ఈ విషయాన్ని సింగపూర్‌కి చెందిన సైబర్ రీసెర్చ్ సంస్థ సైఫర్మా వెల్లడించింది. 2020, జూన్ 18వ తేదీ తర్వాత చైనా ఆర్మీ(పీఎల్‌ఏ)మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు ఒక్కసారిగా 300 శాతం మేర పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ కంప్యూటర్ రెస్పాన్స్ టీం(సీఈఆర్టీ)తో పంచుకున్నట్లు తెలిపింది.
బీజింగ్ కేంద్రంగా...
ముఖ్యంగా చైనాలోని బీజింగ్, గ్వాంగ్‌ర, షెంజెన్, చెంగ్డులోని స్థావరాల నుంచి సైబర్ దాడులు ఎక్కువగా జరిగినట్లు సైఫర్మా సీఎండీ కుమార్ రితేశ్ వెల్లడించారు. ‘‘ప్రభుత్వ అండతో నడిచే గోధిక్ పాండా, స్టోన్ పాండా అనే హ్యాకింగ్ ఏజెన్సీలు తమ ఉనికి బయటపడకుండా ఉండేందుకు చైనాకు బదులుగా అమెరికా, యూరప్, ఇతర ఆసియా దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. చైనా ఆర్మీకి చెందిన మౌలిక వసతులను ఇవి ఉపయోగించుకుంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. హ్యాకర్ల సంభాషణను డీకోడ్ చేయగా తరచుగా ‘భారత్‌కు గుణపాఠం చెప్పాలి’వంటివి ఎక్కువగా వాడుతున్నట్లు తేలిందని వివరించారు.
No comments:
Post a Comment