APPSC: గుడ్ న్యూస్ ఏపీలో 190 ఉద్యోగాలకు నోటిఫికేషన్

 రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.




విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..


* అసిస్టెంట్‌ ఇంజినీర్లు


మొత్తం ఖాళీలు: 190 (క్యారీ ఫ్వార్వర్డ్‌ ఖాళీలు-35, తాజా ఖాళీలు-155)

విభాగాలు: సివిల్‌, ఈఎన్‌వీ, మెకానికల్‌.

సర్వీసులు: ఏపీ ఆర్‌డబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌ ఇంజినీరింగ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌, పీహెచ్‌ అండ్‌ ఎంఈ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎంపీఎల్‌ ఇంజినీరింగ్ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ గ్రౌండ్‌ వాటర్‌ సబార్డినేట్‌ సర్వీస్, ఏపీ పంచాయతీ రాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్ సబార్డినేట్‌ సర్వీసులు, ఎండోమెంట్ సబార్డినేట్‌ సర్వీస్‌, ఏపీ వాటర్‌ రిసోర్సెస్‌ సబార్డినేట్‌ సర్వీస్.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధి సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌, ఎల్‌సీఈ/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీన్ని మొత్తం 300 మార్కులకి నిర్వహిస్తారు. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ & మెంటల్‌ ఎబిలిటీ (డిగ్రీ స్థాయి), పేపర్ 2 సివిల్‌/ మెకానికల్‌ (డిప్లొమా స్థాయి) నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.
1) జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ --150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
2) సివిల్‌/ మెకానికల్‌ (కామన్‌)--  150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు
3) ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ (పోస్ట్‌ కోడ్‌ 3కి మాత్రమే)-- 150 ప్రశ్నలు 150 నిమిషాలు 150 మార్కులు


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.10.2021.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది: 11.11.2021.

No comments:

Post a Comment