అత్యవసర వైద్య సేవలందించే 1,088 వాహనాలను (108–104 కలిపి) విజయవాడ బెంజ్ సర్కిల్‌లో జూలై 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 1,088 వాహనాల కోసం ప్రభుత్వం రూ.203 కోట్లు ఖర్చు చేసింది. కొత్త, పాత అంబులెన్స్‌లతో పాటు, మొత్తం ఎంఎంయూల నిర్వహణకు ఏటా రూ.318.93 కోట్లు ఖర్చు కానుంది.
జనాభా–అంబులెన్స్‌ల నిష్పత్తి
- గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండనుంది.
- గతంలో సంవత్సరానికి 6,33,600 కేసుల్లో సేవలందించగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో ఏడాదికి 12 లక్షల మందికి సేవలందించేలా తీర్చిదిద్దారు.
- ప్రతి మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లో ఒక వైద్య అధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఉంటారు.
- ప్రతి ఎంఎంయూలో ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ)తో పాటు, గ్లోబల్ పొజిషనింగ్ విధానం (జీపీఎస్) కూడా ఉంటుంది.
- ఆధార్ కోసం బయోమెట్రిక్ ఉపకరణాలు, రోగుల డేటాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం కోసం ట్యాబ్, పర్సనల్ కంప్యూటర్ (పీసీ) కూడా ఎంఎంయూలలో ఏర్పాటు చేశారు. తద్వారా రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయడం సులువు అవుతుంది.
- మొత్తం 20 రకాల సేవలందించేలా 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేస్తూ ప్రభుత్వం ఎంఎంయూలను తీర్చిదిద్దింది.
- అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే ఆదుకునే 108 సర్వీసులో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు. కొత్తగా 412 అంబులెన్స్‌లను కొనుగోలు చేసి, ఈ సరీ్వసు కోసం సిద్ధం చేయగా, ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్స్‌లను కూడా వినియోగించనున్నారు.
- కొత్తగా సిద్ధం చేసిన 412 అంబులెన్స్‌లలో 282 బేసిక్ లైఫ్ సపోర్టు (బీఎల్‌ఎస్)కు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్‌ఎస్)గా తీర్చిదిద్దారు.
- మరో 26 అంబులెన్స్‌లను చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలందించేలా తయారు చేశారు.
- పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ఆ స్థాయిలో సర్వీసులను ప్రారంభిస్తున్నారు.
- ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్ చేసిన వారిని వేగంగా ట్రాక్ చేసే వీలు కలుగుతుంది.
- ప్రతి అంబులెన్స్‌లో ఒక కెమెరా, ఒక మొబైల్ డేటా టెర్మినల్ (ఎండీటీ), మొబైల్ ఫోన్‌తో పాటు, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్ (ఏవీఎల్‌టీ) బాక్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment