AWES Teacher Jobs: ఏడబ్ల్యూఈఎస్ - 8700 టీచర్ పోస్టులు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (ఏడబ్ల్యూఈఎస్) దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో కింది టీచర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
* టీచర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 8700
పోస్టులు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ).
అర్హత:
1) పీజీటీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.
2) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ ఉత్తీర్ణత.
3) ప్రైమరీ టీచర్లు కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, రెండేళ్ల డిప్లొమా (ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)/ బీఈడీ ఉత్తీర్ణత.
వయసు: ఫ్రెష్ అభ్యర్థులు 01.04.2021 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. ఐదేళ్లకు తగ్గకుండా టీచింగ్ అనుభవం ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులు 57 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (ఓఎస్‌టీ), ఇంటర్వ్యూ, టీచింగ్ నైపుణ్యాలు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో (ఎంసీక్యూ) ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.385 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరి తేది: 28.01.2022.
ఆన్‌లైన్‌లో అడ్మిట్ కార్డుల విడుదల తేది: 10.02.2022 నుంచి అందుబాటులో ఉంచుతారు.
స్క్రీనింగ్ టెస్ట్ తేదీలు: 2022, ఫిబ్రవరి 19, 20.
No comments:
Post a Comment