ఏ క్రీడలోనైనా వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్న తొలి అరబ్ మహిళగా గుర్తింపు తెచ్చుకున్న స్క్వాష్ దిగ్గజం రనీమ్ ఎల్ వెలిలీ ఆటకు వీడ్కోలు పలికింది.
తాను ఇప్పటికిప్పుడు రిటైర్ అవుతున్నట్లు ఆమె అనూహ్యంగా ప్రకటించింది. 18 సంవత్సరాల విజయవంతమైన అంతర్జాతీయ స్క్వాష్ కెరీర్‌లో రనీమ్ 24 పీఎస్‌ఏ టైటిల్స్ గెలుచుకుంది. ఇందులో 2017లో సాధించిన వరల్డ్ చాంపియన్‌షిప్ కూడా ఉంది.
2019 నుంచి...
2015లో తొలి సారి ప్రపంచ ర్యాంకింగ్‌సలో అగ్రస్థానానికి చేరిన 31 ఏళ్ల ఈ ఈజిప్ట్ క్రీడాకారిణి 2019, మే నుంచి ఇప్పటి వరకు వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఈజిప్ట్ వరల్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న నాలుగు సందర్భాల్లో కూడా ఆమె జట్టులో భాగంగా ఉంది. 2019లో రనీమ్ భర్త తారిక్ మోమెన్ కూడా వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించడంతో ఏ క్రీడలోనైనా ప్రపంచ విజేతలుగా నిలిచిన ఏకై క భార్యాభర్తల జోడీగా వీరిద్దరు రికార్డు సృష్టించారు.
No comments:
Post a Comment