AP TET Result 2022 Link
ఆంధ్రప్రదేశ్‌లో (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) టెట్ 2022 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేశారు. కావున అభ్యర్థులు తాము సాధించిన మార్కుల వివరాలను తెలుసుకోవాలంటే.. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి https://aptet.apcfss.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
షెడ్యూల్ ప్రకారమైతే సెప్టెంబర్ 14వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇదే తేదీన ఫైనల్ 'కీ' ని ప్రకటించారు కానీ.. రిజల్ట్స్ మాత్రం ప్రకటించలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల రిజల్ట్స్ ఆలస్యం అయ్యాయి. ఆగస్టు 6వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ను నిర్వహించిన సంగతి తెలిసిందే.
How to Check AP TET 2022 Results ?
☛ Visit direct link available on https://aptet.apcfss.in/ or Direct Link Click here
☛ Enter your details and Click on Login
☛ The results will be displayed on the screen
☛ Download a copy of the score card for further reference
కనీస అర్హత మార్కులు ఇలా..?
టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి ఈ పరీక్ష రాశారు.జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.
Download AP TET Question Papers 2022 and Key
No comments:
Post a Comment