంది - డాక్టర్రాజేంద్రప్రసాద్‌ 

·         డాక్టర్బి.ఆర్‌. అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి క్రిష్ణస్వామి అయ్యర్, బి.ఎన్‌.రావును 'పెట్టీ ఫోరం' అంటారు.

·         డాక్టర్బి.ఎన్‌.రావును'రాజ్యాంగ పరిషత్తుకు స్నేహితుడు,మార్గదర్శి,తత్వవేత్త'గా పేర్కొంటారు.

·         రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలు ప్రతిపాదించింది - హెచ్‌.వి.కామత్‌.

·         రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా వ్యవహరించింది  - హెచ్‌.బి.అయ్యంగార్

·         రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించినవారు - సోమనాథ్లహరి

·          రాజ్యాంగ వి«ధులను నిర్వర్తించే సమయంలో మాత్రమే డాక్టర్రాజేంద్రప్రసాద్అధ్యక్షులుగా వ్యవహరించారు.

·          రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులు నిర్వహించినప్పుడు జి.వి. మౌలాంకర్స్పీకర్గా వ్యవహరించారు. అనంత శయనం అయ్యంగార్ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

·          రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి చివరిగా బ్రిటిష్గవర్నర్జనరల్మౌంట్బాటన్మాట్లాడారు.

·          రాజ్యాంగ రచన కాలీగ్రాఫర్‌ - ప్రేమ్బెహారి నారాయిణ్రైజ్దా. రాజ్యాంగానికి, ప్రవేశికకు ఆర్ట్వర్క్చేసిందినందన్లాల్బోస్‌.

·          హన్సా మెహతా భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తులో సమర్పించారు.

·          మౌలిక రాజ్యాంగ ప్రతిని పార్లమెంట్గ్రంథాలయంలో భద్రపరిచారు. మౌలిక రాజ్యాంగంలో 230 పేజీలు ఉన్నాయి.

రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం పనితీరుపై విమర్శ

·         రాజ్యాంగ పరిషత్తు సార్వభౌమ సంస్థ కాదు. ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహించలేదు. కేవలం 28 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది.

·         ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి అవసరమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అవరోధం కల్పించింది.

·         స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు నామినేషన్పద్ధతి ద్వారా సభ్యత్వం పొందడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.

·         రాజ్యాంగ పద్ధతిలో ఒక వర్గం (హిందువులు) ఆధిపత్యం ఉండేదని పాశ్చాత్య రచయితల అభిప్రాయం.

రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగంపై ప్రముఖుల అభిప్రాయాలు 

·         భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చినవారు -హెచ్‌.వి.కామత్

·         భారత రాజ్యాంగం ప్రజల అవసరాలను, ప్రయోజనాలను నెరవేర్చింది. పరిషత్తుకు సార్వభౌమాధికారం లేదనే వాదనను తిరస్కరిస్తున్నా.     - జవహర్లాల్నెహ్రూ

·         భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం, సుదీర్ఘమైంది, దివ్యమైంది    - సర్ఐవర్జెన్నింగ్స్

·         అతుకుల బొంత. రాజ్యాంగ పరిషత్తులో గ్యాంగ్ఆఫ్ఫోర్‌: నెహ్రూ, పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్‌ - గ్రాన్విల్ఆస్టిన్

·         భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాలన్నింటిని కొల్లగొట్టి రూపొందించిందిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు; రాజ్యాంగం వైఫల్యం చెందితే దాన్ని నిందించరాదు. అమలు చేసే వారినే నిందించాలి   - బి.ఆర్‌.అంబేద్కర్

·         రాజ్యాంగ పరిషత్కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది- లార్డ్సైమన్

·         రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది- విన్స్టన్చర్చిల్

రాజ్యాంగ పరిషత్సమావేశాలు

మావేశాలు

కాలం

పని విధానం దశలు

మొదటి సమావేశం

1946 డిసెంబర్‌ 09-23

I. దశలో రాజ్యాంగ రచన విధుల్ని నిర్వర్తించింది.

రెండో సమావేశం

1947 జనవరి 20-25

మూడో సమావేశం

1947 ఏప్రిల్‌ 28-మే 02

నాలుగో సమావేశం

1947 జూలై 14-31

అయిదో సమావేశం

1947 ఆగస్టు 14-30

ఆరో సమావేశం

1948 జనవరి 27

ఏడో సమావేశం

1948 నవంబర్‌ 4 నుంచి 1949 జనవరి 08

II.రాజ్యాంగ రచన విధులతో పాటు తాత్కాలిక పార్లమెంటు విధులను కూడా నిర్వర్తించింది.

ఎనిమిదో సమావేశం

1949 మే 16 - జూన్‌ 16

తొమ్మిదో సమావేశం

1949 జూలై 30 - సెప్టెంబర్‌ 18

పదో సమావేశం

1949 అక్టోబర్‌ 6-17

పదకొండో సమావేశం

1949 నవంబర్‌ 14-26

III.1949నుంచి 1952 వరకు కేవలం తాత్కాలిక పార్లమెంటు విధులను మాత్రమే నిర్వర్తించింది.

ముఖ్య ప్రపంచ రాజ్యాంగాల రచనా కాలం తులనాత్మక పరిశీలన

దేశం

ప్రకరణల సంఖ్య

రచనకు పట్టిన కాల వ్యవధి

అమెరికా

7

నాలుగు నెలల కంటే తక్కువ కాలం

కెనడా

147

2 సంవత్సరాల 6 నెలలు

ఆస్ట్రేలియా

126

9 సంవత్సరాలు

దక్షిణాఫ్రికా

153

1 సంవత్సరం

భారతదేశం

395

2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు

 

1 comment:

  1. Keep in thoughts that the layout of the slot games doesn't differ 카지노 사이트 between the demo versions and the paid versions. In both cases, you will function on a display with selection of|quite so much of|a big selection of} choices. You'll see a field that shows the steadiness out there on your account or, in different phrases, the funds have the ability to|you probably can} guess with. A set of extra buttons will assist you to manage your guess, set the drum rotation choices, select an autoplay option, look at further details, and extra. Playing free slot games is not a taboo for the vast majority of internet surfers. Literally, hundreds of 1000's of internet sites} are currently offering the so-called free slots to their guests.

    ReplyDelete