రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని కలిగించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ చారిత్రక ఘట్టానికి విజయవాడలోని స్వరాజ్ మైదాన్ వేదిక కానుంది. విగ్రహ ఏర్పాటుతో పాటు పార్కు తదితర నిర్మాణ పనులకు జూలై 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే చూడదగ్గ ప్రదేశంగా అంబేడ్కర్ మెమోరియల్ పార్క్‌ను తీర్చిదిద్దుతామన్నారు.
అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్‌గా నామకరణం
నీటిపారుదల శాఖకు చెందిన 20.22 ఎకరాల విస్తీర్ణంలో పీడబ్ల్యూడీ మైదానం ఉంది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 1997లో దీని పేరు ‘స్వరాజ్ మైదాన్’గా మార్చింది.
ఇప్పుడు ఈ మైదానానికే ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’గా ప్రభుత్వం నామకరణం చేసింది.
ఏడాదిలోగా ఈ పనులన్నీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. విగ్రహ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఏపీఐఐసీకి అప్పగించింది.
20 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మారక మందిరంతో పాటు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే విగ్రహం చుట్టూ ఆహ్లాదకరమైన పూదోట (పార్కు), ఓపెన్ ఎయిర్ థియేటర్‌తోపాటు వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయనున్నారు.
No comments:
Post a Comment