Physics and Chemistry Questions in Telugu for APPSC/TSPSC Group 1,Group 2, Group 4, Si, Constable Exams
1. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. ఆర్బిటాళ్ల గరిష్ఠ అతిపాతం వల్ల బలమైన రసాయన బంధం ఏర్పడుతుంది
బి. BCl3 అణువులో SP3 సంకరీకరణం జరుగుతుంది
1) ఎ, బి
2) బి మాత్రమే
3) ఎ మాత్రమే
4) ఏదీకాదు
2. కింది వాటిలో ఏది సరైనది?
ఎ. C2H4లో త్రికబంధం ఏర్పడుతుంది
బి. C2H2లో ద్విబంధం ఏర్పడుతుంది
సి. BeCl2a లో ఏక బంధం ఏర్పడుతుంది
1) బి మాత్రమే
2) సి మాత్రమే
3) ఎ, సి మాత్రమే
4) బి, సి మాత్రమే
3. కింది వాటిలో సరికానిది ఏది?(4)
ఎ. H2O అణువులో రెండు సిగ్మా బంధాలుంటాయి
బి. CH4 అణువులో నాలుగు సిగ్మా బంధాలుంటాయి
1) ఎ మాత్రమే
2) బి మాత్రమే
3) ఎ, బి
4) ఏదీ కాదు
4. కింది వాటిలో బలమైన అయానిక బంధాన్ని ఏర్పరిచేవి.
1) క్షార మృత్తిక లోహాలు, హాలోజన్‌లు
2) క్షార లోహాలు, హాలోజన్‌లు
3) లోహాలు, అలోహాలు
4) క్షార లోహాలు, క్షార మృత్తిక లోహాలు
5. కింది వాటిలో SP అతిపాతం కలిగిన అణువులు ఏవి?
ఎ. Br2 బి. HCl
సి. Cl2 డి. HBr
1) బి, డి మాత్రమే
2) ఎ, సి మాత్రమే
3) బి మాత్రమే
4) బి, సి మాత్రమే
6. CS అణువులో CS, Fల మధ్య గల బంధం ఏది?
1) సంయోజనీయ బంధం
2) అయానిక బంధం
3) లోహ బంధం
4) సమన్వయ సమయోజనీయ బంధం
7. కింది ఆనయాన్‌లో Ne ఎలక్టాన్ విన్యాసం పొందింది ఏది?
1) Cl-
2) O2-
3) p-3
4) Br-
8. ఎసిటిలీన్ (C2H2) అణువులో ఉండే సిగ్మా, పై బంధాల సంఖ్య ఎంత?
1) ఒక సిగ్మా, ఒక పై
2) ఒక సిగ్మా, రెండు పై
3) రెండు సిగ్మా, ఒక పై
4) మూడు సిగ్మా, రెండు పై
9. ఆక్సిజన్ (O2) అణువులో ఉండే సిగ్మా, పై బంధాల సంఖ్య ఎంత?
1)ఒక సిగ్మా, ఒక పై
2) ఒక సిగ్మా, రెండు పై
3) రెండు సిగ్మా, రెండు పై
4) మూడు సిగ్మా, రెండు పై
10. HCl అణువు కింది వాటిలో దేనికి ఉదాహరణ?
1) ధ్రువ బంధం
2) అధ్రువ బంధం
3) సమన్వయ సమయోజనీయ బంధం
4) ఏదీ కాదు
Answers:
- 3
- 2
- 4
- 2
- 1
- 2
- 2
- 2
- 1
- 1
No comments:
Post a Comment