తెలంగాణలో ఉద్యోగాల జాతర (TS Jobs 2022) రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు



తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు అందించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో 80,039 ఉద్యోగాలకు నేడే నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 11,103 పోస్టుల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్పారు. 95శాతం స్థానికత కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామని కేసీఆర్‌ చెప్పారు. అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు వస్తాయన్నారు. ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని వివరించారు. నియామకాల్లో 95శాతం స్థానిక కోటా సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అని సీఎం చెప్పారు.


గరిష్ఠ వయో పరిమితి పెంపు

ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పెంచుతున్నట్లు కేసీఆర్ సభలో ప్రకటించారు. పదేళ్లపాటు పెంచినట్లు తెలిపారు. ఓసీ అభ్యర్థులకు గరిష్ఠంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లుగా నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. దివ్యాంగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 54 ఏళ్లకు పెంచినట్లు వివరించారు. ఎక్స్‌సర్వీస్‌మెన్లకు 47 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు.

శాఖల వారీగా ఖాళీల వివరాలివీ..


సీఎం కేసీఆర్‌ ప్రకటన ప్రకారం శాఖల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే.. హోంశాఖలో 18,334 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 13,086, వైద్యారోగ్య- కుటుంబ సంక్షేమ శాఖలో 12,755, ఉన్నత విద్యాశాఖలో 7,878, బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ శాఖలో 3,560, ఎస్సీల అభివృద్ధి శాఖ 2,879, నీటిపారుదల- కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ 2,692, గిరిజన సంక్షేమశాఖ 2,399, మైనార్టీ సంక్షేమశాఖ 1,825, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 1,598, పంచాయతీరాజ్‌- గ్రామీణాభివృద్ధి శాఖ 1,455, కార్మిక-ఉపాధి కల్పన శాఖలో 1,221 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.

ఆర్థికశాఖలో 1,146 పోస్టులు.. స్త్రీ, శిశు సంక్షేమశాఖ 895, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 859, వ్యవసాయ-సహకార 801, ట్రాన్స్‌పోర్ట్‌- ఆర్‌అండ్‌బీ శాఖ 563, న్యాయశాఖ 386, పశుసంవర్థక, మత్స్యశాఖ 353, సాధారణ పరిపాలన శాఖ 343, పరిశ్రమలు-వాణిజ్యశాఖ 233, యువజన సర్వీసులు-పర్యాటక, సాంస్కృతిక శాఖ 184, ప్రణాళిక శాఖ 136, పౌరసరఫరాల శాఖ 106, లెజిస్లేచర్‌ 25, ఎనర్జీ 16 పోస్టులు.. ఇలా మొత్తం 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కేసీఆర్‌ తన ప్రకటనలో వెల్లడించారు.

గ్రూప్స్‌.. లోకల్‌ కేడర్‌ వారీగా..

గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌- 4 వరకు భర్తీ చేయనున్న ఖాళీలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్‌-1 కింద 503, గ్రూప్‌-2 (582), గ్రూప్‌-3 (1,373), గ్రూప్‌-4 (9,168) పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు. లోకల్‌ కేడర్‌ వారీగా పరిశీలిస్తే జిల్లా స్థాయిలో 39,829, జోనల్‌లో 18,866, మల్టీ జోనల్‌లో 13,170, మిగిలిన విభాగాలు, యూనివర్సిటీల్లో 8,174 పోస్టులను భర్తీ చేయనున్నారు.

జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య ఇదీ..


జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 39,829 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలను కింది టేబుల్‌లో చూడొచ్చు..

No comments:

Post a Comment